పాకిస్తాన్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

 

పాకిస్తాన్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడులు
the Insurgency in Khyber Pakhtunkhwa,
the War in Afghanistan and the War on Terrorలో భాగము

ఆఫ్ఘనిస్తాన్‌లో దిగుతున్న MQ-9 రీపర్
తేదీ2004 జూన్ 18 – 2018 జనవరి 24[1][2][3][4][5]
(13 సంవత్సరాలు, 7 నెలలు , 6 రోజులు)
ప్రదేశంFederal Tribal Areas, Pakistan
ఫలితంAmerican operational success[6]
  • Most recent drone strike launched in January 2018.
  • 81 high-level insurgent leaders and thousands of low-level insurgents killed[7]
  • Deaths of Afghan Taliban head Akhtar Mansour, and successive TPP heads Baitullah Mehsud, Hakimullah Mehsud, and Maulana Fazlullah.
  • Destruction of numerous insurgent camps and safe havens
  • 5 drone strikes in 2017, followed by one in 2018 and none in 2019[8]
  • Substantial reduction in insurgent activity by 2017.[9]
  • 430 drone strikes confirmed[10]
ప్రత్యర్థులు
 United States
  •  USAF
  • CIA
  • Supported by:
     United Kingdom
    తాలిబాన్
    తెహ్రీక్-ఇ-పాకిస్తాన్
    తెహ్రీక్-ఇ-నఫాజ్-ఇ-షరియత్-ఇ-మొహమ్మది
    హక్కానీ నెట్‌వర్క్
    అల్ కైదా
    లష్కర్ ఇ ఇస్లాం
    ముజాహిదీన్
    ఉజ్బెక్ ఇస్లామిక్ మూవ్‌మెంట్
    తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ
    మూస:Country data Islamic State of Iraq and the Levant ఐసిస్
    సేనాపతులు, నాయకులు
    యు.ఎస్.ఏ United States
    President
    Donald Trump
    (2017–18)
    Barack Obama
    (2009–17)
    George W. Bush
    (2004–09)
    United Kingdom United Kingdom
    Prime Minister
    Theresa May
    (2016–2019)
    David Cameron
    (2010–16)
    Gordon Brown
    (2007–10)
    Tony Blair
    (2004–07)
    Tehrik-i-Taliban

    Maulana Fazlullah  
    Khan Saeed Mehsud Sajna  
    Hafiz Gul Bahadur
    Adnan Rashid
    Mangal Bagh
    Abdul Aziz Ghazi
    Hakimullah Mehsud  
    Abdullah Mehsud  
    Baitullah Mehsud  
    Maulvi Nazir  
    Faqir Mohammed  (POW)[11]
    Nek Muhammad Wazir  
    Abdul Rashid Ghazi  
    Sufi Muhammad  (POW)
    Nasib Zada  [12]
    al-Qaeda
    Ayman al-Zawahiri
    Osama bin Laden  
    Ilyas Kashmiri  
    Mohammad Hasan Khalil al-Hakim  
    Atiyah Abd al-Rahman  
    Abu Laith al-Libi  
    Abu Yahya al-Libi  
    Abu-Zaid al Kuwaiti  
    Fahid Mohammed Ally Msalam  
    Sheikh Ahmed Salim Swedan  
    Ahmed Mohammed Hamed Ali  
    Sheikh Fateh  [13]
    Adnan Gulshair el Shukrijumah  [14]


    మూస:Country data Islamic State of Iraq and the Levant ISIL
    Abu Bakr al-Baghdadi 
    Hafiz Saeed Khan [15]
    Abdul Rahim Muslim Dost (2014–2015)[16][17]
    Usman Ghazi [18]

    మూస:Country data Islamic State of Iraq and the Levant IMU Group
    Usman Ghazi 
    Tohir Yuldashev 
    Najmiddin Jalolov 
    Abu Usman Adil 
    Mirzazhanov Atoyevich
    బలం
    ~30 UAVs[19]Unknown
    ప్రాణ నష్టం, నష్టాలు
    9 (అమెరికా నిఘా ఏజంట్లు, సిఐఎ అధికారులు)~2,000–3,500 ఉగ్రవాదులు[20][21][22]
    పౌరుల మరణాలు: 158–965

    లాంగ్ వార్ జర్నల్:
    158 civilians killed
    న్యూ అమెరికన్ ఫౌండేషన్:
    245–303 civilians killed

    బ్యూరో ఆఫ్ ఇంవెస్టిగేటివ్ జర్నలిజం:
    424–969 civilians killed

    2004, 2018 మధ్య, అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యొక్క స్పెషల్ యాక్టివిటీస్ డివిజన్ వారి కార్యాచరణ నియంత్రణలో అమెరికా వైమానిక దళం నడిపే మానవరహిత వైమానిక వాహనాలను (డ్రోన్లు) ఉపయోగించి వాయువ్య పాకిస్తాన్లోని వేలాది లక్ష్యాలపై అమెరికా ప్రభుత్వం దాడులు చేసింది. [23] [24] ఈ దాడుల్లో ఎక్కువ భాగం వాయువ్య పాకిస్తాన్‌లోని ఆఫ్ఘన్ సరిహద్దు వెంబడి ఉన్న కేంద్ర పరిపాలనలో ఉండే గిరిజన ప్రాంతాల్లోని లక్ష్యాలపై జరిగాయి. అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ పరిపాలనలో ప్రారంభమైన ఈ దాడులు, అతని వారసుడు బరాక్ ఒబామా హయాంలో గణనీయంగా పెరిగాయి. [25] మీడియాలో కొందరు ఈ దాడులను " డ్రోన్ యుద్ధం" గా పేర్కొన్నారు. [26] [27] జార్జ్ డబ్ల్యూ. బుష్ ప్రభుత్వం అధికారికంగా ఈ దాడులను ఖండించగా, 2013 మే లో, ఒబామా ప్రభుత్వం మొట్ట మొదటిసారిగా నలుగురు అమెరికా పౌరులు ఈ దాడులలో హతులయ్యారని అంగీకరించింది. [28] పాకిస్తాన్‌లో అమెరికా డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా 2013 డిసెంబరులో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ దాడులు "ఐక్యరాజ్యసమితి చార్టరును, అంతర్జాతీయ చట్టాలను, మానవతా నిబంధనలనూ ఉల్లంఘించడమే"నని పేర్కొంది. [29]

    పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ దాడులను విరమించుకోవాలని పదేపదే డిమాండ్ చేశాడు: "డ్రోన్ల వాడకం మా ప్రాదేశిక సమగ్రతను నిరంతరం ఉల్లంఘించడమే కాక, మా దేశం నుండి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే మా సంకల్పానికి, మా ప్రయత్నాలకూ ఇది భంగకరం" అని అతడు అన్నాడు [30] అయితే, పాకిస్తాన్ అధికారుల నుండి, ప్రజల నుండీ వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఈ దాడులు చేయడానికి వివిధ మాజీ ప్రధానమంత్రులు అమెరికాకు రహస్యంగా అనుమతులు ఇచ్చారు. ఈ దాడులు చట్టవిరుద్ధమని, అమానవీయమైనవనీ, సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను ఉల్లంఘించడమేననీ, యుద్ధ నేరమనీ పెషావర్ హైకోర్టు తీర్పునిచ్చింది. [31] ఒబామా పరిపాలన దీన్ని అంగీకరించలేదు. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదని, దాడి చేసే పద్ధతి ఖచ్చితమైనది, ప్రభావవంతమైనదీ నని అతడు వాదించాడు. [32] ఈ దాడుల్లో హతులైన ముఖ్యమైన వ్యక్తుల్లో కొందరు - పాకిస్తాన్ తాలిబాన్ నాయకుడు ఫజ్లుల్లా (ఆఫ్ఘనిస్తాన్ - పాకిస్తాన్ సరిహద్దులో 2018 జూన్ 14 న జరిగిన దాడిలో ఇతడు హతుడయ్యాడు), పాకిస్తాన్ తాలిబాన్ మాజీ నాయకుడు బైతుల్లా మెహసూద్ ( 2009 ఆగస్టు 5, 2009 న దక్షిణ వజీరిస్తాన్లో జరిగిన దాడిలో చనిపోయాడు), మెహసూద్ వారసుడు హకీముల్లా మెహ్సూద్ (2013 నవంబరు 1 న జరిగిన దాడిలో హతుడయ్యాడు), ఐసిస్-కె నాయకుడు (ఎమిర్) హఫీజ్ సయీద్ ఖాన్ ( అచిన్ జిల్లా సరిహద్దులో జరిగిన దాడిలో చనిపోయాడు), ఆఫ్ఘన్ తాలిబాన్ నాయకుడు అక్తర్ మన్సూర్ (2016 మే 21 న పాకిస్తాన్లోని అహ్మద్ వాల్ లో జరిగిన దాడిలో హతుడయ్యాడు).

    పాకిస్తాన్‌లో అమెరికా జరిపిన ఈ దాడుల కార్యకలాపాలు అదే సరిహద్దు ప్రాంతంలో, ఆఫ్ఘనిస్తాన్‌ వైపున జరిపిన డ్రోన్ దాడులతో ముడిపడి ఉన్నాయి. ఈ దాడుల్లో 3,798 నుండి 5,059 మంది వరకు ఉగ్రవాదులు, 161 నుండి 473 మంది వరకు పౌరులూ మరణించారు. మరణించిన ఉగ్రవాదుల్లో ఆఫ్ఘన్ తాలిబాన్, పాకిస్తాన్ తాలిబాన్, ఇస్లామిక్ స్టేట్, అల్-ఖైదా, హక్కానీ నెట్‌వర్క్, ఇతర సంస్థలకు చెందిన వందలాది ఉన్నత స్థాయి నాయకులు ఉన్నారు. ఒక్క 2017 మే లోనే పది రోజుల వ్యవధిలో 70 మంది తాలిబాన్ నాయకులు మరణించారు. [33]

    అవలోకనం

    [మార్చు]

    ఈ దాడులను పాకిస్తాన్ ప్రభుత్వం బహిరంగంగా ఖండించింది. [34] అయితే, పాకిస్తాన్లోని షాంసీ ఎయిర్ఫీల్డ్ నుండి 2011 ఏప్రిల్ 21 వరకు డ్రోన్లు పనిచేసేందుకు అనుమతించారనే ఆరోపణలు వచ్చాయి. [35] వికీలీక్స్ వెల్లడించిన రహస్య దౌత్య కేబుల్స్ ప్రకారం, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అష్ఫాక్ పర్వేజ్ కయాని డ్రోన్ విమానాలను రహస్యంగా అంగీకరించడమే కాక, 2008 లో వాటిని పెంచాలని అమెరికన్లు అభ్యర్థించాడు. [36] అయితే, డ్రోన్ క్షిపణులు అనుషంగిక నష్టాన్ని కలిగిస్తాయని పాకిస్తాన్ అంతర్గత మంత్రి రెహమాన్ మాలిక్ అన్నాడు. ఉగ్రవాదులు కొంతమందిని చంపారు, కాని బాధితుల్లో ఎక్కువమంది అమాయక పౌరులే ఉన్నారు " [37] ఈ దాడులు పాకిస్తాన్‌లో అమెరికన్ వ్యతిరేక భావనకు, పాకిస్తాన్‌లో CIA కార్యకలాపాల పరిధి పట్ల పెరుగుతున్న ప్రశ్నార్థకతతో ముడిపడి ఉన్నాయి.

