పాండురంగ్ ఫండ్కర్
పాండురంగ్ పుండలిక్ ఫండ్కర్ | |||
వ్యవసాయ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 8 జూలై 2016 – 31 మే 2018 | |||
ముందు | ఏక్నాథ్ ఖడ్సే | ||
---|---|---|---|
తరువాత | చంద్రకాంత్ పాటిల్ | ||
ఉద్యానవన శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 8 జూలై 2016 – 31 మే 2018 | |||
తరువాత | జయదత్ క్షీరసాగర్ | ||
పదవీ కాలం 2005 ఏప్రిల్ 11 – 2011 డిసెంబర్ 22 | |||
ముందు | నితిన్ గడ్కరీ | ||
తరువాత | వినోద్ తావ్డే | ||
మహారాష్ట్ర శాసనసమండలి సభ్యుడు
| |||
పదవీ కాలం 2002 – 2018 | |||
నియోజకవర్గం | శాసనసభ సభ్యులచే ఎన్నికైన | ||
పదవీ కాలం 1989 – 1999 | |||
ముందు | విరాలే మధుసూదన్ | ||
తరువాత | ప్రకాష్ అంబేద్కర్ | ||
నియోజకవర్గం | అకోలా | ||
పదవీ కాలం 1978 – 1985 | |||
ముందు | మాణిక్రావు గవాండే | ||
తరువాత | మాణిక్రావు గవాండే | ||
నియోజకవర్గం | ఖమ్‌గావ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నార్ఖేడ్, బుల్దానా , భారతదేశం | 1950 ఆగస్టు 21||
మరణం | 2018 మే 31 | (వయసు 67)||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సునీత ,( మ. 1979 ) | ||
సంతానం | సాగర్ ఫండ్కర్, వసుంధర ఆకాష్ పాండురంగ్ ఫండ్కర్ | ||
నివాసం | ఖమ్‌గావ్ , మహారాష్ట్ర | ||
పూర్వ విద్యార్థి | నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం | ||
మూలం | [1] |
పాండురంగ్ పుండలిక్ ఫండ్కర్ (21 ఆగస్టు 1950 - 31 మే 2018), అలియాస్ భౌసాహెబ్ ఫండ్కర్ భారతదేశానికి రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికై మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పని చేశాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]పాండురంగ్ ఫండ్కర్ మహారాష్ట్ర రాష్ట్రం, బుల్దానా జిల్లా, నందురా మండలంలోని నార్ఖేడ్ గ్రామంలో 1950 ఆగస్టు 21న జన్మించాడు. ఆయన ఎంఏ, ఎకనామిక్స్ మొదటి సంవత్సరం వరకు తన విద్యను పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]పాండురంగ్ ఫండ్కర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరి కళాశాల రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చేరాడు. ఆయన 1974లో జన్ సంఘ్‌లో చేరి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిరసనలలో పాల్గొని అకోలా జైలులో మూడు నెలలు,అంతర్గత భద్రతా చట్టం (మిసా) మెయింటెనెన్స్ చట్టం కింద థానే జైలులో తొమ్మిది నెలలు గడిపాడు. పాండురంగ్ ఫండ్కర్ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978లో ఖమ్‌గావ్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 1980లో తిరిగి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1989 నుండి 1996 వరకు అకోలా నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఫండ్కర్ 1992లో బీజేపీ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా నియమితుడై 1999 వరకు పని చేసి ఆ తరువాత 2000 నుండి 2003 వరకు రెండోసారి బీజేపీ అధ్యక్షుడిగా పని చేశాడు.
పాండురంగ్ ఫండ్కర్ 2002 నుండి 2018 వరకు మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా పని చేసి మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా, జూలై 2016లో ఫడ్నవీస్ మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.
మరణం
[మార్చు]పాండురంగ్ ఫండ్కర్ అనారోగ్య కారణంగా జస్లోక్ ఆసుపత్రిలో చేరి కోరుకున్న తరువాత డిశ్చార్జ్ అయ్యి ఆ తరువాత 2018 మే 31న గుండెపోటు రావడంతో సియోన్‌లోని సోమయ్య ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య సునీత, ఇద్దరు కుమారులు సాగర్ ఫండ్కర్ , ఆకాష్ పాండురంగ్ ఫండ్కర్ & ఒక కుమార్తె వసుంధర ఉన్నారు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (31 May 2018). "Maharashtra Agriculture minister Pandurang Fundkar passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.
- ↑ The Hindu (31 May 2018). "Maharashtra Agriculture Minister Pandurang Fundkar passes away" (in Indian English). Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.
- ↑ The Times of India (31 May 2018). "Maharashtra Agriculture minister Pandurang Fundkar dies at 67". Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.