గజ్జెల మల్లారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 56: పంక్తి 56:
*అక్షింతలు,
*అక్షింతలు,
*దమ్మపదం
*దమ్మపదం
==పురస్కారాలు==
*1989లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నాడు<ref name="గుంటూరుసీమ">{{cite book |last1=పెనుగొండ లక్ష్మీనారాయణ |title=గుంటూరుసీమ సాహిత్యచరిత్ర |date=జనవరి 2020 |publisher=ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ |location=గుంటూరు |pages=283-284 |edition=1}}</ref>.
==మూలాలు==
{{మూలాలజాబితా}}


{{Authority control}}
{{Authority control}}

15:52, 6 జూలై 2020 నాటి కూర్పు

గజ్జెల మల్లారెడ్డి
గజ్జెల మల్లారెడ్డి
జననంగజ్జెల మల్లారెడ్డి
1925
వైఎస్ఆర్ జిల్లా ఆంకాళమ్మ గూడూరు
వృత్తిఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం పత్రికలకు సంపాదక వర్గ సభ్యుడు
ప్రసిద్ధిఅభ్యుదయ కవి
రాజకీయ పార్టీకమ్యూనిస్టు పార్టీ

గజ్జెల మల్లారెడ్డి అభ్యుదయ కవి. వైఎస్ఆర్ జిల్లాలో గొప్ప రాజకీయ ఉపన్యాసకుడుగా ప్రసిద్ధి చెందిన వాడు. వైఎస్ఆర్ జిల్లా ఆంకాళమ్మ గూడూరులో 1925లో జన్మించారు. అభ్యుదయ, వ్యంగ్య కవి. మూఢనమ్మకాలను హేళన చేసే ఆస్తిక హేతువాది. 1943లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 1978 వరకు పలు పదవులు నిర్వహించారు. నిర్మొహమాటి. మత'మేధావుల తలలపై మూఢత్వం మేటగట్టి వజ్రజిహ్వగా మారిందంటాడు. 1956లో 'సవ్యసాచి' పక్షపత్రిక ద్వారా జర్నలిజంలో ప్రవేశించారు.1970 నుంచి 1973 వరకు 'విశాలాంధ్ర'కి సంపాదకత్వం వహించారు. కొన్ని సంవత్సరాలు 'వీచిక' అనే సాహిత్య మాసపత్రికను నిర్వహించారు. 'ఈనాడు'లో ఆరు సంవత్సరాలపాటు పుణ్యభూమి మొదలైన వ్యంగ్య రచనలు చేశారు. 'ఆంధ్రభూమి', 'ఉదయం' వంటి పత్రికల్లో రాశారు. అభ్యుదయ రచయితల సంఘం పునర్నిర్మాణానికి శ్రమించారు. 1993-95 లో రాష్ట్ర అధికారబాషా సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. 1985లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్‌. చివరి రోజుల్లో ఆధ్యాత్మికతవైపు మొగ్గారు.

మల్లారెడ్డి గేయాలు, శంఖారావం అన్నవి ఇతని కవితా సంకలనాలు. సవ్యసాచి పత్రికలో గేయాలు ప్రచురింపబడినాయి. 1973 నుండి అరసం ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం పత్రికలకు సంపాదక వర్గ సభ్యునిగా పనిచేశాడు.

చురక

  • తెలుగునాట భక్తిరసం-తెప్పలుగా పారుతోంది

డ్రెయినేజీ స్కీములేక-'డేంజరుగా మారుతోంది

రచనలు

  • 'మల్లారెడ్డిగేయాలు'
  • శంఖారావం'
  • ఇంటర్వ్యూహం
  • 'సత్యంవధ ధర్మం చెర
  • , ఎం.ఎల్.ఎ,
  • సందేహడోల,
  • పేరిగాని దర్బారు.
  • మఖ్దూం కవిత
  • మల్లారెడ్డి మాటకచేరీ,
  • అక్షింతలు,
  • దమ్మపదం

పురస్కారాలు

  • 1989లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నాడు[1].

మూలాలు

  1. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.