135 ఫిల్మ్: కూర్పుల మధ్య తేడాలు
చి WPCleaner v2.05 - Fix errors for CW project (Reference list missing - DEFAULTSORT missing for titles with special letters - విరామ చిహ్నాలకు ముందు ఉన్న మూలం) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →మూలాలు: AWB తో మూస చేర్పు ట్యాగులు: AutoWikiBrowser తిరగ్గొట్టారు |
||
పంక్తి 76: | పంక్తి 76: | ||
== మూలాలు == |
== మూలాలు == |
||
<references /> |
|||
{{Commons category|135 film}} |
{{Commons category|135 film}} |
||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
00:58, 27 ఫిబ్రవరి 2023 నాటి కూర్పు
135 ఫిల్ం లేదా 35mm ఫార్మాట్ (ఆంగ్లం: 135 film లేదా 35mm format) అనేది ఒక ఫిలిం ఫార్మాట్. దీని వెడల్పు 35 మిల్లీమీటర్లు ఉండటం వలన దీనికి ఈ పేరు వచ్చింది. 135 ఫిలిం నిశ్చలన ఛాయాచిత్రకళ (Still Photography) లో, ఒకప్పటి చలనచిత్రాలలో (Motion Picture) సాధారణంగా (, అత్యంత విరివిగా) వాడబడే ఫిలిం పరిమాణం.
ఇది కేవలం 35mm ఫిలిం కెమెరాలలో వాడబడుతుంది. ఈ ఫిలిం పై ఏర్పడే ఛాయాచిత్రాల పరిణామాలు 36mm పొడవు, 24mm వెడల్పు కలిగి ఉంటాయి. ఈ ఫిలిం పొడువునా ఇరువైపులా రంధ్రాలు ఉంటాయి. వీటినే స్ప్రాకెట్ హోల్స్ (Sprocket Holes) అని అంటారు. కెమెరాలో కుడివైపు ఉన్న చక్రాలకి గల పళ్ళు ఈ స్ప్రాకెట్ హోల్స్ లో ఇమిడే లాగా ఫిలింను లోడ్ చేయవలసి ఉంటుంది. ఒక ఫ్రేం పై ఒక ఛాయాచిత్రాన్ని తీసిన తర్వాత రెండవ ఫ్రేంకి తరలేందుకు కెమెరాకి గల ఒక చక్రాన్ని తిప్పటం వలన మరొక చక్రం కూడా తిరిగి ఫిలిం ముందుకు వెళ్తుంది. దీనినే ఫిలిం అడ్వాన్సింగ్ (Film Advancing) అంటారు.
135 అనే పదం మొట్టమొదట కొడాక్ చే 1934లో ఉపయోగించబడింది. అత్యంత వేగంగా ప్రజాదరణ పొందిన ఈ ఫిలిం 1960 వ సంవత్సరానికల్లా అప్పటి వరకూ విరివిగా వాడబడుతున్న 120 ఫిల్మ్కి అడ్డుకట్ట వేసి, ఆదరణలో, ఉపయోగంలో దానిని మించిపోయింది. 120 ఫిల్మ్, ఇతర లార్జ్ ఫార్మాట్ ఫిల్ం లతో గట్టి పోటీ ఉన్ననూ, ఈనాటికీ 135 ఫిలిం వాడుకలో ఉంది. ఒక ఫ్రేంలో ఒకే ఛాయాచిత్రాన్ని తీస్తే దానిని ఫుల్-ఫ్రేం (Full-frame) అనీ, ఒకే ఫ్రేంలో రెండు ఛాయాచిత్రాలని తీస్తే దానిని హాఫ్-ఫ్రేం (Half-frame) అనీ వ్యవహరిస్తారు.
135 ఫిలిం యొక్క పరిమాణాన్నే చాలా డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా లు, పలు ఇతర కెమెరాలు స్వీకరించినవి.
చరిత్ర
1893 నాటికి వాడబడుతోన్న 70 ఎంఎం ఫిలింను థామస్ ఎడిసన్ పరిశోధనశాలలో పని చేస్తోన్న విల్లియం కెన్నెడీ లారీ డికెన్సన్ అనే సాంకేతిక నిపుణుడు సగానికి కత్తరించి, పైనా, క్రింద్ర, రంధ్రాలు వేయించి మొట్టమొదటి 35ఎంఎం ఫిలింను సృష్టించాడు.[1] నాలుగు రంధ్రాల వెడల్పు ఒక ఫ్రేంగా వాడుకొనటానికి ఈ ప్రయత్నం జరిగింది. (తర్వాతి కాలంలో దీనినే హాఫ్-ఫ్రేంగా గుర్తించటం జరిగింది. 35ఎంఎం ఫిలిం పై ఫుల్ ఫ్రేంకు ఎనిమిది రంధ్రాల వెడల్పు కావలసి వస్తుంది.)
