"నడమంత్రపు సిరి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
==సంక్షిప్తకథ==
పెసరట్ల భూషయ్య దశ తిరగడంతో దాదాపు దశాబ్దంగా ఉంటూ వచ్చిన పాత కొంపను వదిలి లంకంత భవనం కట్టుకుని అందులోకి మకాం మార్చాడు. తన వేషధారణలో మార్పు వచ్చింది. ఎదిగి వచ్చిన కొడుకు, కూతురు ఉండి కూడా కామిని అనే నాట్యకత్తెను పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అది తెలిసి ఎదిరించిన ఇంటిల్లిపాదీ ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవలసి వచ్చింది. జమాలుద్దీన్ అబూబేకర్ యువరాజూ, పారిశ్రామికవేత్త ధర్మభోజా, ఆయన కార్యదర్శి దిల్వార్ ఖాన్ బిస్మిల్లా ఒక పెద్ద హోటల్లో మకాం చేశారనీ, వారు ప్రతియేటా నూటికి మూడు వంతుల వంతున మూడు రెట్ల లాభం వచ్చేలా పూచీ ఇవ్వగలరని తెలిశాక భూషయ్య తన యావదాస్తినీ పెట్టుబడిగా పెట్టేశాడు. కామిని తన పేరునే ఆ వాటాలన్నీ మార్చమని భూషయ్యకు తెలియకుండా భోజాను కోరింది. ఈ విషయం భూషయ్యకు ఎలాగో తెలిసిపోయింది. కానీ భూషయ్యను నిర్బంధించి భవంతిని కూడా కామిని పేరుమీద వ్రాసిపెట్టాలని ఒత్తిడి పెరిగింది. అతన్ని చూడటానికి వచ్చిన కూతురు రాధను కూడా దుర్మార్గులు బంధించారు<ref name="జ్యోతి రివ్యూ">{{cite news |last1=తుర్లపాటి |title=చిత్రసమీక్ష నడమంత్రపుసిరి |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=63259 |accessdate=6 April 2020 |work=ఆంధ్రజ్యోతి దినపత్రిక |date=22 September 1968}}</ref>. కామిని కూతురు నళిని సహాయంతో రఘు ధర్మభోజాగా, అతని స్నేహితుడు, నళిని ప్రేమికుడు బాబూరావు అతని కార్యదర్శిగా నాటకమాడి భూషయ్య వద్ద మిగిలివున్న 7 లక్షలు కామిని, జాలయ్యలకు దక్కకుండా చేస్తారు. నానా అవస్థలు పడి, చివరకు నళిని సహాయంతో బయటపడి, పశ్చాత్తాపతప్తుడై భూషయ్య, కొడుకును, కోడలిని, కూతురును ఆదరిస్తాడు. రఘు రాధను పెళ్లి చేసుకుంటాడు<ref name="ప్రభ రివ్యూ">{{cite news |last1=రాధాకృష్ణ |title=చిత్రసమీక్ష నడమంత్రపు సిరి |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=47462 |accessdate=6 April 2020 |work=ఆంధ్రప్రభ దినపత్రిక |date=27 September 1968}}</ref>.
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2908174" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