పంజాబ్ రాష్ట్రంలో జరుపుకునే పండుగలు, జాతరలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేళా
మాఘీ మేళాకు ముఖ్య అతిధులుగా విచ్చేసే నిహంగ్స్

సంవత్సరం పొడవునా పంజాబ్ లో ఏదో ఒక పండుగ, జాతర ఉంటూనే ఉంటుంది. కొన్ని పండుగల, జాతరలు:[1]

జాతరలు[మార్చు]

రయుజా షరీఫ్ ఉరుసు[మార్చు]

రయుజా షరీఫ్ ఉరుసు[1] సూఫీ గురువు షేఖ్ అహ్మద్ ఫరూకీ సిర్హిందీ సంస్మరణార్ధం జరుపుకుంటారు. ఖ్వాజా బాకీ బిల్లాకు శిష్యులు ఈయన. ఫతేహ్‌గర్ సాహిబ్ నగరంలో ఫతేహ్‌గర్ సాహిబ్-బస్సీ పఠాన్ రహదారిలో జరుగుతుంది ఈ ఉరుసు.[2] 

జోర్ మేళా[మార్చు]

ఫతేహ్‌గర్ సాహిబ్ గురుద్వారా, పంజాబ్

ఫతేహ్‌గర్ సాహిబ్ గురుద్వారా వద్ద సంవత్సరానికి 3రోజుల పాటు జరిగుతుందీ షాహీదీ జోర్ మేళా. సాహిబ్జాదా జోరావార్ సింగ్, ఫతేహ్ సింగ్ ల సంస్మరణగా ఈ జాతర నిర్వహిస్తారు. ఈ మేళాలో ఊరేగింపులు, సిక్కు ఆటలు ప్రధాన ఆకర్షణలు.[3]

భతిండా విరసత్ మేళా[మార్చు]

జైపాల్ థీం గ్రామంలోని  భతిండా క్రీడా స్టేడియంలో జరిగే ఈ మేళాలో  పంజాబీ సంప్రదాయాల ప్రదర్శనలు నిర్వహిస్తారు.[1] హాజీ రతన్ లోని గురుద్వారా నుండి జైపాల్ గర్ థీం గ్రామానికి జరిపే వారసత్వపు ఊరేగింపు ఈ మేళాకు ప్రధానమైనది.

వైశాఖి[మార్చు]

వైశాఖి పండుగకు పంజాబ్ లోని పలు ప్రదేశాల్లో పలు రకాలైన జాతరలు జరుగుతుంటాయి.[1]

మేళా మాఘీ[మార్చు]

ముక్త్‌సర్ ప్రదేశంలో జరిగే ఈ మేళా మాఘీ 3 రోజుల పాటు  నిర్వహిస్తారు. 

బాబా షేక్ ఫరిద్ ఆగ్మన్[మార్చు]

బాబా ఫరిద్, 12వ శతాబ్దానికి చెందిన సూఫీ గురువు. ఆయన సందర్శించిన ఫరీద్ కోటకు తరువాత ఆయన పేరునే పెట్టారు. తిల్లా బాబా ఫరిద్ గురుద్వారాలో జరిగే ఈ మేళాలో సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తారు.[1]

ప్రతీ సంవత్సరం ఈ మేళా సెప్టెంబరు 19 నుండి 23తేదీల మధ్య నిర్వహిస్తుంటారు. ఆధ్యాత్మికంగానే కాక పంజాబీ సాంస్కృతిక, సాహిత్య, మేథో, క్రీడా కార్యక్రమాలకు, ప్రదర్శనలకు ఈ మేళా చాల ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను ప్రారంభించిన సూఫీ గురువు స్ఫూర్తితో మానవతావాదం, మత సామరస్యం, జాతీయవాదాలను ఈ పండుగ ప్రతిబింబిస్తుంది.[4]

పతంగుల పండుగ బసంత్[మార్చు]

గాలిపటాలు

బసంత్ పండుగ సమయంలో స్థానికంగా చాలా జాతరలు జరుగుతుంటాయి. 97ఏళ్ళ క్రితం కపుర్తల రాజ్య మహారాజు జగత్జీత్ సింగ్ బసంత్ పంచమీ జాతర మొదలు పెట్టారు. షాలిమర్ బాగ్ లో జరిగే ఈ జాతరకు పసుపు రంగు దుస్తులు, తలపాగాలు ధరించి పాల్గొంటారు ప్రజలు.[5] హోషియర్పూర్ లో బాబా భందరి బోయెలేలో జరిగే ఈ మేళాలో అమరవీరుడు ధరంవీర్ హకికట్ రాయ్ సమాధి వద్ద పిల్లలు, పెద్దలు నివాళులర్పిస్తారు. మత స్వాతంత్ర్య హక్కు కోసం పోరాడిన హకికత్ రాయ్ కి ఈ పండుగ సందర్భంగా నివాళులర్పిస్తారు పంజాబ్ వాసులు. బోయెలి బాబా భందరీ వద్ద నిర్వహించే జాతరలో గాలిపటాల పందాలు ఒక ఆచారం.

పండుగలు[మార్చు]

కిలా రాయ్ పూర్ క్రీడోత్సవం[మార్చు]

ప్రతీ సంవత్సరం ఫిబ్రవరిలో కిలా రాయ్ పూర్ క్రీడోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా ఎడ్ల పందేలు, కుక్కలు, గాడిదలు, ఒంటెలు, తదితర జంతువుల రేసులు నిర్వహిస్తారు.

