Jump to content

సదాశివ రాయలు

వికీపీడియా నుండి
విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
రామ రాయ 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవ రాయలు 1617-1632
పెద వేంకట రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646

ఇతను కేవలం నామమాత్ర పరిపాలకుడు మాత్రమే, అధికారము మొత్తం పెదతిరుమలయ్యదేవమహారాయలు చేతిలో ఉండెడిది. కానీ తరువాత అళియ రామ రాయలు కూడా అధికారం కోసం పోటీ పడినాడు. ఈ కాలమున విజయనగరం అంతఃకలహములకు తీవ్రంగా లోనయ్యింది, పరిస్థితులు ఎంతవరకూ వచ్చినాయంటే, పెద తిరుమలయ్యదేవమహారాయలు రాజధానిలోనికి ఆదిల్షాను సైన్యసమేతంగా ఆహ్వానించాడు. అంతకు ముందే పెద తిరుమలయ్య దేవమహారాయలు తన మేనల్లుడూ, రాజ్యానికి వారసుడూ, అచ్యుత రాయలు కుమారుడు అయిన చిన వేంకటపతి రాయలును హత్యాగావించి తనే సింహాసనం అధిస్టించాడు!

ఈ సుల్తాను రాజధానిలోనికి రావడంలో సిగ్గుపడి, భయపది, అవమానపడిన అళియ రామ రాయలు పెద తిరుమలయ్యను ఒప్పించి సుల్తానుకు ధనం అప్పగించి ఇంటికి పంపించాడు.

తరువాత మాత్రం అళియ దేవ రాయలు తిరుగుబాటు కొనసాగించారు, అయితే పెద తిరుమలయ్య పాపానికి చింతించి, ఆత్మహత్య గావించుకున్నాడు.

తరువాత అచ్యుత దేవ రాయలు సోదరుని కుమారుడగు సదా శివ రాయలు సింహాసనం అధిష్టించాడు, కానీ అధికారం మాత్రం అళియ రామ రాయలు చేతిలోనే ఉండేది. అనంతర కాలంలో సుల్తానుల కూటమితో విజయనగర సామ్రాజ్యం రాక్షస తంగడి యుద్ధంలో ఘోర పరాజయం పాలై అళియ రామరాయలు యుద్ధంలో మరణించారు. ఈ యుద్ధానంతరం సుల్తానుల సైన్యం మొత్తంగా రాజధానియైన విజయనగరం మూలమట్టంగా నాశనం చేసింది. దీనితో అళియ రామరాయల తమ్ముడైన తిరుమల దేవరాయలు సదాశివరాయలను, విజయనగర సామ్రాజ్య ఖజానాను తీసుకుని పెనుకొండకు పారిపోయారు.

పెనుకొండలో కూడా ఇతనిని సింహాసనంపై ఉంచి తిరుమల దేవరాయలే పరిపాలించారు. చివరకు 1570లో సదాశివ రాయలను తిరుమల దేవరాయలు సంహరించి తాను అధికారం చేపట్టారని రాబర్ట్ న్యూయల్ భావించారు. కానీ సదాశివ రాయల శాసనాలు 1575 వరకూ కనిపిస్తూండడంతో ఇది వాస్తవం కాదని చరిత్రాకారులు అభిప్రాయపడుతున్నారు.[1]

విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం


ఇంతకు ముందు ఉన్నవారు:
అచ్యుత దేవ రాయలు
విజయనగర సామ్రాజ్యము
1542 — 1570
తరువాత వచ్చినవారు:
అళియ రామ రాయలు

మూలాలు

[మార్చు]
  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.