నందినాగరి
నందినాగరి | |
---|---|
Spoken languages | సంస్కృతం |
Time period | సా.శ. 8వ శతాబ్దం - నేటి వరకూ |
Parent systems |
బ్రాహ్మీ లిపి
|
Sister systems | దేవనాగరి బెంగాలీ లిపి |
Unicode range | లేదు. |
Note: This page may contain IPA phonetic symbols in Unicode. |
నందినాగరి లిపి, సా.శ. 7 వ శతాబ్దంలో నాగరి లిపినుండి ఉద్భవించిన, బ్రాహ్మిక లిపి. .[1]. ఈ లిపి, దీనిలోని మాండలికాలు దక్షిణ భారతదేశంలో వాడుకలో ఉండేవి. అంతేగాకుండా, నందినాగరి లిపిలో కనుగొనబడిన సంస్కృత తాళపత్రగంధాలు ఇంకా అనువదింపబడలేదు.[2][3] . మధ్వాచార్యుని ద్వైత వేదాంత పాఠశాలకి చెందినవిగా భావిస్తున్న వ్రాతపత్రులు, నందినాగరిలోనే ఉన్నాయి.[4]
దీని సోదరిలిపి అయిన దేవనాగరి, భారతదేశం ఇతర ప్రాంతాలన్నిటిలోనూ వాడుకలో ఉంది.
నామశాస్త్రం
[మార్చు]“నందినాగరి” అనే పేరు ఎందుకు వచ్చిందనే ప్రశ్న స్పష్టమైన సమాధానం లేదు. బహుశా “నంది” అనేది, పవిత్రమైన అనే అర్థంలో వాడబడుతూండవచ్చు.
చరిత్ర
[మార్చు]బ్రాహ్మీ లిపి కుటుంబానికి చెందిన నందినాగరి లిపి, సా.శ. 8 -19 శతాబ్దాల మధ్యకాలంలో, దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, దక్షిణ మహారాష్ట్రలలో సంస్కృత గ్రంథాలకి, శాసనాలకి వినియోగింపబడింది. నందినాగరి, ప్రాచీనమైన శాసనాలు కొన్నింటిని తమిళనాడులో కూడా కనుగొన్నారు. మహాబలిపురంలో, సా.శ. వ శతాబ్దానికి చెందిన నరసింహ పల్లవుని రాతిశాసనాలు, సా.శ. 10వ శతాబ్దానికి చెందిన చోళ రాజరాజు కాలానికి చెందిన నాణేలు, నందినాగరి లిపిలోనే ఉన్నాయి.[5][6] ఋగ్వేదం, [7] ఇతర వేదాలేకాకుండా, [8] సా.శ. 1వ శతాబ్దంనాటి విక్రమచరిత్ర వ్రాతప్రతులు కూడా నందినాగరి లిపిలో లభ్యమవుతున్నాయి.[9][10]
తిరువనంతపురం (కేరళ) లోని ఒక గుడిలో లభించిన, అనంతశయన మహాత్మం అనే తాళపత్రగ్రంథం కూడా నందినాగరి లిపిలోనే ఉంది.[11] విజయనగర సామ్రాజ్య కాలంలో సంస్కృతం వ్రాసేందుకు, తాళపత్రగంథాలలోనూ, రాగిరేకులమీద నాగరిలిపినే ఉపయోగించారు.[12] నందినాగరిలిపిలో వ్రాయబడిన ఎన్నో సంస్కృత వ్రాతప్రతులు దక్షిణ భారతదేశంలో దొరికినప్పటికీ, ఈ లిపిపైన, లిపిలో లభ్యమవుతున్న శాస్త్రసాహిత్యంపైన అంతగా అధ్యయనం జరగలేదు.[13] వీటిలో వేదాలు, వేదాంతాలు, వేదాంతభాష్యాలు, [14] పురాణాలు, విజ్ఞానశాస్త్రాలు, కళలు సంబంధించిన అనేక గ్రంథాలు ఉన్నాయి.[3][15][16] ఇవన్నీ దక్షిణ భారతదేశంలో ఉన్న వివిధ వ్రాతప్రతి గ్రంథాలయాల్లో, భద్రపరచబడి ఉన్నాయి.[2] కొన్ని నందినాగరి వ్రాతలు, ద్వైలిపిలో (రెండేసి లిపుల్లో), తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం వంటి ప్రధాన దక్షిణ భాషా లిపులతో కూడి ఉన్నాయి.[17]
యూనికోడ్ లో నందినాగరి
[మార్చు]యూనికోడ్ లో నందినాగరికి, కోడ్స్ కేటాయించబడ్డాయికానీ., ఇప్పటికీ వినియోగింపబడలేదు.[18]
చిత్రమాలిక
[మార్చు]-
సదాశివ రాయల కాలానికి (సా.శ. 16వ శతాబ్దం ) చెందిన సంస్కృత రాగిరేకులు (నందినాగరి లిపి).[12] నందినాగరి వ్రాతప్రతులను లోహపు రేకులపైన, తాటి ఆకులమీద, రాతిపెళ్లలమీద, కాగితాలమీద వ్రాసి భద్రపరిస్తూ ఉండేవారు.
