పడగాల శ్యాంసుందర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పడగాల శ్యాంసుందర్ రంగస్థల నటులు, దర్శకులు, రచయిత, ప్రయోక్త. దాదాపుగా 30 సంవత్సరాల నుండి నాటకరంగంలో ఉన్నారు. వివిధ నాటకాల్లో దాదాపుగా 45 పాత్రలు పోషించారు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

1964లో రంగస్థలానికి వచ్చారు. మనోరంజని అనే పేరుతో ఒక పేక్షక సంఘాన్ని స్థాపించి సభ్యులను చేర్చుకొని కొన్ని నాటక ప్రదర్శనలు ఇచ్చారు. తెనాలి పట్టణ రంగస్థలకళాకారుల సంఘం కార్యదర్శిగా, లలితకళా సమాఖ్య కార్యదర్శిగా పనిచేసి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వికటకవి తెనాలి రామకృష్ణ కళానికేతన్ సంస్థకు కార్యదర్శిగా ఉండి నాటకాల పోటీలు ఏర్పాటుచేశారు. అభ్యుదయ కళాసమితి, గుంటూరు జిల్లా ప్రజానాట్యమండలి, నహకారోద్యోగుల సాంస్కృతిక సమాఖ్యలలో కార్యవర్గ నభ్యులుగా ఉన్నారు. యూత్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి తెనాలి శాఖ ప్రధాన కార్యదర్శిగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మోహనజ్యోతి, కళాజగతి, నటజ్యోతి పత్రికలకు విలేఖరిగా పనిచేసి కళాసంస్థలకు కళాకారులకు వారి సేవలందించారు.

అల్లూరి సీతారామరాజు, ఈనాడు రేడియో నాటకాలలో పాల్గొన్నారు. శ్యాంసుందర్ రచించిన వసంతం మళ్ళీ వస్తుంది నాటిక రేడియోలో ప్రసారం చేయబడింది. మద్రాసు దూరదర్శన్ లో ప్రసారమైన అమ్మకానికో అబ్బాయి నాటకం మద్రాసు ప్రేక్షకుల్ని అలరించింది. హైదరాబాదు దూరదర్శన్ లో ప్రసారం చేయబడిన కొత్తబాట, పాణిగ్రహణం, నిశ్శబ్ద గీతం కన్నైగంటి హనుమంతు మొదలైన వాటిలో పాత్రలు ధరించారు.

నటించిన నాటకాలు[మార్చు]

 1. అన్నాచెల్లెలు
 2. భయం
 3. నటనాలయం
 4. చిల్లరకొట్ట చిట్టెమ్మ
 5. ఈనాడు
 6. కట్టబ్రహ్మన్న

నటించిన నాటికలు[మార్చు]

 1. తుఫాన్
 2. రేపేంది
 3. కుక్క
 4. ఎవరుబొంగ
 5. వీరకుంకుమ
 6. పగ
 7. హిమజ్వాల

రచించిన నాటికలు[మార్చు]

 1. అమ్మకానికో అబ్బాయి
 2. పూజాపుప్పం
 3. వసంతం మళ్ళీ వస్తుంది
 4. సె దెమ్ వెల్కం
 5. గొర్రెలకూ కొమ్ములున్నాయి

మూలాలు[మార్చు]

 • పడగాల శ్యాంసుందర్, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 277.