Jump to content

పద్మప్రియ జానకిరామన్

వికీపీడియా నుండి
పద్మప్రియ జానకిరామన్
పద్మప్రియ జానకిరామన్ (2008)
పద్మప్రియ జానకిరామన్

(1980-02-28) 1980 ఫిబ్రవరి 28 (వయసు: 46)
వృత్తిచలనచిత్ర నటి, ప్రచారకర్త, కూచిపూడి కళాకారిణి
Spouseజాస్మిన్ షా

పద్మప్రియ జానకిరామన్ భారతీయ చలనచిత్ర నటి, ప్రచారకర్త, కూచిపూడి కళాకారిణి. 2003లో తెలుగులో వచ్చిన శ్రీనువాసంతిలక్ష్మి అనే చిత్రంద్వారా చిత్రరంగంలోకి ప్రవేశించింది. అటుతర్వాత తమిళ, మలయాళ సినిమాల్లో ప్రధాన పాత్రలను పోషించింది. 5 సంవత్సరాలకాలంలోనే తెలుగు, మలయాళం, బెంగాళీ, తమిళం, కన్నడ, హిందీ చిత్రాలలో నటించడమేకాకుండా, అనేక దక్షిణ భారతదేశ బహుమతులు అందుకుంది.

జననం

[మార్చు]

పద్మప్రియ ఢిల్లీలోని తమిళ కుటుంబానికి చెందిన జానకిరామన్, విజయ దంపతులకు 1980, ఫిబ్రవరి 28న జన్మించింది. పంజాబ్ లో పెరిగింది. ఈమె డిగ్రీ వరకు సికింద్రాబాద్లో చదివింది. బెంగుళూరులో కొంతకాలం పనిచేసి తర్వాత మోడలింగ్ లో చేరి అలా సినీరంగంలో ప్రవేశించింది. 2001 లో మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ గెలుచుకుంది.[1]

సినీరంగ ప్రస్థానం

[మార్చు]

2003లో తెలుగులో వచ్చిన శ్రీనువాసంతిలక్ష్మి అనే చిత్రంద్వారా చిత్రరంగంలోకి ప్రవేశించింది. పద్మప్రియ ఇప్పటివరకు దక్షిణాది భాషల్లో 48 చిత్రాలలో... హిందీ, బెంగాలీ భాషల్లో ఒక్కొ చిత్రంలో నటించింది. నేషనల్ స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకుంది. అంతేకాకుండా, వీటితోపాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు సార్లు, తమిళనాడు ప్రభుత్వం నుంచి ఒక్కసారి, మూడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుంది.[2]