అప్పటికే జనాదరణ పొందిన మీడియం ఫార్మాట్ కెమెరాలు, ఫిలిం కన్నా 135 కెమెరాలు, ఫిలిం చిన్నవిగా ఉండటంతో 1970 నుండి 135 ఫిల్ం ఊపందుకొంది. 1999 నాటికి వచ్చిన డిజిటల్ విప్లవంతో 135 ఫిల్ంతో బాటు మొత్తం అనలాగ్ ఫోటోగ్రఫీ తుడిచిపెట్టుకుపోయింది.[2]
లక్షణాలు
క్యాసెట్
ఒక్కొక్క 135 ఫిలిం లోహంతో చేయబడిన, ఏ దిశలోనూ కాంతి సోకని క్యాసెట్ లో లభ్యం అవుతుంది. ఒక రీలులో ఉన్న అన్ని ఫ్రేంలు వాడబడిన తర్వాత చాల మటుకు కెమెరాలలో ఫిలింని కెమెరాలోనే రీవైండ్ చేసి మరల క్యాసెట్ లోనే భద్రపరచవలసి ఉంటుంది. కొన్ని మోటరైజ్డ్ కెమెరాలలో బ్యాటరీల సహాయంతో మీట నొక్కగనే ఫిలిం దానంతట అదే రీవైండ్ అవుతుంది.
ఫిలిం రకాలు
- బ్లాక్ అండ్ వైట్
- ప్రింట్
- రివర్సల్/స్లైడ్
- కలర్
- ప్రింట్
- రివర్సల్/స్లైడ్
- రెడ్ స్కేల్
- ఇన్ఫ్రారెడ్ (పరారుణ ఛాయాగ్రహణం కొరకు ఉపయోగించేవి)
- క్రాస్-ప్రాసెసింగ్ (ఒక విధంగా ప్రాసెస్ చేయవలసిన ఫిలింను మరొక విధంగా ప్రాసెస్ చేయటం)
ఫిలిం సంవర్థన
ఫిలిం సంవర్థనంలో రకరకాల ప్రక్రియలు గలవు. బ్లాక్ అండ్ వైట్ ఫిలింను సంవర్థన చేయటానికి వాడే రసాయనాలు వేరైతే, కలర్ ఫిలింను సంవర్థన చేయటానికి వాడే రసాయనాలు వేరు. ఇన్స్టంట్ ఫిలిం కెమెరా నుండి వెలువడగానే ఛాయాచిత్రం దానంతట అదే సంవర్ధన చెందుతుంది.
ఫిలిం గనుక నెగిటివ్ (ప్రింట్) అయితే C-41 రసాయనాలతో, రివర్సిబుల్ (స్లైడ్) అయితే గనుక E-6 రసాయనాలతో సంవర్థన చేయవలసి ఉంటుంది.
కొన్ని మెళకువలతో ఫిలిం సంవర్థన ఇంటిలోనే చేసుకొనవచ్చును. లేనిచో ల్యాబ్ లకు పంపవచ్చును. వినియోగదారుని అవసరాన్ని బట్టి సంవర్థన చేయబడ్డ ఫిలింను స్కాన్, ముద్రణలు చేయవచ్చును. భారతదేశంలో ఫిలింను బొంబాయికి చెందిన ideacreative.in, బెంగుళూరుకు చెందిన filmfotostore.com, GG Welling లు చేస్తారు.
చిత్రమాలిక
-
ఒక బ్లాక్ అండ్ వైట్ నెగిటివ్
-
ఒక కలర్ నెగిటివ్
-
ఒక కలర్ రివర్సల్/స్లైడ్ ఫిలిం నెగిటివ్
ఫిలిం వేగం
సాధారణంగా ఫిలిం వేగం ఐ ఎస్ ఓ 100 నుండి 800 వరకూ ఉంటాయి. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఐ ఎస్ ఓ 25, 50, 1600, 3200 లని కూడా తయారు చేస్తాయి. ఎక్కువ కాంతి ఉన్న ఛాయాచిత్రాలకి ఎక్కువ వేగం అవసరం రాదు. తక్కువ కాంతి ఉన్న ఛాయాచిత్రాలకి ఎక్కువ వేగం గల ఫిలిం అవసరం అవుతుంది.
