నాగర సర్వస్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాగర సర్వస్వం విక్రమశకం వెయ్యి సంవత్సరాల కాలంలో, అనగా పదకొండవ శతాబ్దంలో పద్మశ్రీ అనే రచయిత సంస్కృతంలో వ్రాశాడు. ఈయన బౌద్ధమతస్థుడు. మొత్తం ముప్పయి ఎనిమిది అధ్యాయాల గ్రంథమిది; రత్నపరీక్ష ఎలా చేయాలో చెప్తాడు. ఇది ఇతర గ్రంథాలలో లేదు. భావ, అంగ, వస్త్ర, పుష్పానులేపాలను గూర్చి కామశాస్త్రంలో విపులంగా పేర్కొన్న మహామనిషి ఈయనే! చతుషష్టి కళలలో నాయకుడెంత నిష్ణాతుడైనా "సంకేత" పరిజ్ఞానం లేనివాడు నాయకిచే తిరస్కరింపబడతాడని ఈయన వాదం. ఈ సంకేతపరిజ్ఞానం కామశాస్త్రానికి ఒక కొత్త చేర్పు; ఆ తర్వాత కామశాస్త్ర ఔషధాలనూ, లేపనములను పదహారు చేష్టలను, అంగప్రమాణమునుబట్టి, వయస్సునుబట్టి స్త్రీ జన వర్గీకరణము రమించు పద్ధతులను, కామకేంద్రాలను, వివిధ నాడులను, చుంబన, ఆలింగన, చూషణ ప్రేషణాదులను ఇరవైనాలుగు రకముల ఉత్తాన పద్ధతులు, ఏడు పార్శ్వ, రెండు ఆసీనక, రెండు అధోముఖ, ఏడు ఉద్ధీతకరనములు (రతిపద్ధతులు) తెలియజేశాడు. స్త్రీలు అనుసరించే ' వామచరితం ' (చిట్కాలు) ప్రకరణాలను ఏర్చాడు. ఈయన చెప్పిన ప్రణయ ప్రజ్వలన పద్ధతులు ఎంతో ఆధునికమైనవిగా మనకు గోచరిస్తాయి.

గ్రంథంలోని విషయాలు

 • పీఠిక
 • శాస్త్రప్రయోజనము
 • అలంకరణము
 • రత్నాలు - సుగంధాలు
 • భాషాసంకేతములు
 • అంగసంకేతములు
 • పోటలీసంకేతములు
 • వస్త్రసంకేతములు
 • తాంబూలసంకేతములు
 • పుష్పమాలాసంకేతము
 • శృంగారచేష్టలు
 • స్త్రీ పురుషజాతి భేదములు
 • రతిభేదములు
 • మన్మధావస్థలు
 • బాల, యువతి, ప్రౌఢ, వృద్ధ
 • ఆలింగనభేదములు
 • చుంబనభేదములు
 • నిశ్శబ్ద చుంబనములు
 • సశబ్ద చుంబనములు
 • నఖక్షతములు
 • దంతక్షతములు
 • యోనిస్వరూపము
 • సంభోగాసనములు
 • ఉత్తానకరణభేదములు
 • తిర్యక్కరణభేదములు
 • ఆశీనకరణభేదములు
 • ఉత్తితకరణభేదములు
 • వ్యానతకరణభేదములు
 • అంగుళీప్రవేశము
 • క్రీడాతాడనము
 • తిరుతభేదములు
 • చంద్రకళ
 • భిన్నదేశ స్త్రీ స్వభావములు
 • కాంతల ఏకాంతధర్మాలు
 • పరదారగమనము
 • పరవనితా భేదములు
 • సులభసాధ్యలైన స్త్రీలు
 • ప్రయత్నసాధ్యలు
 • అసాధ్యలు
 • దూతికా యోగ్యతలు
 • స్వభార్యారక్షణ
 • పుత్రప్రాప్తి
 • ఉపసంహారము

మూలాలు

Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
 • నాగర సర్వస్వం, పద్మశ్రీ, అభిసారిక ప్రచురణ, 1962.