    ఉగ్రవాదుల, పౌరుల మరణాల సంఖ్యల పట్ల నివేదికలు భిన్నంగా ఉంటాయి. [38] సాధారణంగా, CIA, ఇతర అమెరికన్ ఏజెన్సీలు అధిక సంఖ్యలో ఉగ్రవాదులు హతులైనట్లు ప్రకటిస్తూంటాయి. "దాడి జోన్లో ఉన్న సైనిక వయస్సులో ఉన్న మగవారంతా - మరణానంతరం వారు అమాయకులేనని ఋజువు కాని పక్షంలో- ఉగ్రవాదులే అని పరిగణించడమనే వివాదాస్పదమైన పద్ధతి వలన ఈ తేడా వస్తుంది. [39] ఉదాహరణకు, 2010 మే, 2011 ఆగస్టు ల మధ్య జరిగిన దాడుల్లో ఒక్క పౌర మరణం కూడా లేకుండా 600 మంది ఉగ్రవాదులను చంపామని CIA చెప్పింది. ఈ ప్రకటనను చాలామంది వ్యతిరేకించారు. ఈ దాడుల్లో మరణించిన వారిలో 80 శాతం మంది ఉగ్రవాదులు అని న్యూ అమెరికా ఫౌండేషన్ అంచనా వేసింది. [40] మరోవైపు, వాస్తవానికి చాలా తక్కువ మంది ఉగ్రవాదులు మరణించారని, ఎంతో మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారనీ పలువురు నిపుణులు పేర్కొన్నారు. 2009 లో రాసిన వ్యాసంలో బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్‌కు చెందిన డేనియల్ ఎల్. బైమన్, డ్రోన్ దాడుల్లో చంపిన ప్రతి ఒక్క ఉగ్రవాదికి "10 లేదా అంతకంటే ఎక్కువ మంది పౌరులు" హతులైనట్లు రాశాడు. [41] మరణించిన వారిలో ఎక్కువ మంది అల్-ఖైదా, తాలిబాన్ ఉగ్రవాదులు అని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. [42] బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మొత్తం 2,497 నుండి 3,999 మంది హతుల్లో 423 నుండి 965 మంది పౌరులు మరణించినట్లు కనుగొంది. వారిలో 172 నుండి 207 మంది పిల్లలు కూడా ఉన్నట్లు చెప్పింది. ఒబామా అధికారం చేపట్టిన తరువాత, బాధితులకు సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు జరిపిన ఫాలో-అప్ దాడులలో కనీసం 50 మంది పౌరులు మరణించారని, అంత్యక్రియల్లో పాల్గొన్నవారిపై జరిపిన దాడుల్లో 20 మందికి పైగా పౌరులు మరణించారనీ బ్యూరో చెప్పింది. ఈ దాడులను న్యాయ నిపుణులు ఖండించారు. [43] [44] [45]

    బార్బరా ఎలియాస్-సాన్బోర్న్ కూడా, "డ్రోన్ల దాడులకు సంబంధించిన సాహిత్యం చాలావరకు సూచిస్తున్నట్లుగా, ఇటువంటి హత్యల వల్ల, పోరాటం పట్ల ఉగ్రవాదుల దృఢనిశ్చయం మరింత కఠినతరం అవుతుంది. చర్చలు జరిగి పరిష్కారం కుదిరే అవకాశం ఏదైనా ఉన్నా, అవి నిలిచిపోతాయి." అని చెప్పింది. [46] అయితే, RAND కార్పొరేషన్ విశ్లేషణలో పాకిస్తాన్లో "డ్రోన్ దాడులకూ ఉగ్రవాద దాడుల సంఖ్య, దాడుల తీవ్రతలు తగ్గడానికీ సంబంధం ఉంది" అని రాసింది.

    2010 లో న్యూయర్కు టైమ్స్ స్క్వేర్‌లో కారు బాంబు దాడి చేసిన ఫైసల్ షాజాద్, తన స్వదేశమైన పాకిస్తాన్‌లో CIA పదేపదే చేస్తున్న డ్రోన్ దాడులకు ప్రతీకారం గానే ఈ కారు బాంబు దాడి చేసానని చెప్పాడు. [47]

    సలాలా సంఘటనలో నాటో దళాలు 24 మంది పాకిస్తానీ సైనికులను చంపిన తరువాత 2011 నవంబరులో డ్రోన్ దాడులు ఆగిపోయాయి. [48] 2011 డిసెంబరులో షాంసీ ఎయిర్‌ఫీల్డ్‌ నుండి అమెరికన్లను ఖాళీ చేయించి, పాకిస్తానీయులు స్వాధీనం చేసుకున్నారు. [49] ఈ సంఘటన తరువాత సుమారు రెండు నెలల పాటు డ్రోన్ దాడులు ఆగిపోయాయి. మళ్ళీ 2012 జనవరి 10 న దాడులు మొదలయ్యాయి.

    2013 మార్చిలో, ఐక్యరాజ్యసమితి స్పెషల్ రిపోర్టర్ బెన్ ఎమెర్సన్, అమెరికా డ్రోన్ దాడుల వలన కలిగిన పౌర ప్రాణనష్టాన్ని పరిశీలించిన ఐరాస బృందానికి నాయకత్వం వహించాడు. ఈ దాడులు పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించాయని అతడు పేర్కొన్నాడు. డ్రోన్ దాడులకు పాకిస్తాన్ అంగీకరించడం లేదని ఆ దేశానికి చెందిన ప్రభుత్వ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారని త్డు చెప్పాడు. అమెరికా అధికారులు దీన్ని ఖండించారు. [50] 2013 అక్టోబరులో, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ డ్రోన్ దాడుల ప్రభావం గురించి ఒక వివరణాత్మక అధ్యయన నివేదికను ప్రచురించింది. ఇది దాడులను తీవ్రంగా ఖండించింది. ఏకపక్ష పౌర మరణాల సంఖ్యనూ, అందుకు ఉపయోగించిన వ్యూహాలనూ (గాయపడినవారికి సహాయపడే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మరిన్ని దాడులు జరపడం వంటివి), పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్నీ బట్టి, కొన్ని దాడులను చట్టవిరుద్ధమైన హత్యలుగా, యుద్ధ నేరాలుగా పరిగణించవచ్చని ఆ నివేదిక పేర్కొంది. [51]