ప్రతిబింబపు పరిమాణం
సంవిధానం చెందిన తర్వాత ఒక్క ఫ్రేం పై ఏర్పడే ఛాయాచిత్రం ఫుల్ ఫ్రేం అయితే 36 మిల్లీమీటర్ల పొడవు, 22 మిల్లీమీటర్ల వెడల్పు; హాఫ్ ఫ్రేం అయితే 18 మిల్లీమీటర్ల పొడవు, 22 మిల్లీమీటర్ల వెడల్పు ఉంటాయి.
పొడవు
ఇది సాధారణంగా 36 ఫ్రేం లతో (కొన్నింటిలో మాత్రం కేవలం 24 ఫ్రేంలతో) కార్ట్రిడ్జ్ (cartridge) లలో లభ్యం.
వినియోగం
35 ఎం ఎం ఫిలిం ఫిల్మ్ ఫోటోగ్రఫిలో అత్యధికంగా ఉపయోగించబడే సాధనం. ఇతర పెద్ద ఫార్మాట్ లతో పోలిస్తే దీని సౌలభ్యాలు ఎక్కువే. దీని కంటే చిన్న సైజు ఫిలింలు తర్వాత వచ్చిననూ అవేవీ 35 ఎం ఎం ఫిలింతో పోటీ పడలేదు. భారతదేశంలో ప్రస్తుతం వాడబడుతున్న చాలా మటుకు డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా లలో ఉండే ఇమేజ్ సెన్సర్లు కూడా 35 ఎం ఎం పరిమాణాలనే ప్రామాణికంగా తీసుకొంటాయి.
లాభ నష్టాలు
లాభాలు
- వాడుకలో సులభం. కెమెరాలో లోడ్ చేయటం, అన్-లోడ్ చేయటం వంటివి మీడియం ఫార్మాట్, లార్జ్ ఫార్మాట్ ఫిలిం లతో పోలిస్తే సులభతరం.[3]
- రెండింటి పరిమాణాలు ఒక్కటే కాబట్టి డిజిటల్ ఫోటోగ్రఫీ నుండి, అనలాగ్ ఫోటోగ్రఫీకి మొగ్గటం సులభతరం అవ్వటం
- సాధారణ వినియోగదారుడికి అందుబాటులో ఉండటం వలన డిజిటల్ ఫోటోగ్రఫీ రాక మునుపు చాలా అనలాగ్ కెమెరాలు 35mm ఫిలిం నే వాడేవి. ఇవి ఇప్పటికీ అలానే ఉండిపోవటం. అనలాగ్ ఫోటోగ్రఫీ తిరిగి రాకతో ఈ రకం ఫిలిం విరివిగా లభ్యం అవటం. ఇతర ఫిలిం ఫార్మాట్ లతో పోలిస్తే దీని సంవర్థన అయ్యే ఖర్చు తక్కువ కావటం.
- కొన్ని మెళకువలు పాటిస్తే ఫిలిం స్వాప్కు అనుగుణంగా ఉండటం
- అగ్గిపెట్టెతో తయారు చేసే సూదిబెజ్జం కెమెరాలో ఇమిడి పోగలగటం
నష్టాలు
- పెద్ద ప్రింటులు వేయటం కొద్దిగా కష్టం. వేయవచ్చును, కానీ ఎక్కువగా ఎన్లార్జ్ చేయటం వలన ఫిలిం గ్రెయిన్ వస్తుంది
- చిన్న పరిమాణం కావటం వలన (విస్తారమైన కోణాలలో) తక్కువ క్షేత్ర అగాథం సాధించటం కష్టం
- కొన్ని పరిమాణాలకు 35ఎంఎం సరిపోదు. చుట్టు ప్రక్కల ఖాళీగా రావటం కానీ, లేదా ఫోటోలో కొంత భాగం తొలగించవలసిన అవసరం రావటం కానీ జరుగుతుంది.
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ మొట్టమొదటి 35 ఎంఎం ఫిలిం ను రూపొందించిన విలియం కెన్నెడీ లారీ డికెన్సన్[permanent dead link]
- ↑ "135 డిజిటల్ ఫోటోగ్రఫీ రాక తో అటకెక్కిన 135 ఫిల్మ్". Archived from the original on 2018-08-12. Retrieved 2018-10-07.
- ↑ డిజిటల్ నుండి అనలాగ్ కు మొగ్గటం సులభతరం చేసే 35ఎంఎం