2,515
edits
(Gregoriancalendarleap solstice.svg) |
ట్యాగు: 2017 source edit |
||
ఒక [[కాలెండరు సంవత్సరం]]లో అదనంగా ఒక [[రోజు]] గానీ లేక ఒక [[నెల]] గాని అదనంగా ఉంటే, దానిని '''లీపు సంవత్సరం''' అంటారు. [[ఖగోళ సంవత్సరం]]తో, కాలెండరు సంవత్సరానికి వచ్చే తేడాను సరిచేయడానికి లీపు సంవత్సరాన్ని అమలుచేసారు. ఖగోళ సంవత్సరంలో ఘటనలు కచ్చితంగా ఒకే వ్యవధిలో పునరావృతం కావు. కాబట్టి ప్రతి ఏడూ ఒకే సంఖ్యలో రోజులుండే కాలెండరు, ఖగోళ ఘటనలను సరిగా ప్రతిఫలించక, ఏళ్ళు గడిచే కొద్దీ తేడాలు చూపిస్తూ ఉంటుంది. సంవత్సరానికి అదనంగా ఒక రోజునో లేక ఒక నెలనో చేర్చి ఈ తేడాను నివారించవచ్చు. లీపు సంవత్సరం కానిదానిని సాధారణ సంవత్సరం, లేదా మామూలు సంవత్సరం అంటారు.
* సాధారణ సంవత్సరానికి 365 రోజులు, లీపు సంవత్సరానికి 366 రోజులు ఉంటాయి.
* సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 28 రోజులు ఉంటే... లీపు సంవత్సరంలోని ఫిబ్రవరి నెలకు 29 రోజులు ఉంటాయి.
* లీపు సంవత్సరం ప్రతి 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది.
* 4తో నిశ్శేషంగా భాగించబడే సంవత్సరాలన్నీ లీపు సంవత్సరాలే.
ఉదా: 1988, 1996, 2004 మొదలైనవి.
కానీ 100, 200, 1700, 1900, 2100 మొదలైనవి లీపు సంవత్సరాలు కావు. వందతో ముగిసే సంవత్సరాల్లో కేవలం 400తో నిశ్శేషంగా భాగించబడేవే లీపు సంవత్సరాలు అవుతాయి
ఈ గ్రాఫ్ పటములో సీజనల్ సంవత్సరానికి కేలండర్ సంవత్సరానికి తేడాను చూపబడింది.
|
edits