నిర్జన గ్రామాలు
(నిర్జన గ్రామము నుండి దారిమార్పు చెందింది)
నిర్జన గ్రామాలు, అంటే ప్రజలు నివసించని గ్రామాలు.వీటిని 'పోలీసు దత్తత గ్రామాలని, 'బేచిరాగులు ' అని, దీపం లేని ఊర్లని పిలుస్తారు.ఒకప్పుడు జనాలకు ఆవాసాలుగా ఉండి కాలక్రమంలో, వివిధ కారణాలచే శిథిలమై, అదృశ్యమైన గ్రామాలివి. కానీ, రెవెన్యూ దస్త్రాలలో మాత్రం వీటికి చోటు ఉంటుంది.2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 5,93,731 జనావాస గ్రామాలు, 44,656 గ్రామాలు నిర్జన గ్రామాలు (Uninhabited Villages) ఉన్నాయి.[1]
ఇవి ఏర్పడిన నేపథ్యం, వివరణ
[మార్చు]రెవెన్యూ వ్యవస్థ వల్ల
[మార్చు]- నిర్జన గ్రామాలు: రెవెన్యూ గ్రామాలు కొన్నిటిలో పదుల ఏళ్ళు గడిచిపోయిన ఈ స్థితిలో పలు కారణాలతో (ముంపు వల్ల వలసలు, కరువు వల్ల వలసలు, చుట్టుపక్కల వేరే పెద్ద గ్రామం ఏర్పడడం, వగైరాలు ఎన్నైనా ఉండొచ్చు) జనం లేచి వెళ్ళిపోయారు. రెవెన్యూ వ్యవస్థకు అవసరమైన పన్నులు ఇచ్చే పంటలు, చెరువులు అక్కడ ఉన్నాయి కదా అందుకే ఆ రెవెన్యూ గ్రామంలో జనం లేకపోయినా వ్యవస్థలో కొనసాగుతోంది. ఈ సూక్ష్మాంశాలను పట్టించుకోకో, తెలిసినా సరేలెమ్మని వదిలేసో భారత జనగణన వారు ఆ గ్రామాన్ని కూడా తమ లెక్కల్లో పెట్టుకుంటున్నారు. కాకపోతే సమాచారం ఖాళీగా ఉంటుంది. రెవెన్యూ వారి, జనగణన వారి లెక్కల కోసం మాత్రమే ఉన్న ఈ ఖాళీ ఊళ్ళు జనగణన జాబితా ద్వారా తయారుచేసిన మండలాలలో గ్రామాల జాబితాలోకి ఎక్కాయి. (పంచాయితీ, తండా గ్రామాల గురించి మాట్లాడట్లేదు. అవి రెవెన్యూ, జనగణన గుర్తించని, జనమున్న ఊళ్ళు. ఇవి జనం లేని రెవెన్యూ వ్యసవ్థ కోసమే ఉన్న ఊళ్ళు)
ప్రాజెక్టులు, భారీ జలాశయాలవల్ల
[మార్చు]- ప్రాజెక్టులు, భారీ జలాశయాలవల్ల కూడా గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. వీటికి చరిత్ర ఉంటుంది (ప్రాజెక్టు నిర్మాణం, ఖాళీ చేయడం వంటివి సహా) కాబట్టి చారిత్రక ఆధారాలు మూలాలతో లభ్యమైతే రాయవచ్చు.ఉదా: కృష్ణానది, తుంగభద్రల సంగమ స్థల సమీపాన కూడవెల్లి అని ఒక గ్రామం ఉండేది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వలన అదీ అంతరించి పోయింది. ఆ గ్రామానికి చెందిన ప్రజలంతా దక్షిణ తెలంగాణలో దక్షిణ కాశిగా పిలువబడే అలంపూర్, దాని సమీప గ్రామాలలో నివసిస్తున్నారు. అక్కడ ఉన్న అతి పెద్ద సంగమేశ్వర దేవాలయాన్ని అలంపూర్లో పునర్నిర్మించారు. దాన్ని కూడవల్లి సంగమేశ్వరాలయంగానే పిలుస్తారు. నిత్యం ఎందరో యాత్రికులకు ఆలయ పూజారులు కూడవల్లి గురించి చెబుతూనే ఉంటారు.