Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

పాలవాండ్లపల్లి

వికీపీడియా నుండి
పాలవాండ్లపల్లి గుడి

పాలవాండ్లపల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం గొడ్డువెలగల గ్రామపంచాయతీకి చెందిన శివారు గ్రామం[1][2]. ఈ గ్రామంలో మొత్తం 30 గృహాలు ఉన్నాయి. గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది.[3] గ్రామంలో నీటి సౌకర్యం నీటి ట్యాంకులు ద్వారా చేతి పంపులు ద్వారా లభిస్తుంది. గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో సమీప పట్టణమైన కదిరి ఉంది. రైతు భరోసా కేంద్రం ఒక కిలోమీటర్ దూరంలోని హరిజనవాడలో ఉంది. గ్రామ సచివాలయం రెండు కిలోమీటర్ల దూరంలోని గొడ్డు వెలగలలో ఉంది. బ్యాంక్ మార్కెట్ కదిరిలో ఉన్నాయి. గ్రామంలో మామిడి తోటలను ఎక్కువగా పెంచుతారు. గ్రామంలో వడ్లను ఎక్కువగా పండిస్తారు. జిల్లా కేంద్రమైన పుట్టపర్తి కి ఈ గ్రామం ఈ గ్రామం 67 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామ జనాభా 170. గ్రామంలో రవాణా సౌకర్యాలు ఉన్నాయి. గ్రామంలో సిసి రోడ్లు కంకర రోడ్లు ఉన్నాయి. ఈ గ్రామానికి చుట్టుపక్కల గొడ్డు వెలగల హరిజనవాడ నరసప్ప గారిపల్లి ఉన్నాయి. గ్రామంలో 60 ఏళ్లకు ఒకసారి దేవరెద్దు జాతర జరుగుతుంది.

మూలాలు

[మార్చు]
  1. "Pallavandlapalli Village". www.onefivenine.com. Retrieved 2023-04-23.
  2. inmap.in. "Pallavandlapalli Gandlapenta Anantapur Andhra Pradesh Information About All Villages Of India , Map Of Indian Villages inmap.in". inmap.in (in ఇంగ్లీష్). Retrieved 2023-04-23.
  3. "MPPS PALAVANDLAPALLI - Godduvelagala, District Anantapur (Andhra Pradesh)". schools.org.in (in ఇంగ్లీష్). Retrieved 2023-04-23.