పిన్నమనేని వెంకటేశ్వరరావు (వైద్యుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పిన్నమనేని వెంకటేశ్వరరావు విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యులు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ సమీపంలో గాల నెప్పల్లి గ్రామంలో డిసెంబరు 16 1910 న జన్మించారు. వారిది విజయవాడలో ప్రముఖమైన కుటుంబం. ఆయన సర్జరీలో ప్రముఖ పేరుప్రఖ్యాతులు పొందారు. ఆయన సర్జరీ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు. ఆయన విశాఖపట్నం లోని ఆంధ్రా వైద్య కళాశాలలో కొంతకాలం పాటు బోధకునిగా ఉన్నారు.

ప్రభుత్వ సేవలో పనిచేసిన తరువాత 1950 లో రాఈనామా చేసి విజయవాడలో ప్రైవేటు ప్రాక్టీసు ప్రారంభించారు. కొద్ది కాలంలోనే ప్రసిద్ధ సర్జనుగా ఖ్యాతి పొందారు. ఆయన సమర్థవంతమైన శస్త్రచికిత్స వైద్యుడు మాత్రమే కాదు, అధిక విలువలు, సమగ్రత మరియు నిజాయితీ గల ఒక వైద్యుడు. ఆయన రోగులకు స్నేహితునిగా మరియు తాత్వికునిగా వ్యవహరించేవారు.

ఆయన యు.ఎస్.ఎ మరియు యు.కె లలో 1970, 1977 మరియు 1981 లలో ప్రముఖ సర్జరీ క్లినిక్ లను సందర్శించారు. వైద్య విధానంలో నూతన పోకడలు తెలుసుకున్నారు. ఆయనకు క్రికెట్ అనగా ఎంతో యిష్టం.

ఆయన భార్య సీతాదేవి ఆయనకు వివిధ విషయాలలో సహకారం అందిస్తుండేవారు. [1]

సిద్ధార్థ అకాడమీ[మార్చు]

విజయవాడలో విద్యారంగం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది సిద్ధార్థ అకాడమీనే. 1975లో పెద్దలు కీ.శే. డాక్టర్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు, ప్రముఖ ఆడిటర్లు ముమ్మనేని సుబ్బారావు తదితర విద్యాభిమానులతో సిద్ధార్థ అకాడమీ ఆఫ్‌ జనరల్‌ అండ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో సంస్థలను నెలకొల్పారు. స్కూల్‌ దగ్గర నుంచి పీజీ ఇంజనీరింగ్‌, ఎంబీఏ వరకు అన్ని కోర్సులతో దాదాపు 20 విద్యాసంస్థలను నెలకొల్పిన ఘనత దీనికి దక్కుతుంది.[2][3]

పిన్నమనేని పురస్కారాలు[మార్చు]

ఆయన సోదరుడు పిన్నమనేని నరసింహారావు ఇ.ఎన్.టి వైద్య పరిశోధకుడు.[4] ఆయన పేరుతో అంతర్జాతీయ మెడికల్ సైన్సెస్ అకాడమీ వారు అంతర్జాతీయ పురస్కారాన్ని ఏర్పాటు చేసారు. ఇది "డా.పిన్నమనేని నరసింహారావు అంతర్జాతీయ అవార్డు" పేరుతో అందజేయబడుతుంది.[5]

పిన్నమనేని వెంకటేశ్వరరావు మరియు ఆయన కుటుంబ సభ్యులు "డాక్టర్ పిన్నమనేని అండ్ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్" 1989, డిసెంబరులో ఏర్పాటు చేసారు.[6] 1989 నుంచి దాదాపు ప్రతి ఏడాది దేశ ప్రముఖులకు పురస్కార ప్రదానం చేస్తున్నారు.

డాక్టర్ పిన్నమనేని అండ్ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ పురస్కార గ్రహీతలు[7][మార్చు]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]