"వికీపీడియా:వికీ సాంప్రదాయం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 3 langlinks, now provided by Wikidata on d:q3621820)
* [[వికీపీడియా:ఏకాభిప్రాయం|ఓ అంగీకారానికి రావడం కోసం ప్రయత్నించండి]].
* విషయంపై వాదించండి, వ్యక్తులపై కాదు.
* ప్రశ్నలప్రశ్నలను నుండిఎదుర్కోండి, తప్పుకోకండి.
** ఇతర సభ్యులు మీ దిద్దుబాటుతో అంగీకరించకపోతే, అది సరైనదని ఎందుకు అనుకుంటున్నారో సకారణంగా వివరించండి.
* అవతలివారు చెప్పేది సరి అని అనిపిస్తే ఒప్పేసుకోండి; మీ వ్యతిరేకత మీ అభిరుచి ప్రకారమే అయితే అదే విషయాన్ని ఒప్పేసుకోండి.
 
===మదిలో ఉంచుకోవాల్సిన కొన్ని విషయాలు===
* వికీపీడియా వ్యాసాలు అన్ని దృక్కోణాలను చూపించాలి. వివిధ దృక్కోణాల్లో ఏది సరైనది అనే విషయాన్ని చర్చించేందుకు చర్చాపేజీ వేదిక కాదు. ఆ పనికోసం [[Usenet]], [[బ్లాగు]] ల వంటి అనేక ఇతర వేదికలున్నాయి. వ్యాసంలోని ఖచ్చితత్వం, తటస్థత మొదలైన విషయాల గురించి మాత్రమే చర్చాపేజీల్లో చర్చించాలి.
* మీతో ఎవరైనా విభేదిస్తే, దానర్థం (1) మీరంటే వారికిష్టం లేనట్లో, (2) వారు మిమ్మల్ని మూర్ఖుడిగా భావిస్తున్నట్లో, (3) వారు మూర్ఖులైనట్లో, (4) ఆ వ్యక్తి దుష్టుడనో, మరోటో కాదు. వ్యాసాలపై ప్రజలు వెలిబుచ్చిన అభిప్రాయాలను వ్యాసం వరకే పరిమితం చెయ్యండి.
* వికీపీడియా మిమ్మల్ని [[వికీపీడియా:చొరవగా ముందుకు రండి|చొరవగా దిద్దుబాట్లు చెయ్యమంటోంది]]. చర్చ మొదలుపెట్టే ముందు ఓ ప్రశ్న వేసుకోండి: దీన్ని చర్చించాల్సిన అవసరం ఉందా? ఓ [[సహాయము:దిద్దుబాటు సారాంశం|దిద్దుబాటు సారాంశాన్ని]] రాసి, అవతలి వారి స్పందన కోసం ఎదురు చూడొచ్చా?
* వ్యాసం పేజీలో చర్చించాల్సిన అవసరం లేనపుడు, ఈమెయిల్లోనో, మీ చర్చాపేజీ లోనో చర్చించవచ్చు.
 
===మర్యాద పూర్వక చర్చపై మరిన్ని చిట్కాలు===
* మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా చెప్పండి. -మరీ ముఖ్యంగా చర్చలో గత వ్యాఖ్యకు సమాధాన మిచ్చేటపుడు
** గత వ్యాఖ్యను ఉదహరిస్తే మంచిది. మీరా వ్యాఖ్యను ఎలా అర్థం చేసుకున్నారో రాస్తే మరింత మంచిది. అవతలి వారి అభిప్రాయం తప్పని రాసేటపుడు మీరు వారిని సరిగా అర్థం చేసుకోకపోయి ఉండొచ్చని ముందే రాయండి.
* సభ్యులకు గానీ, వారి దిద్దుబాట్లకు గానీ ''పేర్లు పెట్టకండి''. వారిపై ''[[వికీపీడియా:వ్యక్తిగత దాడులు కూడదు|వ్యక్తిగత దాడులు చెయ్యకండి]]''.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1927529" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