పిన్ పర్బతి కనుమ
(పిన్ పర్బతి పాస్ నుండి దారిమార్పు చెందింది)
పిన్ పర్బతి కనుమ (పిన్ పార్వతి కనుమ అని కూడా అంటారు), హిమాచల్ ప్రదేశ్‌లో 5,319 మీ. (17,451 అ.) ఎత్తున ఉన్న ఒక కనుమ మార్గం.[1] స్పితి లోయకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తూ సర్ లూయిస్ డేన్ దీనిని 1884 ఆగస్టులో మొదటిసారి దాటినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. అయితే స్పితి లోని గొర్రెల కాపరులకు పచ్చని పార్వతి లోయలో తమ గొర్రెలను మేపడం కోసం తరచూ ఈ కనుమను దాటడం మామూలే.[2][3] ఈ కనుమ కులు వైపు ఉన్న సారవంతమైన, పచ్చని పార్బతి లోయను స్పితి వైపు ఉన్న బంజరు భూమి పిన్ లోయతో కలుపుతుంది.[4]
ఇది నేడు ప్రసిద్ధ ట్రెక్కింగ్ మార్గం. ఈ ట్రెక్ మార్గం స్పితి వైపు మడ్ గ్రామం నుండి ప్రారంభమవుతుంది. [5] 2013 లో ఒక సైనిక బృందం 155 కి.మీ మార్గంలో వెళ్ళేందుకు ప్రయత్నించింది.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "The Tribune, Chandigarh, India - Bathinda Edition". Tribuneindia.com. Retrieved 2018-06-11.
- ↑ "CROSS-ROADS IN SPITI Exploring Western Spiti Valleys : Himalayan Journal vol.50/16". www.himalayanclub.org. Retrieved 2018-06-10.
- ↑ "Pin Parvati Pass Trek". Himalayanchallenges.com. Archived from the original on 2018-06-12. Retrieved 2018-06-11.
- ↑ "Spiti beckons". Frontline (in ఇంగ్లీష్). Retrieved 2018-06-10.
- ↑ Kapadia, Harish (2001). Trekking and Climbing in the Indian Himalaya. Mechanicsburg, Pennsylvania: Stackpole Books. pp. 127-130. ISBN 0811729532.