పైలా ప్రసాదరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పైలా ప్రసాదరావు

పైలా ప్రసాదరావు పారిశ్రామికవేత్త, సంఘసేవకులు, తెలుగుదేశం పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. అమెరికాలో సాజిక్స్ సాఫ్ట్ వేర్ సంస్థ స్థాపించారు. విశాఖ జిల్లాలో వివిఫై గ్రూపు కంపెనీలకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారిగా బాధ్యతలు వహిస్తున్నారు. 2017లో టీవీ 5 తెలుగు టీవీ చానల్ బిజినెస్ లీడర్ అవార్డుకు ఎంపికయ్యారు.

జీవిత విశేషాలు[మార్చు]

విశాఖపట్నం జిల్లా మాడుగుల తెలుగుదేశం నాయకులు, ఏపీ జన్మభూమి సమన్వయకర్త, పైలా ఫౌండేషన్ ఛైర్మెన్ పైలా ప్రసాదరావు బిజినెస్ లీడర్ అవార్డు – 2017ను మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగరరావు చేతులమీద డిసెంబర్ 2017లో అందుకున్నారు. టీవీ 5 తెలుగు ఛానల్, వివిధ వాణిజ్య సంస్థలు సంయుక్తంగా వాణిజ్య, సేవారంగాల్లో 2017లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వాణిజ్య వేత్తలను బిజినెస్ లీడర్ అవార్డుకు ఎంపిక చేసింది.

పారిశ్రామికవేత్త[మార్చు]

సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా అమెరికాలో వివిధ కంపెనీల్లో పనిచేసిన పైలా ప్రసాదరావు కాలిఫోర్నియా కేంద్రంగా 2006లో సాజిక్స్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ కంపెనీ స్థాపించారు. దానికి అనుబంధంగా విశాఖపట్నంలో సాజిక్స్ సాఫ్ట్ వేర్ కంపెనీ స్థాపించారు. వివిఫై ఆగ్రో, వివిఫై నిర్మాణ, వివిఫై హెల్త్ కేర్ రంగాల్లో వివిఫై గ్రూపు కంపెనీలను స్థాపించి ముఖ్య కార్యనిర్వహణాదికారి ( సిఇఓ ) గా వ్యవహరిస్తున్న పైలా ప్రసాదరావు ఏపీ జన్మభూమి సమన్వయకర్త గా, పైలా ఫౌండేషన్ ద్వారా వివిధ సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పైలా ప్రసాదరావు మాడుగుల నియోజకవర్గంలో 45 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ఆర్థిక సాయం అందించారు.తన కంపెనీల ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పన, రైతు, మహిళా సాధికారతకు శిక్షణ వంటి కార్యక్రమాలు అమలుచేస్తున్నారు.

టీవీ 5 బిజినెస్ లీడర్ అవార్డు[మార్చు]

టీవీ 5 బిజినెస్ లీడర్ అవార్డును మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగరరావు ద్వారా అందుకున్న పైలా ప్రసాదరావు

వాణిజ్య, సేవారంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న పైలాకు బిజినెస్ లీడర్ అవార్డుకు జ్యురీ ఎంపిక చేసింది. డిసెంబర్ 23న హైదరాబాద్ హైటెక్ సిటీలో రాష్ట్ర శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు, తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగరరావు చేతుల మీద అవార్డును పైలా ప్రసాదరావు అందుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రవాసాంధ్రుల ప్రత్యేక ప్రతినిధులు రవి వేమూరి, కోమటి జయరాం అవార్డు అందుకున్న పైలాను అభినందించారు.

బాహ్య లింకులు[మార్చు]