నా తమ్ముడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నా తమ్ముడు
(1971 తెలుగు సినిమా)
Naa thammudu.jpg
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
నిర్మాణం సూరవరపు భాస్కరరావు
తారాగణం శోభన్ బాబు,
భారతి,
జగ్గయ్య,
నాగభూషణం,
అల్లు రామలింగయ్య
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ ఎస్.బి.ఆర్. పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నా తమ్ముడు 1971, సెప్టెంబర్ 17వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.

సాంకేతిక వర్గం[మార్చు]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చాడు[1].

క్ర.సం. పాట గేయ రచయిత గాయకులు
1 "అక్కడ కాదు ఇక్కడ అసలు సవాలే ఇక్కడ" ఆత్రేయ ఘంటసాల, పి.సుశీల
2 "చిన్నారి పాపలా పొన్నారి తోటలో పూచిందొక ముద్దు గులాబి" ఆత్రేయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
3 "హే సుందరాకార హే బృంద సంచార" అప్పలాచార్య బి.వసంత, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
4 "దండాలు దండాలండీ గురువుగారూ మీకు" ఆత్రేయ పి.సుశీల
5 "అలవాటు లేదని మడి గట్టుకోకు అందాన్ని కాదని చెడ గొట్టుకోకు" ఆత్రేయ ఎల్.ఆర్.ఈశ్వరి

కథ[మార్చు]

సూర్యం మెడికల్ కాలేజీలో ప్యూన్‌గా పనిచేస్తున్నా తమ్ముడు చంద్రాన్ని బాగా చదివించి డాక్టర్‌గా చేయాలని అతని ఆశయం. తమ్ముడు చంద్రం కూడా అన్న మాట జవదాటనివాడు. సూర్యం ఒక్కగానొక్క కూతురు శాంతి అంటే చంద్రానికి ప్రాణం. సుధ ఆ ఊరిలోని ధనవంతుడు వెంకట్రామయ్య కూతురు. సుధ చంద్రాన్ని ప్రేమిస్తుంది. చంద్రానికి కూడా సుధ అంటే ఇష్టమే కానీ ముందు అన్న అంగీకరించాలి. సుధ, చంద్రం ఇద్దరూ ఎం.బి.బి.ఎస్. ఫస్ట్ క్లాసులో పాసవుతారు. ఇంతలో సూర్యం సూర్యం మేనత్త సుందరమ్మ, ఆమె కూతురు కమల వస్తారు. తన భార్య చెల్లెలు కమలను చంద్రానికి ఇచ్చి పెళ్ళి చేయాలని సూర్యం ఉద్దేశం. చంద్రానికి చెప్పకుండానే సూర్యం నిశ్చితార్థం ఏర్పాటు చేస్తాడు. చివరి క్షణాల్లో ఉన్న వెంకట్రామయ్యకు తన మాటను కాదనడనే ధైర్యంతో సుధను పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చిన చంద్రానికి అన్నయ్య తనకోసం నిశ్చితార్థం ఏర్పాటు చేశాడని తెలిసి గుండె పగిలిపోతుంది. ఏమైనా తాను వెంకట్రామయ్యకు మాట ఇచ్చిన సంగతి చెబుతాడు చంద్రం. సూర్యం దానిని పట్టించుకోడు. తనమాట జరిగి తీరాలన్నాడు. చంద్రాన్ని ఇంటినుండి తరిమివేస్తాడు. ఎక్కడికీ వెళ్ళలేనిస్థితిలో ఉన్న చంద్రాన్నిసుధకోసం తహతహలాడుతున్న సుధబావ మధు ఒక నర్తకి ఇంటికి చేరుస్తాడు. వెళ్ళి సుధను తెస్తాడు. మధు నాటకాన్ని తెలుసుకున్న సుధ చంద్రాన్ని తీసుకెళ్ళి డాక్టరుగా అతని కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. శాంతి పేరుతో నర్సింగ్ హోం పెట్టాలనుకున్న చంద్రం దాని ప్రారంభోత్సవానికి సూర్యాన్ని పిలిచి తిరస్కరింపబడతాడు. శాంతి చేత ప్రారంభోత్సవం చేయిస్తాడు. కానీ ప్రారంభోత్సవం చేసివచ్చిన చిన్నారి పాప శాంతి సూర్యం చేతిలో గాయపడి చావుబతుకుల్లో ఉంటుంది. వైద్యం చేయవచ్చిన చంద్రాన్ని మూర్ఖంగా గెంటివేస్తాడు సూర్యం. శాంతి చనిపోతుంది. దాంతో చంద్రం పిచ్చివాడవుతాడు. శాంతి కనిపిస్తేనే చంద్రం బతుకుతాడంటారు డాక్టర్లు. అదెలా సాధ్యం? సుధ కమల ఏం చేస్తారు? అన్నదమ్ములు ఎలా కలుస్తారు? అన్న ప్రశ్నలకు సమాధానం చివరలో తెలుస్తుంది[2].

మూలాలు[మార్చు]

  1. ఈశ్వర్. నా తమ్ముడు పాటల పుస్తకం. Retrieved 13 August 2020.
  2. వీరా (19 September 1971). "చిత్ర సమీక్ష: నా తమ్ముడు". విశాలాంధ్ర దినపత్రిక. Archived from the original on 3 మార్చి 2021. Retrieved 13 August 2020. {{cite news}}: Check date values in: |archive-date= (help)

బయటి లింకులు[మార్చు]