Jump to content

ప్రతిమ్ డి. గుప్తా

వికీపీడియా నుండి
ప్రతిమ్ డి. గుప్తా
జననం (1981-11-11) 1981 నవంబరు 11 (వయసు 43)
వృత్తిపాత్రికేయుడు, స్క్రీన్ ప్లే రచయిత, సినిమా దర్శకుడు

ప్రతిమ్ డి. గుప్తా పశ్చిమ బెంగాల్ కు చెందిన పాత్రికేయుడు, సినీ విమర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, సినిమా దర్శకుడు.[1] ది టెలిగ్రాఫ్ వార్తాపత్రికకు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ఫిల్మ్ కంపానియన్ కు సినిమాల సమీక్షలు రాశాడు. ప్రియాంషు ఛటర్జీ, దియా మీర్జా నటించిన పాంచ్ అధ్యాయ్ సినిమాతో రచయితగా-దర్శకుడిగా పరిచయమయ్యాడు.[2] తరువాత షాహెబ్ బీబీ గోలామ్, మాచెర్ ఝోల్ విమర్శకుల ప్రశంసలతోపాటు బాక్సాఫీస్ హిట్‌గా నిలిచాయి.

జననం, విద్య

[మార్చు]

ప్రతిమ్ డి. గుప్తా 1981, నవంబరు 11న పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించాడు. సౌత్ పాయింట్ స్కూల్‌లో చదువుకున్నాడు. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుండి మాస్ కమ్యూనికేషన్, ఫిల్మ్ స్టడీస్‌లో డిగ్రీని పొందాడు.

సినిమారంగం

[మార్చు]

ది టెలిగ్రాఫ్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నప్పుడు, గుప్తా రాసిన స్క్రిప్ట్ వానిష్ 2009లో లోకర్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మకమైన బింగర్ స్క్రిప్ట్ ల్యాబ్‌కు ఎంపికైంది.[3] పాంచ్ అధ్యాయ్‌ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు, ఇది బాలీవుడ్ నటి దియా మీర్జాకి మొదటి బెంగాలీ సినిమా.[4] గుప్తా రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమా 2011 నవంబరు, డిసెంబరు నెలల్లో దాదాపు పూర్తిగా కలకత్తాలో చిత్రీకరించబడింది. ఈ సినిమా న్యూయార్క్‌లోని సౌత్ ఆసియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సెంటర్‌పీస్ ప్రీమియర్‌గా ఎంపిక చేయబడింది. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ సినిమాలో కొత్త వాయిస్‌గా ఎంపిక చేయబడింది.

2013లో ఎక్స్: పాస్ట్ ఈజ్ ప్రజెంట్ సినిమాను సహకార ప్రాజెక్ట్‌లో భాగంగా మరో 10 మంది సినీనిర్మాతలతో కలిసి తీశాడు. ఈ సినిమా 2014లో న్యూయార్క్‌లో ప్రదర్శించబడింది. 2015 నవంబరులో భారతీయ థియేటర్లలో విడుదలైంది. గుప్తా తీసిన రెండవ సినిమా సాహెబ్ బీబీ గోలామ్[5] 2016లో విడుదలైంది. ఇది నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఎంపిక చేయబడిన మొదటి ప్రధాన స్రవంతి బంగ్లా సినిమా. ఇది ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు & గుప్తాకు ఉత్తమ స్క్రీన్‌ప్లేతో సహా 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది.

2013లో గుప్తా స్క్రీన్‌ప్లే ఇంక్ ప్రతిష్టాత్మక సన్‌డాన్స్ ల్యాబ్ (ఇండియా ఎడిషన్) కోసం ఎంపిక చేయబడింది. గుప్తా తన స్క్రిప్ట్‌ను ఆస్కార్ విజేతలైన ఆసిఫ్ కపాడియా, జాషువా మార్స్టన్‌లతో కలిసి అభివృద్ధి చేశాడు.[6] స్క్రిప్ట్‌ని తన 2019 బెంగాలీ సినిమా శాంతిలాల్ ఓ ప్రోజాపోటీ రోహోష్యోకి మార్చాడు.

రిత్విక్ చక్రవర్తి పారిస్‌కు చెందిన మాస్టర్‌చెఫ్‌గా నటించిన మాచెర్ జోల్ సినిమా గుప్తా తీసిన మూడవ సినిమా. ఇది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2018లో ఇండియన్ పనోరమా విభాగంలో అధికారిక ఎంపికగా నిలిచింది. తర్వాత దీనిని నెట్‌ఫ్లిక్స్ కూడా కైవసం చేసుకుంది, ఈసారి గుప్తా ఉత్తమ డైలాగ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.

