Jump to content

బోరాసు కనుమ

అక్షాంశ రేఖాంశాలు: 31°14′00″N 78°29′00″E / 31.23333°N 78.48333°E / 31.23333; 78.48333
వికీపీడియా నుండి
బోరాసు కనుమ
బోరాసు కనుమ ముందువైపు
సముద్ర మట్టం
నుండి ఎత్తు
5,450 m (17,881 ft)[1]
ప్రదేశంహరి కా డూన్, ఉత్తరాఖండ్
శ్రేణిపశ్చిమ హిమాలయ-గఢ్వాల్ హిమాలయ శ్రేణి
Coordinates31°14′00″N 78°29′00″E / 31.23333°N 78.48333°E / 31.23333; 78.48333
పటం
లామ్‌జూంగా నుండి దృశ్యం
రాథాడో క్యాంప్‌సైట్ నుండి బోరాసు కనుమ

బోరాసు కనుమ లేదా బరా-సు (ఎల్. 5,450 మీ. or 17,880 అ. ) [1] ఉత్తరాఖండ్ హిమాలయ పర్వతాలలో ఎత్తైన పర్వత మార్గం. ఈ కనుమ టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ల సరిహద్దులో ఉంది. ఇది హర్ కీ డూన్ లోయ, కిన్నౌర్ లోయల మధ్య పురాతన వాణిజ్య మార్గం.

భౌగోళికం

[మార్చు]

బోరాసు కనుమ ఉత్తరాఖండ్‌ని హిమాచల్ ప్రదేశ్ నుండి విభజిస్తుంది. ఈ కనుమ టిబెట్ సరిహద్దు నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. బోరాసు ప్రాంతం తూర్పు భాగం టోన్స్ లోయ నుండి బయటకు వచ్చి, వాయవ్యాన బస్పా లోయతో కలుస్తుంది. దీని వాయవ్య శ్రేణి జుకియా హిమానీనదం నుండి కిందికి వస్తుంది. సమీప గ్రామమైన చిట్కుల్, కనుమ నుండి హిమాచల్ ప్రదేశ్ (కిన్నౌర్ లోయ) వైపు 20.3 కి.మీ. (12.6 మై.) దూరాన ఉంది.[2] ఉత్తరాఖండ్ వైపు సమీప గ్రామం, ఓస్లా.

కనుమకు చేరుకునే దారి పచ్చికభూములతో నిండి ఉంటుంది. కనుమ నుండి బందర్‌పంచ్, కాలానగ్, స్వర్గారోహిణి, హర్ కీ డూన్ పర్వతాలు కనిపిస్తాయి.

వాతావరణం

[మార్చు]

వేసవిలో, ఉష్ణోగ్రతలు 0 °C (32 °F) నుండి ఇంకా దిగువకు వెళ్తాయి. నవంబరు తర్వాత, ఉష్ణోగ్రతలు 0 °C (32 °F) నుండి అనేక డిగ్రీలు తక్కువకు వెళ్తాయి. బస్పా లోయలో వర్షపాతం తక్కువ స్థాయిలో ఉంది. తులనాత్మకంగా టోన్స్ లోయలో వర్షం మరింత తరచుగా పడుతుంది. సాధారణంగా, అక్టోబరు తర్వాత మంచు కురుస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Borasu Pass (5450 m)".
  2. "Traveling Luck for Borasu Pass".