నాగరి లిపి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగరి లిపి
సా.శ. 1035నాటి నాగరిలిపిలోని రాగిరేకులు
Spoken languagesసంస్కృతం
పాత జావాభాష
Time periodసా.శ. 750 నుండి నేటివరకు
Parent systems
Child systemsదేవనాగరి
నందినాగరి
Sister systemsశారదా లిపి
సిద్ధం లిపి
Note: This page may contain IPA phonetic symbols in Unicode.

నాగరి లిపి, దేవనాగరి, నందినాగరి లిపులకి మూలమైన లిపి. ఇది తొలిమధ్యయుగాలనాటి, గుప్త లిపి నుండి ఉద్భవించింది. దీనిని సంస్కృతం, ప్రాకృతభాషలను రాసేందుకు ఉపయోగించేవారు. ప్రాచీన బ్రాహ్మీ లిపి కుటుంబానికి[1] చెందిన ఈ నాగరి లిపిని వాడినట్టుగా లభించిన ప్రాచీన ఆధారాలు., సా.శ. 1-4శతబ్దాల మధ్యకాలానికి చెందినవి.[2] సా.శ. 7వ శతాబ్దం నుండి విరివిగా వాడబడిన ఈ నాగరి లిపి., సా.శ. 10 శతాబ్దం చివరకి, దేవనాగరి, నందినాగరిలిపులుగా మార్పు చెందింది[3].

మూలాలు[మార్చు]

తొలి మధ్యయుగాలనాటి గుప్త లిపి యొక్క మధ్య-ప్రాచ్య మాండలికంగా నాగరిలిపి వేరుపడింది (పాశ్చాత్య మాండలికంగా శారదా లిపి, దూరప్రాచ్య మాండలికంగా సిద్ధం లిపి కూడా వేరుపడ్డాయి). తర్వాతి కాలంలో దేవనాగరి, నందినాగరి లిపులకి మూలమైన నాగరిలిపి, శారదా లిపి నుండి ఉద్భవించిన గురుముఖి లిపిని కూడా ప్రభావితం చేసింది.

భారతదేశం వెలుపల[మార్చు]

సా.శ. 7వ శతాబ్దానికి చెందిన టిబెట్ రాజు స్రోంగ్-త్సాంగ్-గాంబొ విదేశీ గ్రంథాలన్నిటినీ, టిబెట్ భాషలో అనువదించేందుకు వీలుగా అక్షరాలను, వ్రాసే పద్ధతులను నేర్చుకొమ్మని, తన రాయబారి తొన్మి సంబోటాని భారతదేశానికి పంపగా, అతడు టిబెట్ భాషకి అనువైన 24 నాగరి అక్షరాలను., స్థానిక భాషకి అనుగుణంగా 6 కొత్త అక్షరాలను తీసుకొని వెళ్ళాడు.[4]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. George Cardona and Danesh Jain (2003), The Indo-Aryan Languages, Routledge, ISBN 978-0415772945, pages 68-69
  2. Gazetteer of the Bombay Presidency, p. 30, గూగుల్ బుక్స్ వద్ద, Rudradaman’s inscription from 1st through 4th century CE found in Gujarat, India, Stanford University Archives, pages 30-45
  3. Nandanagiri Unicode Standards
  4. William Woodville Rockhill, Annual Report of the Board of Regents of the Smithsonian Institution, p. 671, గూగుల్ బుక్స్ వద్ద, United States National Museum, page 671