2018 ప్రారంభంలో స్టార్ ప్లస్, హాట్‌స్టార్ కోసం సుజోయ్ ఘోష్ తీన్ పహేలియన్ సిరీస్‌లో భాగంగా గుప్తా హిందీ టెలిఫిల్మ్ మిర్చి మాలినిని వ్రాసి దర్శకత్వం వహించాడు.

ఆదిల్ హుస్సేన్, పావోలీ డ్యామ్‌లతో గుప్తా తీసిన నాల్గవ బెంగాలీ సినిమా అహరే మోన్, భారతదేశం, విదేశాలలో జరిగిన ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. ఆదివారం మిడ్ డేలో ప్రముఖ సినీ విమర్శకుడు మీనాక్షి షెడ్డేచే ఆ సంవత్సరంలోని ఉత్తమ భారతీయ సినిమాలలో ఒకటిగా ఎంపికైంది.[7]

మ్యాన్స్ వరల్డ్ మ్యాగజైన్ 2018 సంవత్సరపు మెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో గుప్తా కనిపించాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా విభాగం అవార్డులు/ఇతర వివరాలు
2012 పాంచ్ అధ్యాయ్ దర్శకుడు/రచయిత సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ - సెంటర్‌పీస్ ప్రీమియర్
ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ - భారతీయ సినిమాలో కొత్త వాయిస్
జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ - ఉత్తమ నటి (దియా మీర్జా)
కళాకర్ అవార్డులు - ఉత్తమ చిత్రం
2015 ఎక్స్: పాస్ట్ ఈజ్ ప్రజెంట్ దర్శకుడు/రచయిత/నిర్మాత సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ - ఓపెనింగ్ ఫిల్మ్
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ - ఇండియా ప్రీమియర్
2016 షాహెబ్ బీబీ గోలాం దర్శకుడు/రచయిత న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ - ఇంటర్నేషనల్ ప్రీమియర్
ఫిలింఫేర్ అవార్డులు తూర్పు – ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్
2017 మాచెర్ జోల్ దర్శకుడు/రచయిత ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా - పనోరమా విభాగం

సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ - బెస్ట్ ఫిల్మ్ రన్నర్-అప్
ఫిలింఫేర్ అవార్డులు తూర్పు – ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సంభాషణ

2018 అహరే మోన్ దర్శకుడు/రచయిత సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ - అధికారిక ఎంపిక
హైదరాబాద్ బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్ - అధికారిక ఎంపిక
సింగపూర్ సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ - అధికారిక ఎంపిక
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ - బాలీవుడ్ సెక్షన్ దాటి
ఆరోవిల్ ఫిల్మ్ ఫెస్టివల్ - అధికారిక ఎంపిక
2019 శాంతిలాల్ ఓ ప్రోజాపోటీ రోహోష్యో దర్శకుడు/రచయిత/గీత రచయిత సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ - అధికారిక ఎంపిక
బ్రహ్మపుత్ర వ్యాలీ ఫిల్మ్ ఫెస్టివల్ - ప్రారంభ చిత్రం
ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్, లాస్ ఏంజిల్స్ - అధికారిక ఎంపిక
2020 లవ్ ఆజ్ కల్ పోర్షు దర్శకుడు/రచయిత కరోనా కారణంగా రద్దు చేయబడిన న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది
2023 టూత్ పరి: లవ్ బైట్స్ దర్శకుడు/సృష్టికర్త

మూలాలు

[మార్చు]
  1. "A new chapter". The Telegraph. 1 Oct 2011. Archived from the original on 3 February 2013. Retrieved 2023-07-20.
  2. "A new turn". The Indian Express. 24 Feb 2012. Retrieved 2023-07-20.
  3. "Six make it to the finals". The Hindu. 2009-07-25. Archived from the original on 27 January 2013. Retrieved 2023-07-20.
  4. "Dia Mirza's Bengali connection". DNA. Retrieved 2023-07-20.
  5. Nag, Kushali (22 July 2014). "Saheb meets Bibi". The Telegraph (Calcutta). Archived from the original on 31 October 2014. Retrieved 2023-07-20.
  6. "Eight Feature Film Projects Selected for Second Mumbai Mantra Sundance Institute Screenwriters Lab". Sundance Group. 12 March 2013. Retrieved 2023-07-20.
  7. Shedde, Meenakshi (30 December 2018). "Top 20 All-India And South Asian Films". Mid-Day. Retrieved 2023-07-20.

బయటి లింకులు

[మార్చు]