-
అచ్యుత దేవ రాయల కాలానికి (సా.శ. 1537) చెందిన నందినాగరి లిపిలోని సంస్కృత వ్రాతప్రతులు ఉన్న రాగిరేకులు. ఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో ప్రదర్శింపబడుతున్నది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ George Cardona and Danesh Jain (2003), The Indo-Aryan Languages, Routledge, ISBN 978-0415772945, page 75
- ↑ 2.0 2.1 Reinhold Grünendahl (2001), South Indian Scripts in Sanskrit Manuscripts and Prints, Otto Harrassowitz Verlag, ISBN 978-3447045049, pages xxii, 201-210
- ↑ 3.0 3.1 P. Visalakshy (2003), The Fundamentals of Manuscriptology, Dravidian Linguistics Association, ISBN 978-8185691107, pages 55-62
- ↑ Friedrich Otto Schrader (1988), A descriptive catalogue of the Sanskrit manuscripts in the Adyar Library, Otto Harrassowitz Verlag
- ↑ Nagari script Archived 2016-03-04 at the Wayback Machine Department of Archaeology, Government of Tamil Nadu (2011)
- ↑ I Nakacami (2008), Mahabalipuram (Mamallapuram), Oxford University Press, ISBN 978-0195693737, pages 29-30
- ↑ AC Burnell, Elements of South-Indian Palaeography from the Fourth to the Seventeenth Century AD, Cambridge University Press, ISBN 978-1108046107, page 61 with footnote 1
- ↑ MacKenzie Collection of Oriental Manuscripts, p. PA3, గూగుల్ బుక్స్ వద్ద, Asiatic Society of Bengal, pages 3, 6-7
- ↑ A Hindu Book of Tales: The Vikramacarita, Franklin Edgerton, The American Journal of Philology, Volume 33, No. 131, page 249-252
- ↑ A Hindu Book of Tales: The Vikramacarita, Franklin Edgerton, The American Journal of Philology, Volume 33, No. 131, page 262
- ↑ HH Wilson and Colin Mackenzie, Mackenzie Collection: A Descriptive Catalogue of the Oriental Manuscripts, p. 62, గూగుల్ బుక్స్ వద్ద, Asiatic Society, page 62
- ↑ 12.0 12.1 A Survey of Nandinagari Manuscript Recognition System Archived 2016-03-04 at the Wayback Machine Prathima and Guruprasad Rao (2011), International Journal of Science & Technology, 1(1), pages 30-35
- ↑ Reinhold Grünendahl (2001), South Indian Scripts in Sanskrit Manuscripts and Prints: Grantha Tamil - Malayalam - Telugu - Kannada - Nandinagari, Otto Harrassowitz Verlag, ISBN 978-3447045049, page xxii
- ↑ David Pingree (1981), Census of the Exact Sciences in Sanskrit, Volume 4, American Philosophical Society, ISBN 978-0871691460, pages 29, 201, 217, 260, 269, 409
- ↑ A Descriptive Catalogue of the Oriental Manuscripts, p. PA2, గూగుల్ బుక్స్ వద్ద, HH Wilson, Mackenzie Collection of Nandinagari, Devanagari, Grandham and Telugu Manuscripts (South India), pages 2-8, 12-14
- ↑ David Pingree (1970), Census of the Exact Sciences in Sanskrit, Volume 5, American Philosophical Society, ISBN 978-0871692139, pages 26-27, 79-81, 237-241
- ↑ David Pingree (1970), Census of the Exact Sciences in Sanskrit, Volume 1 and 2, American Philosophical Society, ISBN 978-0871690814, see Preface and Introduction
- ↑ Unicode Status (Nandinagari), Script Source, SIL International, United States (2014)
బయటి లింకులు
[మార్చు]- Palaeographical Importance of Nandinagari, HareKrsna.com