భారత పంజాబ్ సాంస్కృతిక పండుగగా వెలసిల్లుతోంది ఈ పండుగ. ఈ క్రీడా కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు పాల్గొంటుంటారు. కిలా రాయ్ పూర్ గ్రామంలో జరిగే ఈ క్రీడోత్సవం చూడటానికి ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు విచ్చేస్తుంటారు. 4000మంది క్రీడాకారులు పాల్గొంటారు. ఎడ్ల పందేలు, గుర్రపుపందేలు ఆడేవారు ఈ క్రీడోత్సవాలలో తమ శక్తి సామర్ధ్యాలు ప్రదర్శించేందుకు పాల్గొంటారు.[6] 

పాటియాలా వారసత్వ పండుగ[మార్చు]

2003లో మొదలైన ఈ పండుగ పాటియాలాలోని కిలా ముబారక్ కాంప్లెక్స్ లో 10 రోజుల పాటు జరుగుతాయి. ఈ మేళాలో కళలు, భారతీయ సంగీతం, నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు.[1]

కిలా ముబారక్ గృహాల్లోని దర్బార్ హాల్ లో షాండిలియర్లు, చారిత్రిక వస్తువులు, పాటియాలకు చెందిన తైలవర్ణ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణలు.[7]

షేష్ కళామందిరంలో పాటియాలా, కపుర్తలా, కంగ్రా, రాజస్థాన్ లకు చెందిన అరుదైన సూక్ష్మ చిత్రాల ప్రదర్శనలు జరుగుతుంటాయి. పంజాబీ జానపద కళలు, తూర్పు టిబెట్ కు చెందిన అరుదైన వస్తువులు, చెక్కిన దంతాలు, పాటియాలాకు చెందిన ఖరీదైన షాండిలియర్లు, గ్లాస్ సామాన్లు, రెండు అంతస్తుల ఫౌంటెయిన్.

ప్రపంచం మొత్తం మీద షేష్ మహల్ లో దొరికే మెడల్ గ్యాలరీ చాలా ఖరీదైన, అరుదైనవిగా పేరు పొందాయి. మహారాజా భుపిందర్ సింగ్ సేకరించిన ఈ 3200 మెడళ్ళను ఆయన కుమారుడు మహారాజా యాదవేందర్ సింగ్ పంజాబీ జాతికి అంకితం ఇచ్చేశారు. బ్రిటన్ కు చెందిన విక్టోరియా క్రాసెస్, ఫ్రాన్స్ కు చెందిన లెగియన్ డీ హానర్, జర్మనీ ఐరన్ క్రాస్, వంటి అరుదైన వస్తువులు ఉంటాయి. 12వ శతాబ్దానికి చెందిన పోర్చ్యుగల్ కు చెందిన వస్తువులు అతి ప్రాచీనమైనవి.

20శతాబ్దంలో సుప్రసిద్ధుడైన ట్యాక్సీడెర్మిస్ట్ తయారు చేసిన స్టఫ్డ్ జంతువులు, పక్షులతో (చనిపోయిన జంతువుల, పక్షుల కళేబరాల్లో వివిధ పదార్ధాలు కూరి తిరిగి జంతువు ఆకృతి కల్పిస్తారు) షేష్ మహల్ లోని సహజ చరిత్ర గ్యాలరీ అలరిస్తుంది.

రూప్‌నగర్ వారసత్వ పండుగ[మార్చు]

స్థానిక సూఫీ సంగీతం, భాంగ్రా నృత్యాలు, ఇతర పంజాబీ కళాకారుల ప్రతిభను వెలికి తీస్తుంది ఈ రూప్ నగర్ పండుగ.[1][8]

కపుర్తాలా వారసత్వ పండుగ[మార్చు]

బాబా జస్సా సింగ్ అహ్లువాలియా వారసత్వ పండుగను కపుర్తాలా వారసత్వ ట్రస్టు, భారత జాతీయ కళల ట్రస్టు, పంజాబ్ ప్రభుత్వ సాంస్కృతిక వారసత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తాయి. శాస్త్రీయ సంగీతం, నృత్యాలు, నాటకాలు ప్రదర్శించే ఈ పండుగ ప్రతి ఏటా జగత్ జిత్ ప్యాలస్ లో జరుగుతుంది.[1][8][9]

అమృత్ సర్ వారసత్వ పండుగ[మార్చు]

ఈ పండుగలో భాంగ్రా, గిద్దా, గట్కా నృత్య ప్రదర్శనలు, గుర్రపు, ఏనుగు ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణలు, కీర్తనలు, నాటకాలు, సంగీతం, నృత్య ప్రదర్శనలు కూడా జరుగుతాయి.[1][8][10]

హరివల్లబ్ సంగీతోత్సవం[మార్చు]

ప్రతీ సంవత్సరం డిసెంబరు 27-30తేదీల్లో నిర్వహించే ఈ సంగీతోత్సవం స్వామి హరివల్లబ్ గౌరవార్ధం నిర్వహిస్తారు.[1] భారత ప్రభుత్వం ఈ సంగీతోత్సవాన్ని జాతీయ సంగీతోత్సవంగా గుర్తించడం విశేషం.[11]  జలందర్ నగరంలోని దేవి తలబ్ మందిరంలో ఈ సంగీతోత్సవం నిర్వహిస్తారు.[12]

References[మార్చు]