Jump to content

పరాశర సరస్సు

అక్షాంశ రేఖాంశాలు: 31°45′15″N 77°06′05″E / 31.75426°N 77.10141°E / 31.75426; 77.10141
వికీపీడియా నుండి
పరాశర సరస్సు లేదా కమ్రునాగ్ సరస్సు
Parashar Lake
పైనుండి తీసిన సరస్సు చిత్రం
పరాశర సరస్సు లేదా కమ్రునాగ్ సరస్సు is located in Himachal Pradesh
పరాశర సరస్సు లేదా కమ్రునాగ్ సరస్సు
పరాశర సరస్సు లేదా కమ్రునాగ్ సరస్సు
ప్రదేశంమండీ జిల్లా
అక్షాంశ,రేఖాంశాలు31°45′15″N 77°06′05″E / 31.75426°N 77.10141°E / 31.75426; 77.10141
సరస్సులోకి ప్రవాహంవర్షపు నీరు
వెలుపలికి ప్రవాహంభాష్పీభవనం
ఉపరితల వైశాల్యం1 హె. (2.5 ఎకరం)
సరాసరి లోతుకనుగొనబడలేదు
గరిష్ట లోతుకనుగొనబడలేదు
ఉపరితల ఎత్తు2,730 మీ. (8,960 అ.)
మూలాలుHimachal Pradesh Tourism Dep.

పరాశర సరస్సు హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నగారానికి తూర్పున 49 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని కమ్రునాగ్ సరస్సు అని కూడా అంటారు. పరాశరుడు అనే సాధువు ఈ ప్రదేశంలో ధ్యానం చేయడం వలన ఈ సరస్సుకు అతడి పేరు వచ్చింది.[1]

భౌగోళికం

[మార్చు]

ఈ సరస్సు సముద్ర మట్టానికి 2,730 మీ (8,960 అడుగులు) ఎత్తులో ఉంది. దీని చుట్టూ వేగంగా ప్రవహించే బియాస్ నది, మంచుతో కప్పబడిన పర్వతాలు ఉన్నాయి.[2]

ప్రత్యేకత

[మార్చు]

సరస్సును మండీ నుండి లేదా కుల్లు జిల్లాలోని బజౌరా నుండి చేరుకోవచ్చు. సరస్సులో ఒక గుండ్రని, తేలియాడే భూభాగం ఉంది. ఈ భూభాగం కొన్ని మొక్కలతో, కుళ్ళిపోయిన వివిధ పదార్ధాలతో కూడి ఉంటుంది. ఈ తేలియాడే ద్వీపం సరస్సులోని అన్ని దిశల్లోకి కదులుతుంది. ఇది సరస్సు మొత్తం విస్తీర్ణంలో 7% ఆవరించి ఉంటుంది. ఈ సరస్సు లోతును ఇప్పటి వరకూ ఎవరూ లెక్కించలేదు. తుఫానులు, సునామీలు వచ్చినపుడు చుట్టుపక్కల ఉన్న అనేక పెద్ద పెద్ద దేవదారు వృక్షాలు ఇందులో పడి పూర్తిగా మునిగిపోయాయి.[3]

పురాణాలు,నమ్మకాలు

[మార్చు]

మహాభారతంలోని పాండవ సోదరులలో ఒకరైన భీముడు ఈ సరస్సును సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. కురుక్షేత్ర మహాభారత యుద్ధం తరువాత, పాండవులు కమ్రునాగ్ అనే సాధువుతో కలిసి వస్తున్నప్పుడు, ఈ ప్రదేశానికి చేరుకుంటారు. అపుడు కమ్రునాగ్ ఇక్కడి ప్రశాంతమైన పరిసరాలను చూసి ఇష్టపడతాడు. ఎప్పటికీ ఇక్కడే నివసించాలని నిర్ణయించుకున్నాడు. అపుడు భీముడు, కమ్రునాగ్ నివసించడానికి తన మోచేతితో ఒక పెద్ద కొండను కదిలిస్తాడు తద్వారా ఈ సరస్సు ఏర్పడుతుంది. కాబట్టి ఈ సరస్సు మోచేతి ఆకారంలో ఉంటుంది. పూర్వ కాలంలో చాలా మంది భక్తులు ఈ సరస్సును పవిత్రమైనదిగా భావించి, ఇక్కడికి వచ్చి అనేక నగలు, ఆభరణాలు వంటి వాటిని ఈ సరస్సులో వదిలేసి మొక్కు తీర్చుకునేవారు. కాబట్టి ఇప్పుడు ఈ సరస్సు కింద అపారమైన సంపద దాగి ఉందని ప్రజల నమ్మకం.[4]

మూలాలు

[మార్చు]
  1. "Mandi - Prashar route". OpenStreetMap.org. Retrieved 20 Jan 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Bajaura - Prashar route". OpenStreetMap.org. Retrieved 20 Jan 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Temples in the Clouds", film by Jim Mallinson and Chicco Patuzzi, 2008, http://www.filmsouthasia.org/archive/details.php?id=1016[permanent dead link]
  4. Vinayak, Akshatha (April 24, 2018). "Mysterious Stories of Prashar Lake in Mandi". nativeplanet.com. Retrieved 20 Jan 2021.{{cite web}}: CS1 maint: url-status (link)