    2014 మే లో, లక్ష్యిత సంహార కార్యక్రమం "ప్రాథమికంగా ముగిసింద"ని ప్రకటించారు. 2013 డిసెంబరు నుండి ఎటువంటి దాడి జరగలేదు. పౌరులకు హాని జరగదని "నిశ్చయంగా" తెలిసాకే దడులు చెయ్యాలనే కొత్త ఒబామా ప్రభుత్వ విధానం, డ్రోన్ కార్యక్రమాన్ని రక్షణ శాఖ యొక్క కార్యాచరణ నియంత్రణలోకి తీసుకురావాలన్న చట్టసభ సభ్యుల అభ్యర్థనలు [52] (మెరుగైన కాంగ్రెస్ పర్యవేక్షణ కోసం), ఆఫ్గనిస్తాన్ లో సంయుక్త సైనిక, CIA ఉనికిని తగ్గించడం, పాకిస్తాన్‌లో అల్ఖైదా పాకిస్థాన్లో ఉనికి తగ్గడం, డ్రోన్ల దాడులను అమలు చెయ్యడంలో CIA స్థానంలో అమెరికా సైన్యానికి పెరిగిన పాత్ర వంటి వాటితో దాడులు మందగించాయి. [53] [54]

    గణాంకాలు

    [మార్చు]
    అమెరికా డ్రోన్ దాడుల గణాంకాల అంచనా,
    న్యూ అమెరికా ఫౌండేషన్ ప్రకారం
    (2018 జనవరి 1 నాటికి): [55]
    సంవత్సరం దాడులు ప్రమాదాలు
    ఉగ్రవాదులు పౌరులు తెలియదు మొత్తం
    2004 1 3 2 2 7
    2005 3 5 6 4 15
    2006 2 1 93 0 94
    2007 4 51 0 12 63
    2008 36 223 28 47 298
    2009 54 387 70 92 549
    2010 122 788 16 45 849
    2011 70 415 62 35 512
    2012 48 268 5 33 306
    2013 26 145 4 4 153
    2014 22 145 0 0 145
    2015 10 57 0 0 57
    2016 3 9 0 0 9
    2017 8 36 2 1 39
    మొత్తం 409 2,533 288 275 3,096

    బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అమెరికా డ్రోన్ దాడుల గురించి క్రింది సంచిత గణాంకాలను అంచనా వేసింది (2017 సెప్టెంబరు 17 నాటికి):

    2013 జూలైలో BIJ సంపాదించిన పాకిస్తాన్ ప్రభుత్వపు ఒకప్పటి రహస్య నివేదికలో, 2006, 2009 మధ్య జరిగిన 75 డ్రోన్ దాడుల వివరాలున్నాయి. 12 పేజీల ఈ నివేదిక ప్రకారం, ఈ కాలంలో, 746 మంది హతుల్లో 176 మంది పౌరులున్నారు. [57] లాంగ్ వార్ జర్నల్, బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, న్యూ అమెరికా ఫౌండేషన్ ల ప్రకారం 2006, 2007, 2008, 2009 సంవత్సరాల్లో ఈ ఏడూ జరగనన్ని ఎక్కువ పౌర మరణాల నిష్పత్తులు ఉన్నాయి.

    అమెరికా దృక్కోణం

    [మార్చు]

    అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు. బుష్ తన అధ్యక్ష పదవి చివరి సంవత్సరంలో డ్రోన్ దాడులను వేగవంతం చేశాడు. 2009 లో డ్రోన్ల దాడుల్లో హతులైన ఉన్నత స్థాయి లక్ష్యాల జాబితాను పాకిస్తాన్‌కు అందించాడు. బుష్ తరువాత వచ్చిన బరాక్ ఒబామా, పాకిస్తాన్ పౌర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్న సమూహాలను కూడా లక్ష్యాలుగా చేసుకుని దాడులను విస్తరించాడు. 2009 ఫిబ్రవరి 14 -16 తేదీల్లో జరిపిన దాడుల్లో బైతుల్లా మెహసూద్ నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాలను లక్ష్యంగా చేసుకుని జరిపారు. [58] దాడులు కొనసాగుతాయని 2009 ఫిబ్రవరి 25 న, CIA డైరెక్టర్ లియోన్ పనెట్టా చెప్పాడు. బైతుల్లా మెహ్సూద్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల దాడులు చేస్తున్నట్లు 2009 మార్చి 4 న వాషింగ్టన్ టైమ్స్ రాసింది. బలూచిస్తాన్‌ను కూడా ఈ దాడుల్లో చేర్చేలా విస్తరించాలని ఒబామా భావిస్తున్నట్లు 2009 మార్చిలో వార్తలు వచ్చాయి. [59]

    పాకిస్తాన్ కేంద్ర పాలిత గిరిజన ప్రాంతాలలో సైనిక, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడంలోను, వారిని ట్రాక్ చేయడంలోనూ ఆ దేశపు అసమర్థతను వెల్లడిస్తోందని, ఇది దేశపు పరిపాలన వైఫల్యానికి లక్షణంగా అమెరికా ప్రభుత్వం ఉదహరించింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి చార్టర్ VII అధ్యాయం ఆర్టికల్ 51 ప్రకారం ఆత్మ రక్షణ చేసుకోగల రాష్ట్రాల స్వయం నిర్ణాయక హక్కుకు లోబడే తాము ఈ దాడులు చేస్తున్నామని అమెరికాఅ చెప్పింది. 2013 లో నేషనల్ డిఫెన్స్ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా, "అమెరికన్ ప్రజలకు నిరంతరంగాను, ఖచ్చితంగానూ ముప్పును కలిగించగల ఉగ్రవాదుల పట్ల, ఆ ముప్పును సమర్థవంతంగా పరిష్కరించగల ఇతర ప్రభుత్వాలు లేనప్పుడు, మేము చర్యలు తీసుకుంటాం" అని చెప్పాడు. [60]

    పాకిస్తాన్‌లో అమెరికా డ్రోన్ దాడులు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా 2012 జనవరి 30 న ధృవీకరించాడు. దాడుల్లో పౌరుల ప్రాణనష్టం తక్కువగా ఉందని ఆయన నొక్కి చెప్పాడు. [61] 2012 ఫిబ్రవరిలో 1,000 మంది అమెరికా పెద్దలలో జరిపిన అభిప్రాయ సేకరణ‌లో, 83% (లిబరల్ డెమొక్రాట్లలో 77%) మంది డ్రోన్ దాడులకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. [62] డ్రోన్-దాడుల విధానంపై ఒబామా ప్రభుత్వం 2012 ఏప్రిల్‌లో మొదటి వివరణ ఇచ్చింది, ఇది "చట్టపరమైనది, నైతికమైనది, తెలివైనదీను" అని తేల్చింది. [63] CIA న్యాయవాది స్టీఫెన్ ప్రెస్టన్, 2012 ఏప్రిల్ 10 న హార్వర్డ్ లా స్కూల్‌లో "CIA అండ్ ది రూల్ ఆఫ్ లా" అనే ప్రసంగంలో, ఏజెన్సీ యుద్ధ చట్టాలకు కట్టుబడి లేదని చెప్పాడు; ప్రతిస్పందనగా, హ్యూమన్ రైట్స్ వాచ్, ఈ దాడుల కార్యక్రమాన్ని అమెరికా సైన్యం నియంత్రణ లోకి తీసుకురావాలని పిలుపునిచ్చింది. [64] మే లో, నాటో కూటమికి చెందిన సరఫరా కాన్వాయిలు పోకుండా పాకిస్తాన్, తన ఆఫ్ఘన్ సరిహద్దులను మూసివేయడం గురించి చికాగోలో జరిగిన నాటో శిఖరాగ్ర సదస్సులో అనుకున్న పురోగతి సాధించక పోవడంతో అమెరికా తన డ్రోన్ దాడులను వేగవంతం చేసింది. [65]

    పాకిస్తాన్ అభిప్రాయం

    [మార్చు]
    దస్త్రం:Image said to be Predator drone aircraft at Shamsi Airbase in Pakistan -- no longer available on Google Earth..jpg
    2006 లో షాంసీ వైమానిక స్థావరం. మూడు ప్రిడేటర్ డ్రోన్‌లు కనిపిస్తున్నాయి [66]

    2004, 2005 లో ప్రారంభ డ్రోన్ దాడుల్లో కనీసం కొన్నిటికైనా, పాకిస్తాన్‌కు చెందిన ISI ఆమోదం, సహకారం ఉంది. [67] పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ 2014 లో న్యూయార్కర్ పత్రికతో మాట్లాడుతూ పాకిస్తాన్ లోపల డ్రోన్లను నియోగించడానికి సిఐఎను తాను అనుమతించానని, దానికి బదులుగా అమెరికా, తమకు హెలికాప్టర్లను, నైట్ విజన్ పరికరాలనూ సరఫరా చేసిందని చెప్పాడు. డ్రోన్లు పాకిస్తాన్ నియంత్రణలో పనిచేయాలని ముషారఫ్ కోరుకున్నాడు. కాని అమెరికా దానికి ఒప్పుకోలేదు. [68]

    ఈ దాడులు తన సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించాయని పాకిస్తాన్, పదేపదే నిరసన వ్యక్తం చేసింది. మహిళలు, పిల్లలతో సహా పౌరులు మరణించారు. దీని పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రజలూ ఆగ్రహం వెలిబుచ్చారు. [69] ఈ దాడులు అమెరికాకు ఉపయోగపడవని జనరల్ డేవిడ్ పెట్రెయస్‌కు 2008 నవంబరులో చెప్పారు. [70] అయితే, ఈ డ్రోన్ దాడులను అనుమతించే రహస్య ఒప్పందం ఒకటి పాకిస్తాన్, అమెరికా‌ల మధ్య ఉందని 2008 అక్టోబరు 4 న వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. [71] అమెరికా సెనేటర్ డయేన్ ఫెయిన్‌స్టెయిన్ 2009 ఫిబ్రవరిలో ఇలా అంది: "ఇవి పాకిస్తాన్ వైమానిక స్థావరం నుండే ఎగురుతున్నాయి అని నాకు అర్థమైంది." ఇది నిజం కాదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి ఖండించాడు.

    2008 సెప్టెంబరు 8 న, పాకిస్తాన్ పౌరులను అమెరికా వారు చంపడాన్ని పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి ఖండించారు. ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ అతడు ఇలా అన్నాడు: "ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అమెరికా నేతృత్వంలోని దళాలు చేస్తున్న సరిహద్దు ఉల్లంఘనల వల్ల పాకిస్తాన్ పౌరులు మరణిస్తున్నారు. వాటిని ఇకపై సహించం, మాకు ఆత్మరక్షణ హక్కు ఉందని చెప్పాం, అమెరికా ఈ సరిహద్దు దాడులను కొనసాగిస్తే ప్రతీకారం తీర్చుకుంటామని వారికి చెప్పాం." [72]

    అల్ ఖైదా స్పందన

    [మార్చు]

    ఎజెన్స్ ఫ్రాన్స్-ప్రెస్, ది వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, 2011 లో ఒసామా బిన్ లాడెన్‌ను చంపేసిన తరువాత అతడి ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న సందేశాల్లో (అప్పటి అల్ ఖైదాలో 3 వ స్థానంలో ఉన్న అతియా అబ్దుల్-రహమాన్ పంపిన సందేశంతో సహా) పాకిస్తాన్లో జరిపిన డ్రోన్ దాడుల పట్ల కోపం వ్యక్త మయింది. పేరు వెల్లడించని అమెరికా ప్రభుత్వ అధికారి చెప్పినదాని ప్రకారం, డ్రోన్లు ప్రయోగించిన క్షిపణుల వల్ల అల్ ఖైదా కార్యకర్తలు చాలా ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నారనీ, తాము కొత్తగా రిక్రూట్‌మెంటు చేసుకునే వేగం కంటే ఎక్కువగా ఈ సంహారం జరుగుతోందనీ అల్-రెహ్మాన్ తన సందేశంలో ఫిర్యాదు చేశాడు. [73] [74]

    పాకిస్తాన్ ప్రజల నుండి ప్రతిస్పందనలు

    [మార్చు]

    2012 లో స్టాన్ఫోర్డ్, న్యూయార్క్ విశ్వవిద్యాలయ న్యాయ పాఠశాలల పరిశోధకుల నివేదిక ప్రకారం, ఈ నివేదిక కోసం ఇంటర్వ్యూ చేసిన వజీరిస్తాన్లోని పౌరులు "ముస్లింలు కావడం వల్లనే అమెరికా తమను చంపడానికి ప్రయత్నిస్తోందని భావిస్తున్నారు, డ్రోన్ ప్రచారాన్ని ఇస్లాంకు వ్యతిరేకంగా జరుపుతున్న మతపరమైన క్రూసేడ్‌లో భాగం గానే చూస్తున్నారు." [75] డ్రోన్ దాడులు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తాయని వజీరిస్తాన్‌లో పనిచేస్తున్న చాలా మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. డెర్ స్పీగెల్, ది న్యూయార్క్ టైమ్స్, సిఎన్ఎన్ లకు చెందిన విలేకరులు కూడా ఇలాంటి అభిప్రాయాలకే వచ్చారని ఆ నివేదిక పేర్కొంది.

    అనంతర పరిణామం

    [మార్చు]

    ఫలితాలు

    [మార్చు]

    ఈ దాడులు వివిధ ఉగ్రవాద సంస్థలకు (పాకిస్తాన్ తాలిబాన్, ఆఫ్ఘన్ తాలిబాన్, అల్-ఖైదా, హక్కానీ నెట్‌వర్క్ మొదలైనవి) చెందిన సుమారు 2,000 నుండి 3,500 మంది ఉగ్రవాదుల మరణానికి దారితీశాయి, వీరిలో కనీసం 75 మంది ఉన్నత స్థాయి నాయకులు ఉన్నారు. వీరిలో ఆఫ్ఘన్ తాలిబాన్ అధిపతి (ఎమిర్), పాకిస్తాన్ తాలిబాన్‌కు చెందిన పలు నాయకులు, పాకిస్తాన్ తాలిబాన్ డిప్యూటీ కమాండర్, హక్కానీ నెట్‌వర్కు ఉన్నత స్థాయి కమాండరు, భారత ఉపఖండంలోని అల్-ఖైదా డిప్యూటీ కమాండరూ ఉన్నారు. [76]

    ప్రభావం

    [మార్చు]

    ఇంటర్నేషనల్ సెక్యూరిటీ జర్నల్‌లో 2018 లో వచ్చిన అధ్యయనం ప్రకారం, పాకిస్తాన్‌లో డ్రోన్ దాడుల వలన స్థానిక, జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో తీవ్రవాదం పెరిగిందనడానికీ చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయి. [77]

    ఇంటర్నేషనల్ స్టడీస్ క్వార్టర్లీలో 2016 అధ్యయనం ప్రకారం, డ్రోన్ దాడులు పాకిస్తాన్లో సమర్థవంతమైన తీవ్రవాద నిరోధక సాధనంగా పనిచేసాయి. "డ్రోన్ దాడుల వలన ఉగ్రవాద దాడుల సంఖ్య, తీవ్రత తగ్గడంతో పాటు, గిరిజన పెద్దలను లక్ష్యంగా చేసుకోవడం తగ్గింది." అని ఆ అధ్యయనం తెలిపింది. [78]

    మూలాలు

    [మార్చు]
    1. "Drone strike in North Waziristan kills at least eight". Zahir Shah Sherazi. Dawn. 24 సెప్టెంబరు 2014. Archived from the original on 24 సెప్టెంబరు 2014. Retrieved 24 సెప్టెంబరు 2014.
    2. Zahir Shah Sherazi. "Drone strike kills five in South Waziristan". DAWN - SHAE. Archived from the original on 7 అక్టోబరు 2014. Retrieved 7 అక్టోబరు 2014.
    3. "Drone strike kills eight, wounds six in North Waziristan". Zahir Shah Sherazi. Dawn. 6 అక్టోబరు 2014. Archived from the original on 6 అక్టోబరు 2014. Retrieved 7 అక్టోబరు 2014.
    4. "Second drone attack of the day kills three suspected militants in NWA". Zahir Shah Sherazi. Dawn. 7 అక్టోబరు 2014. Archived from the original on 7 అక్టోబరు 2014. Retrieved 7 అక్టోబరు 2014.
    5. "Drone strike kills four suspected militants in North Waziristan". Zahir Shah Sherazi. Dawn. 30 అక్టోబరు 2014. Archived from the original on 30 అక్టోబరు 2014. Retrieved 30 అక్టోబరు 2014.
    6. Sabin Agha, Peter Oborne (31 డిసెంబరు 2016). "Pakistan is winning its war on terror". The Spectator. Archived from the original on 12 అక్టోబరు 2017. Retrieved 27 మే 2020.
    7. "Pakistan Leaders Killed" Archived 18 సెప్టెంబరు 2017 at the Wayback Machine. New America Foundation. June 23, 2018.
    8. "CIA drone strikes in Pakistan, 2004 to present". Bureau of Investigative Journalism. 24 జనవరి 2018. Archived from the original on 5 మార్చి 2017. Retrieved 15 మార్చి 2019.
    9. Sabin Agha, Peter Oborne (31 డిసెంబరు 2016). "Pakistan is winning its war on terror". The Spectator. Archived from the original on 12 అక్టోబరు 2017. Retrieved 21 సెప్టెంబరు 2017.
    10. "Drone War: Pakistan". The Bureau of Investigative Journalism. Archived from the original on 2018-04-21. Retrieved 2018-04-20.
    11. "Former Pakistani Taliban No 2 arrested in Afghanistan: Reports". Archived from the original on 19 February 2013.
    12. "Taliban leader killed in firefight with police". Express Tribune. 26 August 2010. Retrieved 26 March 2011.
    13. "US missile strike 'kills al-Qaeda chief' in Pakistan". BBC News. 28 September 2010.
    14. Sophia Saifi, Ben Brumfield and Susan Candiotti (6 December 2014). "Pakistan kills al Qaeda leader on FBI most wanted list". CNN. Retrieved 6 July 2015.
    15. Arif Rafiq. "What Happened to ISIS's Afghanistan-Pakistan Province?". The Diplomat.
    16. "Released Gitmo detainee joins ISIS – Former Taliban commander named chief of ISIS in Khorasa". Fox News. Retrieved 23 November 2014.
    17. "Local support for dreaded Islamic State growing in Pakistan: Report". The Times of India. Retrieved 23 November 2014.
    18. "IMU announces death of emir, names new leader". The Long War Journal. 4 August 2014.
    19. Miller, Greg; Tate, Julie (1 సెప్టెంబరు 2011). "CIA shifts focus to killing targets". Washington Post. Archived from the original on 26 నవంబరు 2013. Retrieved 16 డిసెంబరు 2011.
    20. "The Bureau's complete data sets on drone strikes in Pakistan, Yemen and Somalia". Bureau of Investigative Journalism. 6 జూన్ 2015. Archived from the original on 8 జూన్ 2015. Retrieved 6 జూన్ 2015.
    21. "Drone Wars Pakistan: Analysis". New America Foundation. Archived from the original on 18 సెప్టెంబరు 2017. Retrieved 18 సెప్టెంబరు 2017.
    22. Long War Journal Archived 18 ఫిబ్రవరి 2015 at the Wayback Machine, "Charting the data for US airstrikes in Pakistan, 2004–2018". Retrieved June 23, 2018.
    23. Ghosh, Bobby; Thompson, Mark (1 June 2009). "The CIA's Silent War in Pakistan". Time. Archived from the original on 14 సెప్టెంబరు 2012. Retrieved 16 December 2011.
    24. Miller, Greg; Tate, Julie (1 September 2011). "CIA shifts focus to killing targets". Archived from the original on 26 November 2013. Retrieved 10 December 2017 – via www.WashingtonPost.com.
    25. Miller, Greg (27 December 2011). "Under Obama, an emerging global apparatus for drone killing". Washington Post. Archived from the original on 6 May 2012. Retrieved 8 May 2012.
    26. De Luce, Dan (20 July 2009). "No let-up in US drone war in Pakistan". Agence France-Presse. Archived from the original on 15 December 2011. Retrieved 16 December 2011.
    27. Bergen, Peter; Tiedemann, Katherine (3 June 2009). "The Drone War". New America Foundation. Archived from the original on 6 December 2011. Retrieved 16 December 2011.
    28. Isikoff, Michael (23 May 2013). "In first public acknowledgement, Holder says 4 Americans died in US drone strikes". NBC News. Archived from the original on 25 July 2013. Retrieved 19 August 2013.
    29. "Archived copy". Archived from the original on 29 August 2018. Retrieved 28 August 2018.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
    30. Ayaz Gul, 22 October 2013, "Pakistani PM Urges US to Stop Drone Strikes Archived 23 అక్టోబరు 2013 at the Wayback Machine", Voice of America. Retrieved 23 October 2013.
    31. Andrew Buncombe, 9 May 2013, "Pakistani court declares US drone strikes in the country's tribal belt illegal Archived 19 మే 2017 at the Wayback Machine", The Independent. Retrieved 23 October 2013.
    32. Seth G. Jones and C. Christine Fair (2010). Counterinsurgency in Pakistan (Santa Monica, CA: Rand), xi, https://www.questia.com/read/122625825[permanent dead link].
    33. Drone Strikes in Afghanistan. Archived 24 జూన్ 2018 at the Wayback Machine Bureau of Investigative Journalism. Retrieved March 6, 2019.
    34. Mazzetti, Mark; Mekhennet, Souad (11 December 2009). "Qaeda Planner in Pakistan Killed by Drone". The New York Times. Archived from the original on 8 June 2012. Retrieved 16 December 2011.
    35. Hodge, Amanda (19 February 2009). "Pakistan allowing CIA to use airbase for drone strikes". Australian. Archived from the original on 20 June 2013. Retrieved 6 December 2011.
    36. Allbritton, Chris (20 May 2011). "Pakistan army chief sought more drone coverage in '08: Wikileaks". Reuters. Archived from the original on 3 September 2011. Retrieved 16 December 2011.
    37. "F-16 jets knock down CIA drones". Hindustan Times. 23 April 2011. Archived from the original on 31 August 2011. Retrieved 16 December 2011.
    38. Shane, Scott (11 August 2011). "C.I.A. Is Disputed on Civilian Toll in Drone Strikes". The New York Times. Archived from the original on 1 November 2011. Retrieved 16 December 2011.
    39. Jo Becker & Scott Shane, 29 May 2012, "Secret 'Kill List' Proves a Test of Obama's Principles and Will Archived 28 ఫిబ్రవరి 2017 at the Wayback Machine", The New York Times. Retrieved 23 October 2013.
    40. "Out of the blue". The Economist. 30 July 2011. Archived from the original on 15 December 2011. Retrieved 16 December 2011.
    41. Byman, Daniel (14 July 2009). "Do Targeted Killings Work?". Brookings Institution. Archived from the original on 21 May 2016. Retrieved 16 December 2011. Critics correctly find many problems with this program, most of all the number of civilian casualties the strikes have incurred. Sourcing on civilian deaths is weak and the numbers are often exaggerated, but more than 600 civilians are likely to have died from the attacks. That number suggests that for every militant killed, 10 or so civilians also died.
    42. Sherazi, Zahir Shah (9 March 2011). "Most of those killed in drone attacks were terrorists: military". Dawn. Archived from the original on 23 December 2011. Retrieved 16 December 2011.
    43. Woods, Chris; Lamb, Christina (4 February 2012). "Obama terror drones: CIA tactics in Pakistan include targeting rescuers and funerals". Bureau of Investigative Journalism. Archived from the original on 7 February 2012. Retrieved 7 February 2012.
    44. Woods, Chris (11 August 2011). "Over 160 children reported among drone deaths". Bureau of Investigative Journalism. Archived from the original on 6 January 2012. Retrieved 27 December 2011.
    45. Woods, Chris (10 August 2011). "Drone War Exposed – the complete picture of CIA strikes in Pakistan". Bureau of Investigative Journalism. Archived from the original on 17 December 2011. Retrieved 16 December 2011.
    46. Elias-Sanborn, Barbara (2 February 2012). "The Pakistani Taliban's Coming Divide". Foreign Affairs. Archived from the original on 10 March 2012. Retrieved 13 March 2012.
    47. Bomb motive Archived 17 మే 2013 at the Wayback Machine, LA Times 8 May 2010.
    48. Ken Dilanian (2011-12-23). "CIA has suspended drone attacks in Pakistan, U.S. officials say". Los Angeles Times. Archived from the original on 17 June 2013. Retrieved 2013-06-09.
    49. "Pak forces take control of Shamsi airbase". IBNLive. 10 December 2011. Archived from the original on 8 January 2012. Retrieved 7 January 2012.
    50. "UN says US drones violate Pakistan's sovereignty". The Houston Chronicle. 15 March 2013. Archived from the original on 21 March 2013.
    51. Amnesty International. ""Will I be next?" US Drone Strikes in Pakistan" (PDF). Amnesty International Publications. Archived (PDF) from the original on 23 October 2013. Retrieved 22 October 2013.
    52. "McCain: Are You a "Wacko Bird" Like Rand Paul, Justin Amash, and Ted Cruz?". Reason.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-03-09. Retrieved 2020-02-06.
    53. Beauchamp, Zack (29 May 2014). "The drone war may be over in Pakistan". Vox. Archived from the original on 30 May 2014. Retrieved 29 May 2014.
    54. Dilanian, Ken (29 May 2014). "CIA Winds Down Drone Strike Program in Pakistan". AP. Archived from the original on 30 May 2014. Retrieved 29 May 2014.
    55. "Drone Strikes: Pakistan". New America. Archived from the original on 1 November 2017. Retrieved 10 December 2017.
    56. Serle, Jack. "Only 4% of drone victims in Pakistan named as al Qaeda members". The Bureau of Investigative Journalism. Archived from the original on 19 October 2014. Retrieved 20 October 2014.
    57. Woods, Chris "Leaked Pakistani report confirms high civilian death toll in CIA drone strikes Archived 28 జూలై 2013 at the Wayback Machine" Bureau of Investigative Journalism. 22 July 2013.
    58. [1] Archived 9 ఏప్రిల్ 2009 at the Wayback Machine Obama Widens Missile Strikes Inside Pakistan, The New York Times, 21 February 2009; same story at "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2 డిసెంబరు 2013. Retrieved 8 ఫిబ్రవరి 2021.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) "Obama widens Pak strikes – Attacks target Mehsud camps," The Telegraph of Calcutta, 22 February 2009
    59. U.S. Weighs Taliban Strike Into Pakistan Archived 27 ఏప్రిల్ 2017 at the Wayback Machine, The New York Times, 17 March 2009
    60. Khalil, Jehanzeb; Perveen, Saima (2014). "The United States Covert War in Pakistan: Drone Strikes an Infringement on National Sovereignty". Journal of Applied Environmental and Biological Sciences. 4 (8): 209–215.
    61. Ländler, Mark, "Civilian Deaths Due To Drones Are Not Many, Obama Says", The New York Times, 31 January 2012, page 6.
    62. Wilson, Scott; Cohen, Jon (8 February 2012). "Poll finds broad support for Obama's counterterrorism policies". Amnesty International. Archived from the original on 9 February 2012. Retrieved 8 February 2012.
    63. Savage, Charlie (30 April 2012). "Top U.S. Security Official Says 'Rigorous Standards' Are Used for Drone Strikes". The New York Times. Archived from the original on 1 May 2012. Retrieved 1 May 2012.
    64. "US: Transfer CIA Drone Strikes to Military". Human Rights Watch. 20 April 2012. Archived from the original on 5 May 2012. Retrieved 11 May 2012.
    65. Crilly, Bob (28 May 2012). "US steps up drone attacks in Pakistan after convoy talks fail". The Daily Telegraph. London. Archived from the original on 30 May 2012. Retrieved 28 May 2012.
    66. "Official Confirms U.S. Using Pakistan Base to Launch Attacks". Fox News Channel. 19 February 2009. Archived from the original on 21 February 2009. Retrieved 2 July 2009.
    67. Rashid, Ahmed (2012). Pakistan in the Brink. Allen Lane. p. 54. ISBN 9781846145858.
    68. The Unblinking Stare Archived 26 నవంబరు 2014 at the Wayback Machine The New Yorker, 24 November 2014.
    69. Savage, Charlie (30 April 2012). "Top U.S. Security Official Says 'Rigorous Standards' Are Used for Drone Strikes". The New York Times. Archived from the original on 1 May 2012. Retrieved 1 May 2012.
    70. Petraeus, in Pakistan, Hears Complaints About Missile Strikes Archived 11 ఫిబ్రవరి 2017 at the Wayback Machine, The New York Times, 4 November 2008
    71. A Quiet Deal With Pakistan Archived 7 నవంబరు 2017 at the Wayback Machine, The Washington Post, 4 October 2008
    72. "Pakistan threatens to retaliate against US". PressTV.ir. 8 September 2008. Archived from the original on 5 July 2013. Retrieved 10 July 2013.
    73. Agence France-Presse/Jiji Press, "Bin Laden was trying to rebuild drone-decimated terror network", Japan Times, 3 July 2011, page 1.
    74. Miller, Greg, "Bin Laden Files Show Al-Qaeda Under Pressure", The Washington Post, 2 July 2011, page 1.
    75. International Human Rights and Conflict Resolution Clinic, Stanford Law School; Global Justice Clinic, NYU School of Law (September 2012). "Living Under Drones: Death, Injury and Trauma to Civilians from US Drone Practices in Pakistan" (PDF). Archived from the original (PDF) on 30 October 2012. Retrieved 8 March 2014.
    76. https://www.newamerica.org/in-depth/americas-counterterrorism-wars/pakistan/.
    77. Shah, Aqil (2018). "Do U.S. Drone Strikes Cause Blowback? Evidence from Pakistan and Beyond". International Security (in ఇంగ్లీష్). 42 (4): 47–84. doi:10.1162/isec_a_00312. ISSN 0162-2889.
    78. Johnston, Patrick B.; Sarbahi, Anoop K. (2016-01-04). "The Impact of US Drone Strikes on Terrorism in Pakistan". International Studies Quarterly (in ఇంగ్లీష్). 60 (2): 203–219. doi:10.1093/isq/sqv004. ISSN 0020-8833.