అక్షాంశ రేఖాంశాలు: 24°51′56″N 94°30′38″E / 24.86556°N 94.51056°E / 24.86556; 94.51056

కాంజోంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాంజోంగ్
పట్టణం
కాంజోంగ్ is located in Manipur
కాంజోంగ్
కాంజోంగ్
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
కాంజోంగ్ is located in India
కాంజోంగ్
కాంజోంగ్
కాంజోంగ్ (India)
Coordinates: 24°51′56″N 94°30′38″E / 24.86556°N 94.51056°E / 24.86556; 94.51056
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
జిల్లాకాంజోంగ్
జనాభా
 • Total729
భాషలు
 • అధికారికమీటీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
795145
Vehicle registrationఎంఎన్
సమీప నగరాలుఉఖ్రుల్, ఇంఫాల్
అక్షరాస్యత71.96%
లోక్‌సభ నియోజకవర్గంఔటర్ మణిపూర్
శాసనసభ నియోజకవర్గంఫుంగ్యార్

కాంజోంగ్, మణిపూర్ రాష్ట్రంలోని కాంజోంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఈ గ్రామం ఇంఫాల్ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉఖ్రుల్-కాంజోంగ్ రాష్ట్ర రహదారి ద్వారా కలుపబడి ఉంది. ఈ జిల్లా ప్రధాన కార్యాలయానికి ఉత్తరం వైపు లాంగ్లీ, దక్షిణం వైపు బుంగ్పా, తూర్పు వైపు పాంజ్, పశ్చిమం వైపు డాంగ్తి ఉన్నాయి.

మొత్తం జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [1] కాంజోంగ్‌లో 121 గృహాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 729 మంది జనాభా ఉన్నారు. ఇందులో 383 మంది పురుషులు, 346 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం జనాభాలో 112 మంది 0–6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణ సగటు స్త్రీ పురుష నిష్పత్తి 903:1000 కాగా, ఇది రాష్ట్ర సగటు 985 కన్నా తక్కువగా ఉంది. ఇక్కడి అక్షరాస్యత రేటు 71.96% కాగా, ఇది రాష్ట్ర సగటు 76.94% కంటే తక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 76.47% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 67.01%గా ఉంది.

వృత్తి

[మార్చు]

ఇక్కడ తంగ్ఖుల్ నాగ తెగకు చెందిన ప్రజలు నివాసితులుగా ఉన్నారు. వీరిలో ఎక్కువమంది క్రైస్తవులు ఉన్నారు. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం.

ఇతర వివరాలు

[మార్చు]

మయన్మార్, కాంజోంగ్ ప్రాంతంతో పోరస్ అంతర్జాతీయ సరిహద్దు కారణంగా ఉగ్రవాద కార్యకలాపాల గురించి తరచుగా వార్తల్లో వస్తుంటంది.[2] ఇక్కడ కొండచరియలు విరిగిపడటం వల్ల వర్షాకాలంలో ఎక్కువగా నష్టం జరుగుతుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Kamjong-Chassad population". Census 2011. Retrieved 2021-01-11.
  2. "Active militancy". Kangla online. Retrieved 2021-01-11.
  3. "Transport system". e-pao. Retrieved 2021-01-11.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కాంజోంగ్&oldid=4150141" నుండి వెలికితీశారు