అక్షాంశ రేఖాంశాలు: 25°8′56″N 93°58′14″E / 25.14889°N 93.97056°E / 25.14889; 93.97056

కాంగ్‌పోక్‌పి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాంగ్‌పోక్‌పి
కాంగ్‌పోక్‌పి
పట్టణం
కాంగ్‌పోక్‌పి is located in Manipur
కాంగ్‌పోక్‌పి
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
కాంగ్‌పోక్‌పి is located in India
కాంగ్‌పోక్‌పి
కాంగ్‌పోక్‌పి (India)
Coordinates: 25°8′56″N 93°58′14″E / 25.14889°N 93.97056°E / 25.14889; 93.97056
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
జిల్లాకాంగ్‌పోక్‌పి
Elevation
992 మీ (3,255 అ.)
జనాభా
 (2011)
 • Total7,476
భాషలు
 • అధికారికమణిపురి
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
795129
టెలిఫోన్ కోడ్03880
Vehicle registrationఎంఎన్ 03
సమీప నగరంఇంఫాల్
స్త్రీ పురుష నిష్పత్తి989/1000 /
అక్షరాస్యత83%
లోక్‌సభ నియోజకవర్గంఔటర్ మణిపూర్

కాంగ్‌పోక్‌పి, మణిపూర్ రాష్ట్రంలోని కాంగ్‌పోక్‌పి జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.[1] 39వ జాతీయ రహదారి ద్వారా ఈ పట్టణం, రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌తో కలుపబడి ఉంది. ఇంఫాల్ నగరానికి 43 కి.మీ.ల దూరంలో ఉంది.

జనాభా

[మార్చు]

ఇక్కడ ప్రధానంగా తడౌ-కుకి, నేపాలీలు నివసిస్తున్నారు. అంతేకాకుండా బీహార్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి వలస వచ్చినవారు కూడా ఉన్నారు. తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి కొన్ని కుటుంబాలు రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి ముందే ఇక్కడికి వలస వచ్చాయి. వారే ఇక్కడ దుకాణాలు నడిపిస్తున్నారు.

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 7,476 జనాభా ఉంది. ఈ జనాభాలో 3,720 మంది పురుషులు, 3,756 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత 85.12% కాగా, ఇది జాతీయ సగటు 76.94% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 89.98% కాగా, స్త్రీల అక్షరాస్యత 80.34% ఉంది. మొత్తం జనాభాలో 1,016 (13.59%) మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. స్త్రీ పురుష సగటు నిష్పత్తి 1010:1000 కాగా, ఇది రాష్ట్ర సగటు 985:1000 కంటే ఎక్కువగా ఉంది.[2]

పరిపాలన

[మార్చు]

ఇక్కడ 1,437 గృహాలు ఉన్నాయి. పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, పరిశుభ్రత ప్రాథమిక సౌకర్యాలు అందజేయబడుతున్నాయి. పట్టణ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా కమిటీకి అధికారం ఉంది.

మౌలిక సదుపాయాలు

[మార్చు]

ఇక్కడ ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉన్నాయి. సుమారు 20 పాఠశాలలు, 2 కళాశాలలు (కంగ్గుయ్ కళాశాల, మణిపూర్ థియోలాజికల్ కళాశాల) ఉన్నాయి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉంది.

భౌగోళికం

[మార్చు]

ఇది సముద్రమట్టానికి 992 మీటర్ల ఎత్తులో ఉంది.[3]

కాంగ్‌పోక్‌పి పట్టణంలో మతాలు (2011 Census)
Religion Percent
క్రైస్తవులు
  
79.60%
హిందువులు
  
19.48%
బౌద్ధులు
  
0.39%
ముస్లింలు
  
0.20%
ఇతరులు
  
0.19%
జైనులు
  
0.11%
సిక్కులు
  
0.03%
మతం తెలియని వారు
  
0.01%

రవాణా

[మార్చు]

ఈ పట్టణం గూండా 39వ జాతీయ రహదారి వెళుతుంది. ఇంఫాల్ - తమెంగ్‌లాంగ్ రహదారి పట్టణం మధ్యనుండి వెళుతుంది. ఈ పట్టణం నుండి ఇంఫాల్ నగరానికి చాలా ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Kangpokpi". 2011 Census of India. Government of India. Archived from the original on 2 September 2017. Retrieved 2021-01-11.
  2. "Kangpokpi Census Town City Population Census 2011-2021 | Manipur". www.census2011.co.in. Retrieved 2021-01-11.
  3. http://www.fallingrain.com/world/IN/17/Kangpokpi.html Map and weather of Kangpokpi

ఇతర లంకెలు

[మార్చు]