నీతా లుల్లా
నీతా లుల్లా | |
|---|---|
2012లో నీతా లుల్లా | |
| జననం | 1965 మార్చి 5 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
| వృత్తి |
|
| Label | నీతా లుల్లా ఫ్యాషన్స్ |
| భాగస్వామి | శ్యామ్ లుల్లా |
| పిల్లలు | 2[1] |
| పురస్కారాలు | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ |
నీతా లుల్లా (జననం 1965 మార్చి 5) భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్యాషన్ స్టైలిస్ట్. ఆమె 300 చిత్రాలకు పైగా పని చేసింది. ఆమె 1985 నుండి వివాహ దుస్తులను డిజైన్ చేస్తోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి, ఖుదా గవా, దేవదాస్‌లో చిత్రాలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడంతో ఆమె ప్రసిద్ధి చెందింది.
లమ్హే (1990), దేవదాస్ (2002), జోధా అక్బర్ (2002), బాలగంధర్వ (2010) చిత్రాలకు రూపకల్పన చేసిన ఆమె ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులను పొందింది.
కెరీర్
[మార్చు]నటీమణులు సల్మా ఆఘా, శ్రీదేవి లకు కాస్ట్యూమ్ డిజైన్‌లతో ఆమె ప్రసిద్ధిచెందింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ల వివాహ సమయంలో ఆమె డిజైన్ చేసిన దుస్తులు నీతా లుల్లా కెరీర్‌ను మలుపుతిప్పాయి. తన ఫేవరెట్ నటి దివ్యభారతితో పాటు బాలీవుడ్ లో శిల్పాశెట్టి, సప్నా, సల్మా ఆజాద్, ఇషా కొప్పికర్, జుహీ చావ్లా మరెందరో అగ్రశ్రేణి నటీమణులకు ఆమె డిజైన్ చేసింది.
మొహెంజో దారో (2016) వంటి చిత్రాలకు రూపకల్పన చేసేన ఆమె[2] గౌతమీపుత్ర శాతకర్ణితో టాలీవుడ్‌లో తిరిగి అడుగుపెట్టింది.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ముంబైకి చెందిన నీతా లుల్లా గణనీయమైన సమయాన్ని నగరంలోని ఫిల్మ్‌సిటీలో గడిపింది.[4] ఆమె సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్యామ్ లుల్లాను వివాహం చేసుకుంది.[5]
కలెక్షన్స్
[మార్చు]- మేక్ ఇన్ ఇండియా: 2016 ఫిబ్రవరి 17న కాంటెంపరరీ సెపరేట్‌లతో తయారు చేసిన ప్రత్యేకమైన పైథానీ సేకరణను ప్రదర్శించారు
- #SheIsMe: 2016 ఏప్రిల్ 6న లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించబడింది[6]
అవార్డులు
[మార్చు]జాతీయ చలనచిత్ర అవార్డులు
[మార్చు]| Year | Film | Result |
| 1991 | లమ్హే | విజేత |
| 2002 | దేవదాస్ | విజేత |
| 2008 | జోధా అక్బర్ | విజేత |
| 2011 | బాలగంధర్వ | విజేత |
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
[మార్చు]| Year | Film | Result | Ref. |
| 2003 | దేవదాస్ | నామినేటెడ్ | [7] |
| 2009 | జోధా అక్బర్ | నామినేటెడ్ | [8] |
బాలీవుడ్ మూవీ అవార్డులు
[మార్చు]| Year | Film | Result | Ref. |
| 2001 | మిషన్ కాశ్మీర్ | విజేత | |
| 2003 | దేవదాస్ | విజేత |
IIFA అవార్డులు
[మార్చు]| Year | Film | Result | Ref. |
| 2000 | తాల్ | విజేత | |
| 2009 | జోధా అక్బర్ | విజేత |
జీ సినీ అవార్డులు
[మార్చు]| Year | Film | Result | Ref. |
| 2002 | దేవదాస్ | విజేత |
కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ అవార్డు
[మార్చు]- ప్రత్యేక గౌరవ పురస్కారం (2005)
ఇండియా లీడర్‌షిప్ కాన్క్లేవ్
[మార్చు]- దశాబ్దపు ఫ్యాషన్ డిజైనర్ (2016)
మూలాలు
[మార్చు]- ↑ "Designer Neeta Lulla With Daughter Nishka Lulla At The Wedding Reception Of Ahana Deol In Mumbai". Rediff. 3 February 2014. the original నుండి 7 మే 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 November 2018.
- ↑ Varma, Lipika (25 July 2016). "Styling for the era not easy: Neeta Lulla". Deccan Chronicle. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 November 2018.
- ↑ "Neeta Lulla to work in Tollywood again". Deccan Chronicle. 17 July 2016. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 November 2018.
- ↑ Bakshi, Asmita (24 February 2014). "Mumbai exudes a lot of style, says Neeta Lulla". India Today.
- ↑ "Celebrity Designer Neeta Lulla's Daughter Nishka Lulla Ties The Knot With Businessman Dhruv Mehra". BollywoodShaadis. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-05-18.
- ↑ "We need to raise our voice against abuse: Neeta Lulla". Times of India. 6 April 2016. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2016.
- ↑ "2003 Filmfare Awards - Winners and Nominees". Awards & Winners. the original నుండి 9 మార్చి 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2017.
- ↑ "54th Filmfare Award Nominations". Indicine. 6 February 2008. the original నుండి 6 January 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 November 2014.