నటించిన చిత్రాల జాబితా

[మార్చు]
సంవత్సరంచిత్రంపేరుపాత్రపేరుభాషఇతర వివరాలు
2004శీను వాసంతి లక్ష్మివాసంతితెలుగు
కాజ్ఛాలక్ష్మీ మాధవన్మళయాలంఏసియానెట్ ఉత్తమ నూతన నటి
అమృతంసైనాబా గోపినాథన్మళయాలం
2005తవమై తవమిరుందువసంతి రామలింగంతమిళంఫిల్మ్ ఫేర్ - ఉత్తమ తొలిచిత్ర నటి (దక్షిణ)
రాజమాణిక్యంమల్లిమళయాలం
2006వడుక్కం నాతన్మీరామళయాలంఏసియానెట్ ఉత్తమ నటి (కరుతా పక్షికల్ సినిమా)
పట్టియాల్సరోజతమిళం
అశ్వరూదన్సీతాలక్ష్మీమళయాలం
భార్గవ చరితం మూనం కందన్సోఫియామళయాలం
కరుతా పక్షికల్పూన్గోడిమళయాలంఫిల్మ్ ఫేర్ - ఉత్తమ నటి – మళయాలం
ఉత్తమ ద్వితీయ నటి (కేరళ రాష్ట్ర బహుమతి) ఎస్ యువర్ హానర్ కు
ఉత్తమ నటి (ఏసియానెట్ బహుమతి) వడుక్కం నాతన్ కు
ఎస్ యువర్ హానర్మాయా రవిశంకర్మళయాలంఉత్తమ ద్వితీయ నటి (కేరళ రాష్ట్ర బహుమతి) కరుతా పక్షికల్ కు
2007అంచిల్ ఓరల్ అర్జునన్పతివ్రమళయాలం
వీరలిపట్టుపూజమళయాలం
సతం పోడతేభానుమతితమిళం
పరదేశిఉషామళయాలం
నాలు పెన్నుంగల్కున్నిపెన్నుమళయాలం
టైంసుసన్ మేరి థామస్మళయాలం
మిరుగంఅజాగమ అయ్యనార్తమిళంఉత్తమ నటి (కేరళ రాష్ట్ర బహుమతి)
నామినేట్ (విజయ ఉత్తమ నటి బహుమతి)
2008పచమరాతనలిల్అను సచ్చిదానందన్మళయాలంనామినేట్ (ఫిల్మ్ ఫేర్ - ఉత్తమ నటి)
మై మదర్స్ లాప్ టాప్పాయల్మళయాలం
2009భార్య స్వంతం సుహ్రుతుశ్రీలక్ష్మీ వల్లభన్మళయాలం
పొక్కిశంనదిరాతమిళంనామినేట్ (ఫిల్మ్ ఫేర్ - ఉత్తమ నటి - తమిళం)
నామినేట్ (విజయ్ అవార్డు - ఉత్తమ నటి)
కథ పరయుం తెరువొరంనీరజమళయాలం
కన కన్మనిమాయరాయ్మళయాలం
పళస్సి రాజానీలిమళయాలం(ఫిల్మ్ ఫేర్ - ఉత్తమ సహాయ నటి - మళయాలం)
భూమిఫౌజియామళయాలం
2010స్ట్రైకర్మధుహిందీ
ఇరుంబుక్కోటి మురట్టు సింగంపప్పలితమిళం
అందరి బంధువయపద్దుతెలుగు
తమస్సుడా. శాంతికన్నడ
కుట్టి శ్రాంక్రేవమ్మమళయాలం
2011ఐదోండ్ల ఐదుకన్నడ
సీనియర్స్ఇందుమళయాలం
స్నేహవీడుసునందమళయాలం
నాయికగ్రేసిమళయాలం
2012అపరాజిత తుమికుహుబెంగాళీ
కోబ్రాషెర్లీమళయాలం
మంజడికురురోజామళయాలం
బ్యాచలర్ పార్టీఐంటెం డాన్సర్మళయాలంఅతిథి పాత్ర
నెంబర్ 66 మధుర బస్సూర్య పదంమళయాలం
ఇవన్ మేఘరూపన్అమ్మినిమళయాలం
పోపిన్స్కంతమళయాలం
2013మాడ్ దాడ్డా. రాసియామళయాలం
పాపిలియో బుద్ధకలెక్టర్మళయాలం
లేడిస్ అండ్ జెంటిల్ మెన్జ్యోతిమళయాలం
తంగా మీన్కల్ఎవితతమిళం
2014బ్రహ్మాంతమిళంఅతిథి పాత్ర
ఐయోబింటే పుస్తకంరేహల్మళయాలం
2017శివరంజినియుం ఇన్నుయుం సిలా పెంగలంశివరంజనితమిళం
ది ఆర్ఫన్TBAబెంగాళీచిత్రీకరణ
చెఫ్TBAహిందీచిత్రీకరణ
థియాన్TBAమళయాలం
క్రాస్ రోడ్TBAమళయాలంచిత్రీకరణ
ప్రేతముండే సూక్షికుకTBAమళయాలం
పటేల్ సర్ రాజేశ్వరి తెలుగు

వివాహం

[మార్చు]

పద్మప్రియ న్యూయార్క్, కొలంబియా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే జాస్మిన్ షా అనే వ్యక్తిని ప్రేమించింది. 2014, నవంబరు 12న పద్మప్రియ, జాస్మిన్ వివాహం జరిగింది.[2] వివాహం తరువాత కూడా సినిమాలలో నటిస్తుంది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. టాలీవుడ్ టైమ్స్. "పద్మప్రియ". Retrieved 10 May 2017.[permanent dead link]
  2. 1 2 సాక్షి. "పద్మప్రియ ప్రేమ వివాహం". Retrieved 10 May 2017.
  3. సాక్షి. "పద్మప్రియ రీ ఎంట్రీ". Retrieved 11 May 2017.
  4. 6టీవీలైవ్. "పద్మప్రియ సెకండ్ ఇన్నింగ్స్..." Archived from the original on 23 ఫిబ్రవరి 2015. Retrieved 11 May 2017.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)