నారాయణరావుపేట్
నారాయణరావుపేట, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, నారాయణరావుపేట మండలంలోని గ్రామం.[1][2]
| శీర్షిక | వివరాలు |
|---|---|
| గ్రామం పేరు | నారాయణరావుపేట్ (Narayanraopet) |
| జిల్లా, రాష్ట్రం | సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం |
| మండలం | సిద్దిపేట |
| గ్రామ పంచాయితీ | నారాయణరావుపేట్ |
| వൈశాల్యం | 2466 హెక్టార్లు |
| మొత్తం జనాభా | 7354 (2011) |
| పురుషులు - మహిళలు | 3649 పురుషులు, 3705 మహిళలు |
| లింగ నిష్పత్తి | 1015 (ప్రతి 1000 పురుషులకు) |
| గృహాల సంఖ్య | 1766 |
| 0-6 ఏళ్ళ వయస్సు పిల్లలు | 707 |
| SC జనాభా | 1398 |
| ST జనాభా | 78 |
| సాక్షరత స్థాయి | 54.04% (పురుషులు – 64.46%, మహిళలు – 43.78%) |
| ముఖ్య వనరులు | సాగు, చెరువు, ATMలు, బ్యాంక్ |
| పిన్కోడ్ | 502107 |
| రవాణా | RTC/ప్రైవేట్ బస్సులు, రైల్వే స్టేషన్ (10 కిమీ దూరంలో) |
| ప్రత్యేకతలు | దేవాలయాలు, చెరువులు, వాణిజ్య సదుపాయాలు |
| సమీప గ్రామాలు | రాఘవపూర్, మల్యాల్, గొపులాపూర్, గుర్రాలగోండి, చింతమడక |
| సమీప పట్టణాలు | సిద్దిపేట, కరీంనగర్ |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని సిద్దిపేట మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో తొలుత దీన్ని సిద్ధిపేట (గ్రామీణ) మండలంలోకి చేర్చారు.[3] ఆ తరువాత 2019లో చేసిన మరో మార్పులో ఈ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణరావుపేట మండలంలో చేర్చారు.[4]
శివారు గ్రామం
[మార్చు]లక్ష్మిదేవిపల్లి శివారు గ్రామం నారాయణరావుపేట గ్రామ పంచాయతి పరిధిలో సిద్ధిపేట, కామరెడ్డి రోడ్డు మార్గంలో ఉంది. ఇక్కడ ఉన్నత పాఠశాల ఉంది.ఇది వ్యవసాయధారిత గ్రామం.సిద్ధిపేటకు 16 కి.మీ దూరంలో ఉంది..
గ్రామ నామధేయ చరిత్ర
[మార్చు]నారాయణరావుపేట అనే పేరు నారాయణరావు అనే వెలమ దొర పేరు మీదుగా వచ్చింది.. అంటే నారాయణరావుపేట వెలమ దొరల పాలన లో.. ఉండేది.. నారాయణరావుపేట ఆ పేరు కి ముందు ముత్యంపేట అని పేరు ఉండేది.. అంటే.. నారాయణరావుపేట గ్రామం.. ముత్యంరాయుడు.. సంరక్షణ లో ఉండేది.. అతని పాలన లో.. ఉండటం.. వలన. ముత్యంపేట అని పేరు వచ్చింది..

గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1766 ఇళ్లతో, 7354 జనాభాతో 2466 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3649, ఆడవారి సంఖ్య 3705. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1398 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 78. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 572979[5].పిన్ కోడ్: 502107.
విద్యా సౌకర్యాలు
[మార్చు]- గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే వెనకబడిన తరగతుల గురుకుల పాఠశాల ఉంది. ప్రస్తుతం సొంత భవనాలు లేక సిద్దిపేటలో కొనసాగుతుంది.
- జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉన్నాయి.
- గ్రామంలో రెండు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
- గ్రామంలో కెఎన్‌ఎం ఇఎం హైస్కూల్, హనుమాన్ పబ్లిక్ స్కూల్ అనే రెండు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి.
- రెవెన్యూ గ్రామంలో భాగలైన లక్ష్మిదేవిపల్లిలో రెండు పాఠశాలలు, కోదండరావుపల్లి, బంజేరు పల్లి గ్రామాల్లో ఒక్కో పాఠశాల ఉంది.
కార్యాలయాలు
[మార్చు]- మండల కార్యాలయం
- వ్యవసాయ కార్యాలయం
- తాశీల్దార్ కార్యాలయం
- పోస్ట్ ఆఫీస్
- ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సంక్షేమం
- గ్రామ పంచాయతీ కార్యాలయం
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]నారాయణరావుపేట్లో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో 3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి.. 4 మెడికల్ షాపులు ఉన్నాయి..
తాగు నీరు
[మార్చు]మన నారాయణరావుపేట లో మిషన్ భగీరథ ద్వారా అందరికీ మంచి నీటి సరఫరా & త్రాగు నీటి సరఫరా జరుగుతుంది . బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
[మార్చు]గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. . గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. . ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది . సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను గ్రామ పంచాయతీ ఇంటిటికి సేకరించి ట్రాక్టరు లో నింపుకొని డంపి యార్డ్ వద్ద తడిచెత్త, పొడిచెత్తగా వేరుచేసి ఆ చెత్తతో సేంద్రియ ఎరువును తయారుచేస్తారు...
సమాచార సౌకర్యాలు
[మార్చు]పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నారాయణరావుపేట వారి ATM ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
రైతు సంక్షేమము
[మార్చు]రైతులు సమావేశం కావడానికి మా ఊర్లో రైతు వేదిక ఉంది. రైతుల ధాన్యాన్ని నిల్వ కొరకు గోదాం ఉంది.. 4 ఎరువుల షాప్ లు.. ఉన్నాయి.. పొలాలకు సరిపోయే అంతా వరకు సాగు నీళ్లు ఉన్నాయి..
