Jump to content

నిర్మాల్యం (మలయాళ సినిమా)

వికీపీడియా నుండి

నిర్మాల్యం 1973లో విడుదలైన మలయాళ సినిమా. ఈ చిత్రానికి ఎం.టి.వాసుదేవన్ నాయర్ దర్శకత్వం వహించి నిర్మించాడు. నావల్ ఫిలింస్ బ్యానర్ పై విడుదలైన ఈ సినిమా 1973వ సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది.

నటీనటులు

[మార్చు]
  • పి.జె.ఆంథోని - వెలిచపాడ్
  • పొన్నమ్మ - నారాయణి, వెలిచపాడ్ భార్య
  • సుమిత్ర - అమ్మిని, వెలిచపాడ్ కూతురు
  • రవి మీనన్ - బ్రహ్మ దత్తన్ నంబూద్రి, కొత్త పూజారి
  • సుకుమారన్ - అప్పు, వెలిచపాడ్ కొడుకు
  • కొట్టారకర - వారియార్

చిత్రకథ

[మార్చు]

కేరళలోని ఒక చిన్న గ్రామం. అక్కడ ఒక పురాతన దేవాలయం ఉంది. అయితే ఒకప్పుడు దివ్యంగా మంగళకరంగా వున్న ఆ ఆలయం ప్రస్తుతం జీర్ణావస్థలో ఉంది. గ్రామస్థులు చాలా అరుదుగా దేవి దర్శనానికి వస్తున్నారు. ఆలయ నిర్వాహకులకు ఆలయం మీద ఉత్సాహం తగ్గింది. దాన్ని వారు సక్రమమైన పద్ధతిలో శ్రద్ధగా నడిపించడం లేదు.

వెలిచపాడ్ ఆలయంలోని దేవతమీద అమిత నమ్మకం కల వ్యక్తి. అతను, దేవాలయం మీద ఆధారపడిన వారియార్ - ఎప్పటికైనా ఆలయానికి తిరిగి మంగళకరమైన రోజులు వస్తాయని లోగడ కలిగినట్లే దేవి అనుగ్రహం మళ్ళీ అందరికీ కలుగుతుందని గట్టి విశ్వాసంతో ఉన్నారు.

గుళ్ళోని పూజారి ఇక బతకలేక వేరే ఉద్యోగం వెతుకుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక ధర్మకర్త తన వంట మనిషి కొడుకును తెచ్చి పూజారి ఉద్యోగం ఇచ్చాడు. చదువుకుంటూ, పరీక్షలు రాయబోతున్న ఆ అబ్బాయికి ఆ ఉద్యోగం మీద ఉత్సాహం లేదు; కానీ తప్పలేదు.

వెలిచపాడ్ కూతురు అమ్మి గుళ్ళో చేయవలసిన మామూలు కార్యక్రమాలను ఆ అబ్బాయితో చెబుతూ సహాయకారిగా వుంటున్నది. వారి చెలిమి క్రమేణా ప్రేమగా మారింది. వెలిచపాడ్‌కు కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు అప్పు. అప్పు ఎంతసేపూ గ్రామంలో వున్న పనిలేనివాళ్ళతో కలిసి తిరుగుతూ వుంటాడు. దేవత మీద తండ్రికి వున్న నమ్మకంలో కాస్త కూడా అతనికి లేదు. తండ్రికి ముందు తాత ఆ ఉద్యోగంలో ఉండేవాడు; ఆ తాత ఇవాళ పక్షవాతంతో మంచం మీద ఉన్నాడు. దేవాలయానికి సంబంధించిన పవిత్రమైన కత్తిని, గంటనూ తస్కరించి అప్పు అమ్మబోయాడు. కాని, కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సంగతి తెలిసిన వెలిచపాడ్ క్రోధంతో ఊగిపోయాడు. అది చూచి అప్పు గ్రామం విడిచిపెట్టి పారిపోయాడు.

గ్రామంలో మశూచికం విస్తరించింది. అది అమ్మవారి ఆగ్రహమే అని గ్రామస్తులంతా నమ్మారు. 'చాలా కాలంగా ఆమెకు పూజలు లేవు, బలులులేవు, ఉత్సవాలు లేవు. అందుకనే దేవత ఆగ్రహించింది ' అని గ్రామస్థులు విశ్వసించారు. దేవతను శాంతింప జెయ్యడానికి పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపాలని వెలిచపాడ్ తీర్మానించుకున్నాడు. అతని కల నిజమై ఉత్సవాలు ఆరంభమయ్యాయి. కొత్త పూజారికి ధనవంతుల అమ్మాయితో నిశ్చయమైందని ఉద్యోగం విడిచిపెట్టి ఉత్సవం ఆరంభం కాబోతున్న రోజునే వెళ్ళిపోయాడు.

ఆలయంలో దీపాలు వెలిగాయి. ఉత్సవాలు మొదలైనాయి. పవిత్ర ఖడ్గం తీసుకుని వెలిచపాడ్ దేవత ముందు నాట్యం చేయాలి. ఖడ్గం కోసం ఇంటికి వెళ్ళాడు. వెలిచపాడ్‌కు తన గదిలోంచి మాటలు వినిపించాయి... తన భార్య, తను డబ్బు బాకీ వున్న ముస్లిం వర్తకుడితో... వెలిచపాడ్‌కు తల తిరిగి పోయింది.

ఆలయం ముందు భేరీలు మ్రోగాయి... వెలిచపాడ్ ఖడ్గంతో ప్రవేశించాడు... మహోధృతంగా నాట్యం మొదలెట్టాడు... ఎప్పటిలాగే, నాట్యం చేస్తూ రక్తం ప్రవహింపజేశాడు. కాని ఈ సారి అతని ప్రదర్శనలో కనిపించిన తీవ్రత ఇంతకు ముందు ఎన్నడూ కనిపించలేదు! చివరకు తన తలను పవిత్ర ఖడ్గంతో నరికి దేవతకు బలి యిస్తాడు.[1]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సంపాదకుడు (1 September 1974). "నిర్మాల్యం". విజయచిత్ర. 9 (1): 12–13.

బయటి లింకులు

[మార్చు]
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు