పాకిస్తాన్ క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం
2010 ఆగస్టులో లండన్‌లోని లార్డ్స్‌లో ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన కుంభకోణమే పాకిస్తాన్ క్రికెట్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం. ఈ కుంభకోణంలో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టులోని ముగ్గురు సభ్యులు భాగంగా ఉన్నారు. వీరు, టెస్ట్ సమయంలో ముందుగా నిర్ణయించిన కొన్ని క్షణాలలో ఉద్దేశపూర్వకంగా నో బాల్‌లు వేయడానికి బుక్‌మేకర్ మజర్ మజీద్ నుండి లంచం తీసుకున్నందుకు దోషులుగా తేలింది.
పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్లు ఆసిఫ్, అమీర్‌లు ఉద్దేశపూర్వకంగా ఆట సమయంలో నిర్దిష్ట పాయింట్ల వద్ద నో-బాల్స్ వేస్తారని మజర్ మజీద్ విలేకరులకు తెలియజేయడాన్ని న్యూస్ ఆఫ్ ది వరల్డ్ పత్రికకు చెందిన రహస్య విలేఖరులు రహస్యంగా వీడియో తీశారు. ఈ సమాచారాన్ని జూదగాళ్లు అంతర్గత సమాచారంతో పందెం వేయడానికి ఉపయోగించవచ్చు (అదే స్పాట్ ఫిక్సింగ్).
ఈ ఆరోపణలకు ప్రతిస్పందనగా, స్కాట్లాండ్ యార్డ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై మజీద్‌ను అరెస్టు చేసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి), ముగ్గురు పాకిస్థాన్ ఆటగాళ్లు - జట్టు కెప్టెన్ సల్మాన్ బట్‌ను, ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ అమీర్ లను 5 నుండి 10 సంవత్సరాల కాలానికి నిషేధించింది. 2011 నవంబరులో, స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన క్రిమినల్ ఆరోపణలపై లండన్ కోర్టు బట్, ఆసిఫ్‌లను దోషులుగా నిర్ధారించింది. అమీర్, మజీద్ లను అదే ఆరోపణలపై నేరారోపణలను నమోదు చేశారు. నలుగురికీ ఆరు నెలల నుండి 32 నెలల వరకు జైలు శిక్ష విధించబడింది.
సందర్భం, చరిత్ర
[మార్చు]2010 మేలో, షాహిద్ అఫ్రిది ఆస్ట్రేలియాతో సిరీస్‌కు పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. [1] ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ ఓడిపోవడంతో, అఫ్రిది కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. [2] దీంతో బట్‌ను టెస్టు కెప్టెన్‌గా నియమించారు. [3]
2010 జూలైలో, స్పాట్ ఫిక్సింగు, మ్యాచ్ ఫిక్సింగు ఆరోపణలపై సమాచారం కోరుతూ ఇద్దరు పేరులేని ఆటగాళ్లకు ICC వారి యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ నోటీసులు అందజేసింది. 2010 లో నాటింగ్‌హామ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ తర్వాత ఆటగాళ్లకు ఈ నోటీసులు పంపబడ్డాయి. ACSU నిర్దిష్ట సమాచారాన్ని కోరుతున్నట్లు నోటీసుల ద్వారా ఆటగాళ్లకు తెలియజేసారు. వారు ప్రతిస్పందించడానికి 14 రోజుల సమయం ఇచ్చింది. [4]
స్టింగ్ ఆపరేషన్
[మార్చు]2010 ఆగస్టులో, న్యూస్ ఆఫ్ ది వరల్డ్ రిపోర్టర్లు మ్యాచ్ ఫిక్సింగ్‌లో ప్రమేయం ఉన్నట్లు అనుమానించబడిన స్పోర్ట్స్ ఏజెంట్ మజార్ మజీద్‌తో పరిచయాన్ని ఏర్పరచుకున్నారు. న్యూస్ ఆఫ్ ది వరల్డ్ పోస్ట్ చేసిన వీడియోలో, మజీద్, లంచం డబ్బును లెక్కిస్తూ, లార్డ్స్‌లో జరిగే నాల్గవ టెస్ట్‌లో అమీర్ మూడో ఓవర్ వేస్తాడనీ, ఆ ఓవర్‌లోని మొదటి బంతి నో-బాల్ డెలివరీ అవుతుందనీ చెప్పాడు. అమీర్ మూడవ ఓవర్ బౌల్ చేసాడు, ఆ ఓవరులో మొదటి బంతిని నో బాల్ గా వేశాడు. కామెంటేటరు ఆ డెలివరీని "పే..ద్ద నో-బాల్, అర మీటరు పైగా లైన్ను దాటాడు" అని అభివర్ణించారు. [5] పదో ఓవరులో ఆరో బంతి నో బాల్ అవుతుందని కూడా, మజీద్ జోస్యం చెప్పాడు - ఆసిఫ్ వేసిన ఆ బంతి కూడా నో బాల్ అయింది.[6]
కుంభకోణంలో చిక్కుకున్న కెప్టెన్ సల్మాన్ బట్ రాజీనామా చేయాలని కోరేందుకు పాకిస్థాన్ జట్టు మేనేజర్ యావర్ సయీద్ నిరాకరించాడు.[7] ఆటగాళ్లు అమాయకులని పీసీబీ ప్రెసిడెంట్ ఇజాజ్ బట్ సమర్థించాడు. అదే సమయంలో, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ స్పాట్ ఫిక్సింగ్ వివాదం, వాళ్ళను ఇరికించేందుకు పన్నిన ఉచ్చు అయి ఉండవచ్చని, లీకైన వీడియోలో కొన్ని అస్పష్టతలు ఉన్నాయనీ అన్నాడు.[8] పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు, క్రీడలపై స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ అయిన ఇక్బాల్ మొహమ్మద్ అలీ, ఆరోపణలు వచ్చిన ఆటగాళ్లను జట్టు నుండి తొలగించాలని పిలుపునిచ్చారు. [9]
వృత్తిపరమైన నిషేధాలు
[మార్చు]న్యూస్ ఆఫ్ ది వరల్డ్ ఇన్వెస్టిగేషన్‌లో సల్మాన్ బట్, మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ అమీర్ పేర్లు ఉన్నాయి. ముగ్గురు ఆటగాళ్ళు తమపై మోపబడిన అభియోగాలలో తమ నిర్దోషిత్వాన్ని చెప్పుకున్నారు. కానీ 2010 సెప్టెంబరు 4 న "సమాధానం చెప్పుకోవాల్సిన కేసు ఉందని" నిర్ధారించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విచారణ పెండింగ్‌లో ఉండగా వాళ్ళు ఆడకుండా సస్పెండ్ చేసింది.[10]
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని పాకిస్తానీ హైకమీషనర్ వాజిద్ షంసుల్ హసన్, ఆటగాళ్లపై "ఉచ్చు పన్నారని" వాళ్ళు నిర్దోషులనీ పేర్కొన్నారు. [11] ఐసీసీ నిర్ణయాన్ని అతను ఖండించాడు.[11] [12]
తదనంతరం బట్ తన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశాడు. [13] ఆసిఫ్, అమీర్ లు కూడా కోరారు. అక్టోబరు 30, 31 తేదీలలో ఖతార్‌లో విచారణ జరుగుతుందని ICC ప్రకటించింది. [14] ముగ్గురు క్రికెటర్లు ఖతార్ వెళ్లేందుకు వీలుగా వారి పాస్‌పోర్టులను తిరిగి ఇచ్చామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. [15] అప్పీల్ ప్రారంభమవడానికి ఏడు రోజుల ముందు మహ్మద్ ఆసిఫ్ తనపై వచ్చిన ఆరోపణలను అర్థం చేసుకోవాలనుకున్నందున తన అప్పీల్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాడు. [16] బట్, అమీర్‌లు తమ విజ్ఞప్తులు కొనసాగుతాయని ప్రకటించారు. ఐసీసీ, కేసు విచారణను యూఏఈకి తరలించింది. సల్మాన్ బట్, అప్పీళ్లు త్వరగా పూర్తవుతాయని, తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు వేగంగా తిరిగి వస్తానని, 2010 అక్టోబరులో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లో పాల్గొనగలననిఈ ఆశాభావం ప్రకటించాడు.[17] సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా వారి ప్రాథమిక అప్పీలును 2010 అక్టోబరు 31 న ఐసిసి తిరస్కరించింది. తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ, నిర్ణయానికి గల కారణాలను తమకు తెలియజేయలేదని బట్, అమీర్ ఐసిసిని విమర్శించారు. [18]
2011 జనవరిలో ఆటగాళ్ల భవితవ్యాన్ని నిర్ణయించడానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసారు.[19] ఈ ప్యానెల్‌లో మైఖేల్ బెలాఫ్, ఆల్బీ సాచ్స్, శరద్ రావు ఉన్నారు - వీరంతా క్రీడా విచారణల్లో అనుభవం ఉన్నవారు. బెలాఫ్ ఎంపికపై బట్, అమీర్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముగ్గురు క్రికెటర్ల విషయంలో, ICC క్రమశిక్షణా కమిటీకి అధిపతిగా అతనికి, ICCకి అనుకూలమైన వైఖరి ఉందని వాదించారు. అతను తమ సస్పెన్షన్‌లను ఎత్తివేయడానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు ఈ సంగతిని ఎత్తిచూపారు. బట్ తరపు న్యాయవాది అఫ్తాబ్ గుల్ తన క్లయింట్‌కు న్యాయం కలగదనే అనుమానంతో కేసు నుంచి వైదొలిగాడు. [20] ఈ కథనాన్ని న్యూస్ ఆఫ్ ది వరల్డ్ విచ్ఛిన్నం చేసినందున, దాని రిపోర్టర్లు ఈ కేసులో కనిపిస్తారని కూడా ICC తెలిపింది. [21] నిర్ణయం 2011 ఫిబ్రవరి 5 కు వాయిదా పడింది [22]
2011 ఫిబ్రవరి 5 న ICC మొత్తం ముగ్గురు ఆటగాళ్లను నిషేధించినట్లు ప్రకటించింది. బట్‌ను పదేళ్లపాటు నిషేధించగా ఆ తరువాత అందులోంచి ఐదేళ్ళను సస్పెండ్ చేసింది. ఆసిఫ్‌ను ఏడేళ్లు విధించి, అందులో రెండేళ్ళు సస్పెండ్ చేసింది. అమీర్‌ను ఐదు సంవత్సరాలు నిషేధించింది. [23] [24] బట్, ఆసిఫ్‌లకు శిక్షల సస్పెన్షన్ షరతులతో కూడుకుని ఉంది -"ఇకపై కోడ్‌ను ఉల్లంఘించకూడదనీ, అవినీతి నిరోధక విద్యా కార్యక్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో పాల్గొనాలి" అనే షరతులు విధించింది.[23] మొత్తం ముగ్గురు ఆటగాళ్లను, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో అప్పీల్ దాఖలు చేయడానికి అనుమతించారు. [23]
ఆ ప్రకటనకు ప్రతిస్పందనగా ది ఇండిపెండెంట్, "ఆట తన బాధ్యతలను ఎట్టకేలకు నిలబెట్టుకుంది" అని చెప్పింది.[25] అయితే ది గార్డియన్, "తాపులు చెయ్యకుండా ప్రతిచోటా ఆటగాళ్లకు తీవ్రమైన నిరోధకాలను కల్పించాల్సిన ఆవశ్యకత, శిక్షల అవసరం కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది." [26]
నేర విచారణ
[మార్చు]వార్తాపత్రిక నివేదిక ఫలితంగా, బుక్‌మేకర్‌లను మోసం చేయడానికి కుట్ర పన్నారనే అనుమానంతో మజీద్‌ను అరెస్టు చేసినట్లు స్కాట్లాండ్ యార్డ్ అదే రోజు ప్రకటించింది. [27] రెండు రోజుల తర్వాత, టెస్ట్ మ్యాచ్ పూర్తయిన తర్వాత, ఆరోపణలకు సంబంధించి మనీ లాండరింగ్ అనుమానంతో మరో ముగ్గురిని అరెస్టు చేశారు (ఇద్దరు గుర్తుతెలియని పురుషులు, ఒక గుర్తుతెలియని మహిళ). [28] విచారణలో భాగంగా ఆసిఫ్, అమీర్, సల్మాన్ బట్‌ల సెల్‌ఫోన్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్కాట్లాండ్ యార్డ్ 2010 సెప్టెంబరు 17 న, విచారణకు సంబంధించిన ప్రాథమిక ఫైల్‌ను, ఆటగాళ్లపై నేరారోపణ చెయ్యాలా వద్దా అని నిర్ణయించేందుకు, క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్‌కు పంపినట్లు ప్రకటించింది. [29] 2010 నవంబరు 5 న స్కాట్లాండ్ యార్డ్ తాము క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్‌కు ఫిక్సింగ్ సాక్ష్యపు రెండవ ఫైల్‌ను పంపినట్లు ప్రకటించింది. దీంతో ఈ కేసు కోర్టుకు వెళ్ళేందుకు మరో అడుగు ముందుకు పడింది. [30]
2011 నవంబరు 1 న, సౌత్‌వార్క్ క్రౌన్ కోర్ట్‌లో, మజీద్, ఆసిఫ్, అమీర్, బట్‌లు జూదంలో మోసం చేసేందుకు కుట్ర పన్నారని, అవినీతి చెల్లింపులను అంగీకరించడానికి కుట్ర పన్నారనీ నిర్ధారించారు. మజీద్, అమీర్ నేరాంగీకారాల తరువాత దోషులుగా నిర్ధారించబడ్డారు. [31] [32] కేవలం ఒకే ఒక్క సందర్భంలో స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్గొన్నట్లు అమీర్ చేసిన ఉపశమన అభ్యర్థనను న్యాయమూర్తి, జెరెమీ కుక్, సాక్ష్యంగా సమర్పించిన టెక్స్ట్ సందేశాలలోని విషయాలు వేరే విధంగా సూచిస్తున్నాయని చెబుతూ, ఆ అభ్యర్థనను తిరస్కరించాడు. [33]
నేరారోపణలు క్రికెట్ ప్రపంచంలో విస్తృతంగా ఆమోదం పొందాయి, సర్వత్రా స్వాగతించబడ్డాయి. పాక్ మాజీ కెప్టెన్ అమీర్ సోహైల్ పాక్ క్రికెట్‌కు "సిగ్గుమాలిన" రోజు అని చెప్పాడు. "అవినీతిపై పోరాడటానికి మీరు త్వరగా స్పందించనప్పుడు ఇదే జరుగుతుంది" అని అన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్ ఖలీద్ మెహమూద్ ఈ కేసును "భవిష్యత్తులో క్రికెట్‌కు ఉదాహరణ" అని అభివర్ణించాడు.[34]
2011 నవంబరు 3 న, బట్‌కు 2 సంవత్సరాల 6 నెలలు, ఆసిఫ్‌కు 1 సంవత్సరం, అమీర్‌కు 6 నెలలు, మజీద్‌కు 2 సంవత్సరాల 8 నెలల జైలు శిక్ష విధించబడింది.[35] [36] [37] [38]
ప్రతిచర్యలు
[మార్చు]విచారణలో ఉన్న 80కి పైగా మునుపటి మ్యాచ్‌ల జాబితాలో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా గెలిచిన ఒక మ్యాచ్‌ను కూడా చేర్చడంపై అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్‌ని పరిశీలించారు కానీ సాక్ష్యాధారాలు లేకపోవడంతో వెంటనే క్లియర్ చేసారు.[39] తొలి ఇన్నింగ్స్‌లో భారీ లోటు ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా ఆ మ్యాచ్‌లో విజయం సాధించింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Shahid Afridi to lead in Asia Cup and England tour". ESPN Cricinfo. Retrieved 17 April 2021.
- ↑ "Shahid Afridi announces giving up Pakistan Test captaincy". Hindustan Times. Retrieved 17 April 2021.
- ↑ "Salman Butt steps up as Pakistan captain after Shahid Afridi steps down". The Guardian. Retrieved 17 April 2021.
- ↑ "Two Pakistan players issued notices before scandal". CricInfo. ESPN. 7 September 2010. Retrieved 15 November 2010.
- ↑ England v Pakistan 2010 / Commentary. Espncricinfo.com. Retrieved on 2011-11-04.
- ↑ "Lord's Test at centre of fixing allegations". CricInfo. ESPN. 28 August 2010. Retrieved 29 August 2010.
- ↑ "Pakistan manager Saeed expects England tour to continue". BBC News. British Broadcasting Corporation. 29 August 2010. Retrieved 29 August 2010.
- ↑ "Part II: Who is the real chat in spot-fixing saga". 11 September 2010. Retrieved 13 September 2010.
- ↑ "Former ICC chief calls for Pakistan team ban". The Huffington Post. 3 August 2010. Retrieved 13 September 2009.
- ↑ "Pakistan suspend Butt, Amir and Asif's contracts". 4 September 2011. BBC Sport. Retrieved 1 November 2011.
- ↑ 11.0 11.1 Siddique, Haroon; Hopps, David; Gibson, Owen (2 September 2010). "Pakistan High Commissioner says players innocent". The Guardian. London. Retrieved 13 September 2010.
- ↑ "ICC's suspension of Pakistan players is 'wrong' – leading diplomat". The Guardian. London. 3 September 2010. Retrieved 13 September 2010.
- ↑ "Salman Butt appeals against ICC suspension". CricInfo. ESPN. 29 September 2010. Retrieved 15 November 2010.
- ↑ "Suspended Pakistan trio's appeals to be heard in Qatar". CricInfo. ESPN. 6 October 2010. Retrieved 15 November 2010.
- ↑ "Passports of cricketers Muhammad Asif, Muhammad Aamir, Salman Butt released". International News Network. Archived from the original on 28 September 2011. Retrieved 15 November 2010.
- ↑ "Asif withdraws appeal". UKPA. 22 October 2010.
- ↑ "Salman Butt keeping hopes alive of return". CricInfo. ESPN. 16 October 2010. Retrieved 15 November 2010.
- ↑ Hoult, Nick (1 November 2010). "Salman Butt and Mohammad Amir accuse ICC of 'conspiracy against Pakistan'". The Daily Telegraph. London. Retrieved 15 November 2010.
- ↑ Three man tribunal to decide Amir Butt and Asif fate. Espncricinfo.com. 12 November 2010. Retrieved on 2011-11-04.
- ↑ Aftab Gul withdraws from Butt's case. Espncricinfo.com. 13 November 2010. Retrieved on 2011-11-04.
- ↑ NOTW reporters to appear on the case. Espncricinfo.com. 16 November 2010. Retrieved on 2011-11-04.
- ↑ "Spot-fixing controversy: Tribunal defers spot-fixing verdict till February 5 | Pakistan Cricket News". ESPN Cricinfo. Retrieved 6 February 2011.
- ↑ 23.0 23.1 23.2 "ICC bans Salman Butt, Mohammad Asif & Mohammad Amir". BBC News. 5 February 2011. Retrieved 6 February 2011.
- ↑ "Pakistan trio banned by cricket's anti-corruption body". CNN website. 5 February 2011. Retrieved 1 November 2011.
- ↑ Brenkley, Stephen (6 February 2011). "ICC lay down the law in bid to fix the fixers". The Independent. London. Archived from the original on 24 May 2022. Retrieved 6 February 2011.
- ↑ Marks, Vic (5 February 2011). "ICC's sanctions on Pakistan trio necessary for sake of cricket". The Guardian. London. Retrieved 6 February 2011.
- ↑ "Arrest over Pakistan-England Test cricket 'betting scam'". BBC News. British Broadcasting Corporation. 29 August 2010. Retrieved 29 August 2010.
- ↑ "Three more arrests in fixing investigation". CricInfo. ESPN. 31 August 2010. Retrieved 15 November 2010.
- ↑ "Police say fixing evidence given to prosecutors". CricInfo. ESPN. 17 September 2010. Retrieved 15 November 2010.
- ↑ "Second file of evidence passed to CPS". CricInfo. ESPN. 5 November 2010. Retrieved 15 November 2010.
- ↑ "Pakistan cricketers guilty of betting sca". BBC News. 1 November 2011. Retrieved 1 November 2011.
- ↑ "Agent Mazhar Majeed pleaded guilty to his part in spot-fixing plot". The Guardian. 2 November 2011. Retrieved 2 November 2011.
- ↑ Scott, Matt (2 November 2011). "Judge rejects Mohammad Amir's plea that spot-fixing role was one-off". The Guardian. Retrieved 2 November 2011.
- ↑ Brenkley, Stephen (2 November 2011). "Dark day at Lord's does not mean fixing is rife". The Independent. Archived from the original on 24 May 2022. Retrieved 2 November 2011.
- ↑ "Pakistan cricketers and agent jailed for betting scam". BBC News. 3 November 2011. Retrieved 3 November 2011.
- ↑ "Pakistan spot-fixing players and agent sentenced to lengthy jail terms". The Guardian. UK. 3 November 2011. Retrieved 3 November 2011.
- ↑ "Pakistan spot-fixing scandal: convictions of Salman Butt, Mohammad Asif and Mohammad Amir just one step on a long road". The Daily Telegraph. UK. 3 November 2011. Retrieved 3 November 2011.
- ↑ "Cricketers jailed for match-fixing". The Independent. UK. 3 November 2011. Archived from the original on 24 May 2022. Retrieved 3 November 2011.
- ↑ "Fixing allegations could taint Sydney win – Ponting". CricInfo. ESPN. 30 August 2010. Retrieved 18 September 2010.