Jump to content

పిరాట్లంక

అక్షాంశ రేఖాంశాలు: 15°54′58″N 80°53′12″E / 15.916121°N 80.886757°E / 15.916121; 80.886757
వికీపీడియా నుండి
పిరాట్లంక
—  రెవెన్యూయేతర గ్రామం  —
పిరాట్లంక is located in Andhra Pradesh
పిరాట్లంక
పిరాట్లంక
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°54′58″N 80°53′12″E / 15.916121°N 80.886757°E / 15.916121; 80.886757
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం రేపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి పెట్లపల్లి పద్మ
పిన్ కోడ్ 522264
ఎస్.టి.డి కోడ్ 08648

పిరాట్లంక, బాపట్ల జిల్లా, రేపల్లె మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. పిన్ కోడ్ నం. 522 264., ఎస్.ట్.డి.కోడ్ = 08648.

ఈ ఊరిలో కృష్ణా నది ప్రవహిస్తుంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]
  • ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న ఎన్.నవ్య అను విద్యార్థిని, అండర్17 విభాగంలో, జిల్లా బాలికల వాలీబాల్ జట్టుకి ఎంపికైనది. ఈమె 2014, సెప్టెంబరు-22 నుండి 24 వరకు, పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి జట్టులో పాల్గొంటుంది.
  • ఇటీవల తూములూరులో నిర్వహించిన వాలీబాల్ పోటీలలో, ఈ పాఠశాలలో చదువుచున్న లోకేశ్వరి అను విద్యార్థిని అండర్-14 విభాగంలోనూ, మానస అను విద్యార్థి అండర్-17 విభాగంలోనూ తమ ప్రతిభ ప్రదర్శించి, జిల్లా జట్లకు ఎంపికైనారు. త్వరలో నిర్వహించు రాష్ట్రస్థాయి పోటీలలో వారు పాల్గొంటారు.
  • ఈ పాఠశాలకు దాతల ఆర్థిక సహకారంతో పలు సౌకర్యాలు సమకూరుచున్నవి. దాతలు ఇచ్చిన విరాళలను బ్యాంకులో డిపాజిట్టు చేసి ఆ వచ్చే వడ్డీతో, ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయుచున్నారు. పాఠశాలలో డ్యుయల్ డస్క్ బెంచీలు ఏర్పాటుచేసారు. పాఠశాలకు ముఖమండపం అమర్చారు. ఉపాధ్యాయులకు మరుగుదొడ్ల సౌకర్యం, విద్యార్థుల సైకిళ్లు భద్రపరచుకొనుటకు ఒక షెడ్డు సమకూరినవి. దాతలు అందించుచున్న సౌకర్యాలతో విద్యార్థులు చదువులోనూ, క్రీడలలోనూ గూడా రాణించుచున్నారు.
  • 2016, నవంబరు-17,18,19వ తేదీలలో కృష్ణా జిల్లాలోని కానూరు (విజయవాడ దగ్గర) లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పాఠశాలల వాలీబాల్ క్రీడాపోటీలలో, ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న యార్లగడ్డ లోకేశ్వరి అను విద్యార్థిని, గుంటూరు జిల్లాజట్టులో కెప్టెనుగా పాల్గొని జట్టు ప్రథస్థానంలో నిల్చుటకు తన ప్రతిభ ప్రదర్శించి, జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాపోటీలలో అండర్-14 విభాగంలో పాల్గొనడానికి అర్హత సాధించింది. ఈ విద్యార్థిని, 2016, డిసెంబరు- 5 నుండి 10వతేదీ వరకు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి పాఠశాలల వాలీబాల్పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టులో పాల్గొంటుంది.

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల

[మార్చు]

ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిగా పనిచేయుచున్న శ్రీమతి పావనకుమారి, 2016, సెప్టెంబరు-5వ తేదీనాడు, గుంటూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా పురస్కారం అందుకున్నారు.

మౌలిక సదుపాయాలు

[మార్చు]

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో పెట్లపల్లి పద్మ, సర్పంచిగా ఎన్నికైనారు.