పావులూరి శివరామకృష్ణయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పావులూరి శివరామకృష్ణయ్య
జననం1923 నవంబరు 15
తెనాలి సమీపంలోని గోవాడ
మరణం2021 మే 4
గుంటూరు
మరణ కారణంకరోనా
ఇతర పేర్లుశివయ్య మాస్టారు
వృత్తిహిందీ టీచర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్య్ర సమరయోధుడు
జీవిత భాగస్వామిమంగమ్మ
పిల్లలుఇద్దరు కుమారులు విజయకుమార్‌, కృష్ణకుమార్‌
ఒక కుమార్తె జయశ్రీ

పావులూరి శివరామకృష్ణయ్య (1923 నవంబరు 15 - 2021 మే 4) స్వాతంత్య్ర సమరయోధుడు. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2018లో విశ్వహిందీ సమ్మేళనంలో భాగంగా విశిష్ట సన్మానం ఆయన అందుకున్నారు.[1]

విద్య[మార్చు]

1923 నవంబరు 15న తెనాలి సమీపంలోని గోవాడలో పావులూరి శివరామకృష్ణయ్య జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్య అభ్యసించారు. ఉన్నతవిద్య తీరుమెళ్ల, మెట్రిక్యులేషన్‌ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. మద్రాసు యూనివర్సిటీ నుంచి హిందీ పట్టా పుచ్చుకున్న ఆయన ఆగ్రా యూనివర్సిటీ నుంచి హిందుస్థానీ, భారతీయ పారంగత్‌ పట్టా అందుకున్నారు.

వృత్తి, స్వాతంత్య్ర పోరాటం[మార్చు]

జిల్లా పరిషత్‌ హైస్కూలులో ప్రథమ శ్రేణి హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసి 1979లో రిటైరయ్యారు. 1933లో కావూరు వినయాశ్రమంలో గాంధీజీకి స్వాగతం పలికారు. ఆయన మహాత్మా గాంధీ ఆశయాలకు ప్రభావితుడయ్యారు. 1934లో వార్దాలోని సేవాగ్రామ్‌ చేరుకుని ఏడాది పాటు ఆయన గాంధీజీకి సేవలందించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని అలీపూర్‌ జైలులో కారాగార శిక్ష అనుభించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్‌ పట్టు పరిశ్రమ సలహాసంఘ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్‌ స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, కావూరు వినయాశ్రమం ధర్మకర్తల మండలి సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన వద్ద కొణిజేటి రోశయ్య, కోడెల శివ ప్రసాద్ విద్యనభ్యసించారు.

మరణం[మార్చు]

98 ఏళ్ల పావులూరి శివరామకృష్ణయ్య గుంటూరులోని ఓ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ 2021 మే 4న తుదిశ్వాస విడిచారు.[2] ఆయనకు భార్య మంగమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. "స్వాతంత్య్ర సమరయోధుడు.. పావులూరి ఇకలేరు - Andhrajyothy". web.archive.org. 2022-12-04. Archived from the original on 2022-12-04. Retrieved 2022-12-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Freedom fighter Pavuluri Sivaramakrishnaiah passes away - Sakshi". web.archive.org. 2022-12-04. Archived from the original on 2022-12-04. Retrieved 2022-12-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)