రవాణా సౌకర్యాలు
[మార్చు]నారాయణరావుపేట గ్రామానికి ఆటో, బస్సు సౌకర్యం, కలదు.. ఈ రెండిటి ద్వారా సిద్దిపేట కు ప్రయాణం చేయవచ్చు. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 14 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
వీధి విగ్రహాలు
[మార్చు]గాంధీ
నెహ్రూ
శివాజీ
సర్వాయి పాపన్న
తెలంగాణ తల్లి
ప్రొఫెసర్ జయశంకర్
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుక 24 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
చెరువులు
[మార్చు]- పెద్ద చెరువు
- ముత్యంపెట చెరువు
- మాల్క చెరువు
- అర్ధ మత్తడి
- దిప్పాల్ చెరువు
- సంగువాయి చెరువు
ప్రాచీన దేవాలయాలు
[మార్చు]• కాకతీయుల దేవాలయం ( గుడి బండ )
• రాజన్న దేవాలయం
• శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం
• వేణుగోపాల స్వామి ఆలయం
• పోచమ్మ ఆలయం
• నాగమ్మ ( సబ్ స్టేషన్ పరిధిలో )
• కళ్యాణి చాళుక్యుల దేవాలయం ( పంతులు పొలాల పరిధిలో )
బురుజులు
[మార్చు]• 3 మైసమ్మ బురుజులు
• ముత్యం పేట బురుజు
భూమి వినియోగం
[మార్చు]నారాయణరావుపేట్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 115 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 188 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 49 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 19 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 15 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 214 హెక్టార్లు
- బంజరు భూమి: 286 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 1575 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 1675 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 401 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]నారాయణరావుపేట్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- బావులు/బోరు బావులు: 401 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]నారాయణరావుపేట్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]మొక్కజొన్న, వరి, ప్రత్తి, ఆయిల్ ఫామ్, పొద్దు తిరుగుడు
పారిశ్రామిక ఉత్పత్తులు
[మార్చు]బీడీలు
అంగడి
[మార్చు]నారాయణరావుపేట గ్రామంలోని పెద్ద చెరువు వద్ద గంగమ్మ గుడి ఎదురుగా, ప్రతి మంగళవారం రోజున "" అంగడి "" నిర్వహించడం జరుగుతుంది..
ఆరోజున వేరువేరు గ్రామాల నుంచి చాలామంది రైతులు వారి వారి కూరగాయలను అమ్ముకోవడానికి పెద్ద ఎత్తున వస్తారు, ఈ కూరగాయలను కొనడానికి చాలామంది నారాయణరావుపేట గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామస్తులు కూడా వస్తారు..
ప్రధాన మతాలు
[మార్చు]🕌 నారాయణరావుపేటలో ప్రధాన మతాలు
1. హిందువులు
ఊరిలో మెజారిటీగా హిందూ సమాజం ఉంటుంది.
శివాలయం, రాముని ఆలయం, హనుమాన్ దేవాలయం, పొలాల దగ్గర చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి.
బతుకమ్మ, బోనాలు, దసరా, దీపావళి వంటి పండుగలు ఘనంగా జరుపుకుంటారు.
2. ముస్లింలు
మసీదు ఉంది.
రంజాన్, బక్రీద్ పండుగలు జరుపుకుంటారు.
ఊరి హిందూ–ముస్లిం స్నేహ భావం ప్రత్యేకత.
3. క్రైస్తవులు
కొద్దిగా క్రైస్తవ కుటుంబాలు కూడా ఉంటాయి.
రెండు చర్చ్ లు ఉన్నాయి.
క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటారు.
రాతి గణపతి విగ్రహం
[మార్చు]చాళుక్య శైలి కాలం.. నాటి.. రాతి గణపతి... విగ్రహం.. రాయి రకం స్థానికంగా లభించే గ్రానైట్ రాయి.దీని వల్ల వందల ఏళ్ల వాన, ఎండ, గాలి తాకిడికి కూడా విగ్రహం చెరిగి పోకుండా నిలిచింది.ఆకృతి లక్షణాలు ఏనుగు తల, రెండు చేతుల భంగిమ, శరీర ఆకృతి, గణపతికి ప్రత్యేకమైన గుండ్రని పొట్ట.. ఈ పురాతన రాయి విగ్రహం మన గ్రామంలోనే శతాబ్దాలుగా నిలబడి ఉంది.పల్లె ప్రాంతాల్లో గణపతిని గ్రామ ప్రవేశ ద్వారాల వద్ద లేదా సరిహద్దుల వద్ద ఉంచడం ఒక సంప్రదాయం...
జాతరలు
[మార్చు]ఎల్లమ్మ జాతర
మైసమ్మ జాతర
పోచమ్మ జాతర
బీరప్ప జాతర
పెద్దమ్మ జాతర
గంగమ్మ జాతర
🌐 సాంకేతిక పరిణామం
[మార్చు]- ఊరిలో ఇంటర్నెట్ వినియోగం.
- యువత సోషల్ మీడియా వాడకం.
- పాఠశాలలో కంప్యూటర్ విద్యా కేంద్రాలు.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 28, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
- ↑ "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-18.
- ↑ G.O.Ms.No. 28, Revenue (DA-CMRF) Department, Dated: 07-03-2019.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
వెలుపలి లంకెలు
[మార్చు]https://www.onefivenine.com/india/villages/Medak/Siddipet/Narayanraopet