శ్రీభాష్యం అప్పలాచార్యులు
మహామహోపాధ్యాయ శ్రీభాష్యం అప్పలాచార్యులు (1922 ఏప్రిల్ 6 - 2003 జూన్ 7) వక్త, సాహితీ వ్యాఖ్యాత. ఈయన 1922 ఏప్రిల్ 6, శ్రీరామనవమి పుణ్యదినాన విశాఖపట్నం జిల్లా పద్మనాభం గ్రామంలో జన్మించారు.
శీర్షిక పాఠ్యం
[మార్చు]. ఈయన విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యాప్రవీణ, భాషాప్రవీణ చేశారు. తరువాత కాశీ విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో ఎమ్.ఎ. పట్టా పొందారు.
ఈయన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో తెలుగు పండితుడుగా, చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో సంస్కృత ఉపన్యాసకుడుగా పనిచేశారు. అభిజ్ఞాన శాకుంతలం, మేఘసందేశం వంటి కాళిదాసు మహాకావ్యాలపై యాభై వరకు ఉపన్యాసాలందించారు. ఉపనిషత్తులు, రామాయణం, తిరుప్పావై, భగవద్గీత, ద్రవిడ ప్రబంధాలపై ఉపన్యాసాలు చేసారు.
ప్రవచన శిరోమణిగా పేరెన్నికగన్న ఆచార్యులు ధనుర్మాసం లో ఆకాశవాణిలో అనుదినం ప్రవచనం చేసేవారు.
శ్రీభాష్యం అప్పలాచార్య గారు అందుకున్న పురస్కారాలు
[మార్చు]- డాక్టర్ పిన్నమనేని అండ్ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ (1990)
- రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు (1992)
- అంబికా లిటరరీ అవార్డు (1994)
- జగద్గురు పీఠ పురస్కారం (1998)
- గోపాలోపాయనం అవార్డు (1999)
- తెలుగుతల్లి అవార్డు (2000)
- ఆచార్యులు ప్రవచనములు ఈ క్రింది అంతర్జాల చిరునామా నుండి వినగలరు.
https://web.archive.org/web/20110529081542/http://www.pravachanam.com/bhagavathgeetha/