పి.వి.రమణయ్య రాజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పి.వి.రమణయ్య రాజా అనేకమంది కవులకూ, కళాకారులకూ సహాయాన్నందిస్తున్న శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన విశాఖపట్టణం జిల్లా లోని భీమిలి సమీపంలోని పాండ్రంగి గ్రామంలో 1927లో జన్మించాడు. ఆయన విజయనగరంలో చదువుకున్నాడు. ఆ రోజుల్లో ఆదిభట్ల, ద్వారం, దాలిపర్తి, చొప్పల్లి వంటి కళాకారుల ప్రభావంతో కళాభిమానం పెంచుకున్నాడు. వ్యాపారం నిమిత్తం 1968లో మద్రాసుకు మకాం మార్చాడు.ఆయనకు వ్యాపారాభివృద్ధితో పాటు కళా, సాహిత్య రంగాలపై మమకారం కూడా పెరిగింది. ఆనాటి నుండి సాహిత్య సాంస్కృతిక రంగాల చరిత్రలో ఆయన పేరు పెనవేసుకుపోయింది. కవులకీ, కళాకారులకీ ముఖ్యంగా సాహితీవేత్తలకీ రాజా చేసిన సత్కారాలు, వారి పై చూపిన ఆదరణ చూస్తే ప్రాచీనకాలం నాటి కవుల వైభవాన్ని పునరుద్ధరించడానికి ఆయన పుట్టారనిపిస్తుంది. శ్రీనాధుని కావ్యాలు అంకితం పుచ్చుకున్న ఆవచి తిప్పయ్య వంటివారు గుర్తుకు వస్తారు. 1979లో శ్రీ రాజా-లక్ష్మీ అవార్డు ప్రారంభించడానికి ముందే చెన్నైలో సాహిత్యోత్సవాలూ, పుస్తకాల అంకితోత్సవాలూ కవి పండితుల షష్టి పూర్తి ఉత్సవాలు జరిపిస్తూ ఆధునికయుగంలో కూడా సాహిత్య కళారంగాలకు పూర్వ వైభవం కల్పించిన సంస్కృతీ ప్రియుడాయన.[1]

శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్

[మార్చు]
రమణయ్య రాజా

రాజా చాలా కాలంగా సాహిత్యం, విద్య, వైద్య, జర్నలిజం తదితర రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు రాజా లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏటా అవార్డులను ప్రదానం చేస్తున్నారు. 1979 సంవత్సరం నుంచి ఆయన ఈ అవార్డులు ఇస్తూ వస్తున్నారు. 1979లో రాజా జన్మదినం నాడు ‘శ్రీశ్రీ’కి తమ తొలి అవార్డు ప్రదానం చేశారు. పదివేలతో ప్రారంభమైన ఈ పురస్కారం తర్వాత లక్ష రూపాయలకు పెరిగింది. ఆ తర్వాత ఏటేటా ఈ అవార్డులు స్వీకరించిన వారిలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వెంపటి చిన సత్యం, నేరెళ్ళ వేణుమాధవ్‌, బాపు, వై.నాయుడమ్మ, టంగుటూరి సూర్యకుమారి, మాండలిన్‌ శ్రీనివాస్‌, జి.కె. రెడ్డి, బి. రామ్మూర్తి, సి. నారాయణ రెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, లతా మంగేష్కర్‌, నటరాజ రామకృష్ణ, ద్వారం ట్రస్టు, పాలగుమ్మి సాయినాధ్‌, ప్రొఫెసర్‌ జి రామిరెడ్డి, డాక్టర్‌ అంబటి బాలమురళి, అబిద్‌ హుస్సేన్‌, ఎ. చెన్నగంటమ్మ, కృష్ణారావు, డాక్టర్‌ భానుమతీ రామకృష్ణ, ఎ.ఎస్.రామన్‌, ఎస్‌.వి.రామారావు, సద్గురు కందుకూరి శివానందమూర్తి వంటి వారు ఉన్నారు.

మరణం

[మార్చు]

ఆయన గత కొంత కాలం కిందట అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆగష్టు 26 2015 న కన్నుమూశారు[2].

చిత్రమాలిక

[మార్చు]

శ్రీ రాజా లక్ష్మీ పౌండేషన్ లో అవార్డు గ్రహీతల చిత్రాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "తెలుగు నోబెల్ రమణయ్య రాజా". Archived from the original on 2016-03-07. Retrieved 2015-08-29.
  2. రాజ్యలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రాజా కన్నుమూత[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]