అక్షాంశ రేఖాంశాలు: 33°00′22″N 76°14′24″E / 33.006°N 76.240°E / 33.006; 76.240

సాచ్ కనుమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

 

సాచ్ కనుమ
సాచ్ కనుమ is located in Himachal Pradesh
సాచ్ కనుమ
Coordinates33°00′22″N 76°14′24″E / 33.006°N 76.240°E / 33.006; 76.240

సాచ్ కనుమ హిమాలయాల్లోని పీర్ పంజాల్ శ్రేణిలో, హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో, సముద్ర మట్టం నుండి 4,414 మీటర్ల ఎత్తున ఉన్న కనుమ.[1] ఇది జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 127 కి.మీ. (79 మై.) దూరంలో ఉంది. ఇది చంబా లోయను హిమాచల్ ప్రదేశ్‌లోని పాంగి లోయతో కలుపుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని బైరాఘర్ నుండి సాచ్ కనుమ వైపు ఎక్కేటప్పుడు హెలిప్యాడ్ ఉంది.

అవలోకనం

[మార్చు]

జూన్ లేదా జూలై ప్రారంభం నుండి [2] అక్టోబరు మధ్య వరకు ఈ కనుమ తెరిచి ఉంటుంది. రహదారి ఇరుగ్గా ఉంటుంది. ఇది తారు రోడ్డు కాదు. పాంగి లోయకు ప్రవేశ ద్వారం. ఇది చంబా - కిల్లార్ ల మధ్య అతి తక్కువ దూరముండే దారి (170 కి.మీ) కష్టతరమైన మార్గం కూడా. పద్దర్ లోయ (జమ్మూ కాశ్మీరు) నుండి పాంగికి వెళ్ళే దారి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది గానీ, ఇది ఎక్కువ దూరం ఉంటుంది.

చరిత్ర

[మార్చు]

1998 చంబాలో జరిగిన ఊచకోత శత్రుండి, కలాబన్‌లలో కూడా జరిగింది. అందులో 35 మంది హిందువులు, కొంతమంది బౌద్ధులను - వీరిలో ఎక్కువ మంది కార్మికులు - ఉగ్రవాదులు కాల్చి చంపారు. మరో 11 మందిని గాయపరచారు. మరణించిన వారిలో చాలామంది సాచ్ కనుమ రోడ్డు నిర్మాణంలో పని చేస్తున్నారు. అప్పట్లో భద్రత తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం యావత్తూ నిఘాలో ఉంది. ఇప్పుడు ట్రెక్కర్లు, పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్నారు.

ప్రాముఖ్యత

[మార్చు]

ఇది కిల్లార్‌కి అతి దగ్గరి దారి. ఈ రహదారి (సాచ్ కనుమ) పూర్తయ్యాక పఠాన్‌కోట్ నుండి సాచ్ కనుమ మీదుగా లేహ్‌కు దూరం 670 కి.మీ.. కి తగ్గింది. పఠాన్‌కోట్ నుండి మనాలి మీదుగా లేహ్‌కు దూరం 800 కి.మీ. (497 మై.). ఈ రహదారిని భారత సైన్యం ఉపయోగించుకోవచ్చు.

దూరాలు

[మార్చు]

పఠాన్‌కోట్-డల్హౌసీ రహదారి, మనాలి-ఉదయ్‌పూర్ రహదారి, ఉధంపూర్/అనంతనాగ్-కిష్త్వార్- పద్దర్ - పాంగి రహదారుల గుండా సాచ్ కనుమ‌ను మూడు దిశల నుండి చేరుకోవచ్చు. మొదటిది అతి దగ్గరి దారి, ప్రమాదకరమైనది అత్యంత ప్రజాదరణ పొందిన మార్గం. దీనితో పోలిస్తే ఇతర దారుల దూరాలు ఎక్కువ.

మూడు మార్గాలలో కొన్ని ప్రధాన ప్రదేశాల నుండి సాచ్ కనుమ దూరం క్రింది విధంగా ఉంది.

స్థలం దూరం (కిమీ) వ్యాఖ్యలు
చంబా 131
పఠాన్‌కోట్ 250 దీనికి రైలు మార్గం ఉంది.
డల్హౌసీ గల్లే
ఉధంపూర్ 300 దీనికి రైలు మార్గం ఉంది.
కిష్త్వార్ 150
అనంతనాగ్ 300
ఉదయపూర్ 110

గ్యాలరీ

[మార్చు]

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Himachal Tourism"". Himachal Tourism. Accessed 6 December 2019.
  2. Report of pass opening 11 July in 2012
"https://te.wikipedia.org/w/index.php?title=సాచ్_కనుమ&oldid=4307196" నుండి వెలికితీశారు