Coordinates: 15°23′49″N 73°47′35″E / 15.397°N 73.793°E / 15.397; 73.793

జాతీయ ధ్రువ, మహాసముద్ర పరిశోధనా కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతీయ ధ్రువ, మహాసముద్ర పరిశోధనా కేంద్రం
జాతీయ ధ్రువ, మహాసముద్ర పరిశోధనా కేంద్రం ప్రధాన ద్వారం
సంకేతాక్షరంNCPOR
అవతరణ25 మే 1998; 25 సంవత్సరాల క్రితం (1998-05-25)
కేంద్రస్థానంవాస్కోడాగామా, గోవా
అక్షాంశ,రేఖాంశాలు15°23′49″N 73°47′35″E / 15.397°N 73.793°E / 15.397; 73.793
సేవలందించే ప్రాంతంభారతదేశం
చైర్మన్ఎం.రవిచంద్రన్[1][2]
ప్రధాన విభాగంగవర్నింగ్ కౌన్సిల్
బడ్జెట్1,897 crore (US$240 million) (2021 - 2022) [3]
వెబ్‌సైటుhttp://www.ncaor.gov.in/

జాతీయ ధ్రువ, మహాసముద్ర పరిశోధనా కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ - NCPOR), భారతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ. ఇది గోవాలోని వాస్కోడిగామాలో ఉంది. గతంలో దీన్ని నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCAOR) అనేవారు. ఇది భారత ప్రభుత్వంలోని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖలోని ఓషన్ డెవలప్‌మెంట్ విభాగానికి (DOD) చెందిన స్వయంప్రతిపత్త సంస్థ. ఇది భారతీయ అంటార్కిటిక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారత ప్రభుత్వ అంటార్కిటిక్ పరిశోధనా కేంద్రాలలైన భారతి, మైత్రిలు దీని నిర్వహణ లోనే ఉంటాయి. NCPOR 1998 మే 25 న NCAOR పేరుతో డా. ప్రేమ్ చంద్ పాండేసారథ్యంలో స్థాపించారు. [4] [5] [6] [7] [8] [9] [10] NCPOR, ప్రపంచ ప్రయోగాలు, అంతర్జాతీయ సమావేశాల నిర్వహణకు, అంటార్కిటిక్ సైన్స్‌కు సంబంధించిన అంతర్జాతీయ కమిటీల నాయకత్వానికీ ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం NCPOR ఛైర్మన్‌గా డాక్టర్ M. రవిచంద్రన్ [11] ఉన్నాడు. ఇతను ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కూడా. NCPOR ప్రస్తుత డైరెక్టర్ మీర్జా జావేద్ బేగ్. [12]

NCPOR కాంప్లెక్సు, ప్రత్యేక స్వల్ప-ఉష్ణోగ్రత ప్రయోగశాలకు నిలయం. ఇది నేషనల్ అంటార్కిటిక్ డేటా సెంటర్, ధ్రువీయ మ్యూజియంలను ఏర్పాటు చేస్తోంది.


NCPOR కింది రంగాల్లో లేదా టాస్క్‌లలో పనిచేస్తుంది:

  • అంటార్కిటికా, హిమాలయాల నుండి మంచు కోర్ నమూనాలను నిల్వ చేస్తుంది.
  • నార్వేలోని స్వాల్‌బార్డ్‌లో హిమాద్రి, ఇండార్క్ ఆర్కిటిక్ పరిశోధనా కేంద్రాలను నిర్వహిస్తోంది. [13]
  • సముద్ర పరిశోధన నౌక ORV సాగర్ కన్య నిర్వహణ. ఇది భారతదేశ సముద్ర శాస్త్ర అధ్యయన నౌకల యొక్క ప్రధాన నౌక. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంపై భారతదేశ అధ్యయనాలకు ఈ నౌక గణనీయంగా దోహదపడింది.
  • ఇది అలహాబాద్ విశ్వవిద్యాలయంలో KBCAOS స్థాపన ప్రారంభ దశ నుండి పూర్తి స్థాయి అధ్యాపక కేంద్రంగా మారే చివరి దశ వరకు, విశ్వవిద్యాలయానికి ప్రాజెక్టు రూపంలో మద్దతు ఇచ్చింది. [14]

ఈ కేంద్రాన్ని గతంలో అంటార్కిటిక్ అధ్యయన కేంద్రం అని పిలిచేవారు. 1997 మే 12 న డా. పి.సి.పాండే [15] డైరెక్టర్‌గా చేరడంతో ఇది ఉనికిలోకి వచ్చింది.

2016 అక్టోబర్ 9 న, నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCAOR) హిమాలయాలో హిమాన్ష్ అనే పరిశోధనా కేంద్రాన్ని స్థాపించింది. [16] [17] ఈ స్టేషను హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితిలో ఒక మారుమూల ప్రాంతంలో 4000 మీ. ఎత్తున ఉంది.

మూలాలు[మార్చు]

  1. "भारत 'तिथे' काय करतो?". Lokmat (in మరాఠీ). 7 February 2021. Retrieved 18 March 2021.
  2. "Our Chairman". NCAOR. Retrieved 24 February 2022.
  3. https://www.indiabudget.gov.in/doc/eb/sbe23.pdf [bare URL PDF]
  4. "Dr. P. C. Pandey". NCAOR. Retrieved 5 February 2018.
  5. 10th Foundation day of NCAOR Archived 21 జూలై 2011 at the Wayback Machine Dr. P. C. Pandey stated as Founder and Former Director
  6. "Dr. P. C. Pandey, Emeritus Professor, Ph.D. (Allahabad University), Founder Director NCAOR GOA, INDIA Archived 4 మార్చి 2012 at the Wayback Machine.
  7. Allahabad Registered(1860)Alumni Association-Proud Past Archived 2012-07-07 at Archive.today Dr. P. C. Pandey, NCAOR Founder Director
  8. Antarctica team to leave on Friday.
  9. Mission Antarctica.
  10. Shri Kapil Sibal, Honourable Minister of State (Independent Charge), S&T and Ocean Development visited Antarctica from 2nd to 4th of February 2005, the first ever visit by an Indian Minister Archived 2011-07-17 at the Wayback Machineas its founding director.
  11. "Our Chairman". NCAOR. Retrieved 24 February 2022.
  12. "Our Director". NCAOR. Retrieved 26 February 2022.
  13. http://ncaor-arctic.ncaor.org:5050/website/index.html Archived 27 జూలై 2011 at the Wayback Machine NCAOR Arctic Research
  14. "Dr. P. C. Pandey". NCAOR. Retrieved 5 February 2018.
  15. "came into existence with joining P C Pandey as Centre Director".
  16. "Himansh". NCPOR. Retrieved 1 June 2022.
  17. "HIMANSH, India's Remote, High-Altitude Station opened in Himalaya". DST. Retrieved 1 June 2022.