Jump to content

పోరోంపాట్

అక్షాంశ రేఖాంశాలు: 24°48′45″N 93°57′35″E / 24.812546°N 93.959621°E / 24.812546; 93.959621
వికీపీడియా నుండి
పోరోంపాట్
నగరం
పోరోంపాట్ is located in Manipur
పోరోంపాట్
పోరోంపాట్
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
పోరోంపాట్ is located in India
పోరోంపాట్
పోరోంపాట్
పోరోంపాట్ (India)
Coordinates: 24°48′45″N 93°57′35″E / 24.812546°N 93.959621°E / 24.812546; 93.959621
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
జిల్లాఇంఫాల్ తూర్పు
జనాభా
 (2011)
 • Total6,191
భాషలు
 • భాషలుమీటీ (మణిపూర్)
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationఎంఎన్

పోరోంపాట్, మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ తూర్పు జిల్లా ముఖ్య నగరం.[1]

భౌగోళికం

[మార్చు]

ఈ నగరం 24°48′45″N 93°57′35″E / 24.812546°N 93.959621°E / 24.812546; 93.959621 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.

జనాభా

[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, పోరోంపాట్ నగరంలో 5,163 జనాభా ఉంది. ఈ జనాభాలో 49% మంది పురుషులు, 51% మంది స్త్రీలు ఉన్నారు. నగర సగటు అక్షరాస్యత రేటు 71% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 80% కాగా, స్త్రీల అక్షరాస్యత 61% గా ఉంది. మొత్తం జనాభాలో 12% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

2011లో 6,191 జనాభా ఉంది. ఇందులో 2,975 మంది పురుషులు, 3,216 మంది స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో 767 (12.39%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. నగర అక్షరాస్యత రేటు 88.81% కాగా, రాష్ట్ర సగటు 76.94% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 95.07% కాగా, స్త్రీ అక్షరాస్యత రేటు 83.07% గా ఉంది.[2]

ఈ నగరంలో హిందువులు 67.40% మంది, ముస్లింలు 19.74% మంది, క్రైస్తవులు 0.52% మంది, జైనులు 0.02% మంది, ఇతరులు 12.32% మంది ఉన్నారు.

పరిపాలన

[మార్చు]

పోరోంపాట్ నగరంలో 1,232 గృహాలు ఉన్నాయి. నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తోంది. నగరంలో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా కమిటీకి అధికారం ఉంది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Porompat (CT)". 2011 Census of India. Government of India. Archived from the original on 6 September 2017. Retrieved 7 January 2021.
  2. 2.0 2.1 "Porompat Census Town City Population Census 2011-2021 | Manipur". www.census2011.co.in. Retrieved 7 January 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]