Jump to content

నైనా దేవి

వికీపీడియా నుండి
(నైనా దేవి ఆలయం నుండి దారిమార్పు చెందింది)
నైనాదేవి
పట్టణం
నైనా దేవి ఆలయం
నైనా దేవి ఆలయం
దేశం India
రాష్ట్రంHimachal Pradesh
జిల్లాBilaspur
జనాభా
 (2001)
 • Total1,161
భాషలు
 • అధికారహిందీ, పంజాబీ
Time zoneUTC+5:30 (IST)

నైనాదేవి భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గల పట్టణం.

జనాభా వివరాలు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం ,[1] ఈ పట్టణ జనాభా 1161. అందులో పురుషులు 63% , స్త్రీలు 37% ఉన్నారు. ఇక్కడ సగటు అక్షరాస్యతా రేటు 81%, ఇది జాతీయ సగటు ఆక్షరాస్యత 59.5% కంటే ఎక్కువ;పురుషుల అక్షరాస్యత 84%, స్త్రీల అక్షరాస్యత 75%. నైనాదేవి పట్టణంలో 11% జనాభా 6 సంవత్సరాల కంటే లోపు ఉన్నవారే.

దేవాలయం

[మార్చు]

నైనాదేవి దేవాలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ జిల్లాలో కొండ పైన నెలకొని ఉంది. ఈ దేవాలయం జాతీయ రహదారి 21 మార్గంలో ఉంటుంది. ఈ కొండపై ఉన్న దేవాలయాన్ని చేరుకొనుటకు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి. కొంత పైకి వెళ్ళీన తరువాత చివరి భాగంలో కొంతభాగం మెట్లద్వారా పైకి వెళ్ళవలసి ఉంటుంది. కొండ క్రింది భాగం నుండి పై భాగానికి యాత్రికులు చేరడానికి కేబుల్ కార్ సదుపాయం కూడా ఉంది.

ఈ దేవాలయ కొండపై భాగం నుండి గోవింద్ సాగర్ సరస్సు కనబడుతుంది. ఇది భాక్రానంగల్ ఆనకట్ట ద్వారా సృష్టించబడినది.

ఈ దేవాలయం గూర్చి అనేక పురాణ గాథలు ఉన్నాయి.

ఇతిహాసాల ప్రకారం దక్షుని యజ్ఞానికి వెళ్ళిన సతీదేవి శివునికి జరిగిన అవమానాన్ని సహింపక ఆ యజ్ఞ గుండంలో దహనం చెందుతుంది. శివుడు క్రోధం లో సతీదేవి దేహాన్ని భుజాలపై ఉంచుకొని శివతాండవం చేస్తాడు. ఈ పరిణామానికి స్వర్గంలోని అందరు దేవతలు భయపడతారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 51 భాగాలుగా విభజించాడు. సతీదేవి యొక్క కళ్ళు పడిన ప్రాంతమే నైనాదేవి ఆలయ ప్రాంతంగా చెబుతారు.

వేరొక కథనం ప్రకారం ఈ దేవాలయం ఒక నైనా అనే గుజ్జార్ బాలునితో ముడిపడి ఉంది. ఒకనాడు ఆ బాలుడు పశువులను కాపలా కాస్తున్నప్పుడు ఆ మందలో ఒక తెల్ల ఆవు ఒక రాతి పై తన పొదుగు ద్వారా పాలను కారుస్తున్నట్లు గ్రహించాడు. తరువాత చాలా రోజులు అదే విషయాన్ని గమనించాడు. ఒక రాత్రి ఆ బాలునికి కలలో దేవత కనబడి ఆ రాయి తన ఆసనమని చెబుతుంది. నైనా ఈ స్వాప్నిక వృత్తాంతాన్ని రాజా బీర్ చంద్ కు వివరించాడు. ఈ విషయాన్ని రాజు కూడా స్వయంగా చూసి అక్కడ ఆయన ఒక దేవాలయాన్ని నిర్మించి దానికి నైనా యొక్క పేరును పెట్టాడు.

నైనాదేవి ఆలయం మహిష పీఠంగా కూడా పిలువబడుతుంది. ఎందుకంటే మహిసాసురుడనే రాక్షసుడిని ఈ ప్రాంతంలోనే సంహరించినట్లు కథనం. పురాణ గాథల ప్రకారం మహిసాసురుడు బ్రహ్మ వల్ల వివాహిత కాని స్త్రీ వల్ల మరణం పొందేటట్లు వరాన్ని పొందుతాడు. ఈ వరం వల్ల మహిసాసురుడు ప్రజలను హింసిస్తుంటాడు. ఈ సంఘటనతో మహిసాసురుడిని అంతమొందించుటకు అందరు దేవతలు వారి శక్తులను కలిపి దుర్గ అనే దేవతను సృష్టిస్తారు. ఈ దేవతకు అనేక రకాల ఆయుధాలను దేవతలు బహూకరిస్తారు. మహిసాసురుడు ఆ దేవత యొక్క అందాన్ని చూసి మోహించి తనను వివాహమాడవలసినదిగా కోరుతాడు. ఆమె తన కంటే శక్తివంతుడిని వివాహమాడతానని చెబుతుంది. జరిగిన యుద్ధంలో ఆమె రాక్షసుడిని ఓడించి ఆయన కళ్ళను తొలగిస్తుంది. ఈ చర్య దేవతలకు సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషంతో ఆరు "జై నైనా" అనే నినాదాలనిస్తారు. అందువలన ఆ ప్రాంతం నైనా గా స్థిరపడింది.

2008 లో తొక్కిసలాట

[మార్చు]

2008 ఆగష్టు 3 న తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట లో 146 మంది ప్రజలు మరణించారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని నయనాదేవి ఆలయ రహదారి మృత్యు మార్గమైంది. భక్తి మార్గంలో ప్రయాణిస్తూ అసువులు బాసిన పురుషులు మరికొందరు కాగా, అభం శుభం తెలియని మరో 36 మంది చిన్నారులు సైతం ఉన్నారు. తొక్కిసలాటలో పద ఘట్టనలతో వారి శరీరాలు నలిగిపోయాయి. భక్తుల దుస్తులు బురద కొట్టుకుని మసకబారి పోయాయి.[2] Another report claims that they were due to rumors of a fight at the temple causing panic. And another states it was due to police who hit the fleeing worshippers with canes to get them to continue moving.[3]

మూలాలు

[మార్చు]
  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  2. "'Scores killed' in India stampede". BBC News Online. 2008-08-03. Retrieved 2008-08-03.
  3. "'India temple stampede'". CNN. Archived from the original on August 5, 2008. Retrieved 2008-08-03.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నైనా_దేవి&oldid=3979387" నుండి వెలికితీశారు