Jump to content

నిమ్మక సుగ్రీవులు

వికీపీడియా నుండి
నిమ్మక సుగ్రీవులు

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 - 2014
ముందు కంబాల జోగులు
తరువాత విశ్వాసరాయి కళావతి
నియోజకవర్గం పాలకొండ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 10 ఆగష్టు 1965
సంభం గ్రామం, సీతంపేట మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ టీడీపీ
తల్లిదండ్రులు అప్పల స్వామి
జీవిత భాగస్వామి భాగ్యలక్ష్మి
సంతానం శ్రీనివాసరావు

నిమ్మక సుగ్రీవులు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పాలకొండ నియోజకవర్గం నుండి 2009 - 2014 ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

నిమ్మక సుగ్రీవులు 10 ఆగష్టు 1965లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, సీతంపేట మండలం, సంభం గ్రామంలో జన్మించాడు. ఆయన శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాల నుండి పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. ఆయన పాలిటెక్నిక్ పూర్తి చేశాక 1989 పొందూరులో వర్క్ ఇన్ స్పెక్టర్ గా, తరువాత భామిని మండలం జక్కరగూడలో ఉపాధ్యాయునిగా, పొందూరు, కోటబొమ్మాళిల్లో టెక్నికల్ అసిస్టెంట్ గా ఆరేళ్ళుగా పాలకొండ పిఆర్ డివిజన్ టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

నిమ్మక సుగ్రీవులు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో పాలకొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నిమ్మక గోపాలరావుపై 16150 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (28 March 2019). "పాలకొండ రూటు..విశ్వసనీయతకే ఓటు." Archived from the original on 20 December 2021. Retrieved 20 December 2021.
  2. Sakshi (2019). "ఆంధ్రప్రదేశ్ » శ్రీకాకుళం » పాలకొండ(ఎస్టీ)". Archived from the original on 20 December 2021. Retrieved 20 December 2021.