తిథి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: hi:तिथियाँ
చి Bot: Migrating 11 interwiki links, now provided by Wikidata on d:q1427958 (translate me)
పంక్తి 120: పంక్తి 120:
[[వర్గం:తిథులు]]
[[వర్గం:తిథులు]]
[[వర్గం:కాలమానాలు]]
[[వర్గం:కాలమానాలు]]

[[en:Tithi]]
[[hi:तिथियाँ]]
[[ta:திதி]]
[[ml:തിഥി]]
[[bn:তিথি]]
[[de:Tithi]]
[[gu:તિથી]]
[[ja:ティティ]]
[[mr:तिथी]]
[[or:ତିଥି]]
[[pl:Tithi]]

22:30, 8 మార్చి 2013 నాటి కూర్పు

వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిధి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ఒక్కొక్క తిధి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.

పక్షంలోని తిథులు

  1. పాడ్యమి (అధి దేవత - అగ్ని)
  2. విదియ (అధి దేవత - బ్రహ్మ)
  3. తదియ (అధి దేవత - గౌరి)
  4. చవితి (అధి దేవత - వినాయకుడు)
  5. పంచమి (అధి దేవత - సర్పము)
  6. షష్టి (అధి దేవత - కుమార స్వామి)
  7. సప్తమి (అధి దేవత - సూర్యుడు)
  8. అష్టమి (అధి దేవత - శివుడు)
  9. నవమి (అధి దేవత - దుర్గా దేవి)
  10. దశమి (అధి దేవత - యముడు)
  11. ఏకాదశి (అధి దేవత - శివుడు)
  12. ద్వాదశి (అధి దేవత - విష్ణువు)
  13. త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)
  14. చతుర్దశి (అధి దేవత - శివుడు)
  15. పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి (అధి దేవత - చంద్రుడు)
  16. అమావాస్య (అధి దేవత - పితృదేవతలు)

తిథులు అధిదేవతలు ఫలితాలు

తిథి అధిదేవత చేయతగిన కార్యములు ఫలితములు
పాడ్యమి శ్రద్ద శ్రద్ధతో పనిచేయుట, పనులయందు జాగరూకత శ్రుతము, శాస్త్రముల ఆచరించుట
విదియ మైత్రి కొత్త పరిచయాలు, మంచి మిత్రులు, చికిత్సారంభం ప్రసాదము, మనోవికాసం
తదియ దయ ఆర్తులకు సేవచేయుట అభయం- నిర్భయము, అభయమిచ్చుట
చవితి శాంతి ధ్యానము, సత్సంగము సుఖము-కార్యసిద్ధి
పంచమి తుష్టి తృప్తి పడుట, అసంతృప్తిని విడచుట, ప్రజాహిత కార్యములు ముదము-ఆనందము
షష్టి పుష్టి ఆతిథ్యము, మంచి భోజనము, కలహములు రాకుండా జాకరూకత స్మయము- గర్వము కలుగుట
సప్తమి క్రియ ప్రియము నిష్టతో కార్యాచరణ, తపసు, వేద్యయనం, శరణాగతి యోగము-దైవముతో యోగము, విగ్నములు తొలగుట, ప్రయోజనము
అష్టమి స్వాహాదేవి వ్యాయాయము, అగ్నికార్య్సములు, పోటీలో నిలుచుట, సిద్ధిని పొందుటకు చేయవలసిన కార్యములు, ఆరోగ్యకరమైన ఆహారం శ్రమతో విజయమును సాధించుట
నవమి ఉన్నతి సత్పురుషుల సన్నిధిలో వినయముతో మెలగుట దర్పం, అపురూపమైన విద్య, అధికారం, శక్తి, తెలివి వలన కలుగు దర్పం. గుర్తింపు కొరకు గొప్ప కొరకు పాటుపడుట నివారించని ఎడల పేదరికం సంభవించును
దశమి బుద్ధి వివేకముతో కార్యాచరణ చేయుట అర్ధము-ప్రయోజనము, పరిస్తితులను సద్వినియోగపరచుట
ఏకాదశి మేధ కార్యములందు శుభం, విద్యలను సద్వినియోగపరచుకొనుట స్మృతి-కావలసిన సమయంలో విద్యలు స్పురించి ప్రయోజనం సమకూరుట
ద్వాదశి తితిక్ష పరిస్థితులను, ఇతరుల ప్రవర్తనను ఓర్చుకొనుట క్షేమం- ఓర్పువహించిన వారికి ఆపదలు రావు
త్రయోదశి హ్రీ కార్యములందు శుభం, నైతికంగా దిగజారకుండా జాగరూయకత వహించుట ప్రశ్రయం- చెడుపనులను చేయకుండుట, ఇతరుల విశ్వాసం చూరగొనుట
చతుర్ధశి మూర్తి ఏ పని చేయక ఆత్మధ్యానం, పరమాత్మ ధ్యానం చేయుట సకల సద్గుణములు కలుగును
పూర్ణిమ సతీదేవి(శక్తి,షోడశి మాంగల్యాది దేవతలు) దౌవధ్యానం, దేవీ ఉపాసన ప్రజ్ఞ-జగన్మాత అనుగ్రహము, ఉన్నత లక్ష్యసిద్ధి
అమావాస్య పితృలోకము బ్రహ్మచర్య సాధన, పరబ్రహ్మ ధ్యానం తేజస్సు, ధారణ శక్తి, జ్ఞానం, విజ్ఞానం, బ్రహ్మనిష్ట

తిథి శూలలు

  • తూర్పు :- పాడ్యమి నవమి.
  • ఆగ్నేయము :- తదియ, ఏకాదశి.
  • దక్షిణము :- పంచమి, త్రయోదశి.
  • నైరుతి :- చవితి, ద్వాదశి.
  • పడమర :- షష్ఠి, చతుర్ధశి.
  • వాయవ్యము :- సప్తమి, పూర్ణిమ.
  • ఉత్తరము :- విదియ, దశమి.
  • ఈశాన్యము :- అష్టమి, అమావాశ్య.

వెలుపలి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=తిథి&oldid=808732" నుండి వెలికితీశారు