ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆమదాలవలస)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆమదాలవలస, ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా లో ప్రభుత్వ రంగంలో ఉన్నత విద్యా సంస్థ. [1]1984 లో స్థాపించబడింది. అప్పటి శాసనసభ సభ్యుడు, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ విధానసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు దృష్టికి ఉన్నత విద్యాసంస్థ అవసరాన్ని  తీసుకువెళ్లగా ఏర్పాటైంది.ప్రారంభించిన కొన్ని సంవత్సరాలు కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కొనసాగింది.2007 లో  నూతనంగా నిర్మించిన భవనాలలోకి మారింది.  కొత్త భవనాలతో పాటు పట్టణం మధ్యలో ఐదు ఎకరాలు కళాశాలకు కేటాయించబడ్డాయి.

కోర్సులు[మార్చు]

ప్రస్తుతం కళాశాలలో బి ఏ చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం.  బి. కామ్ కోర్సులు తెలుగు మీడియం లో ఉండగా 2021-22 విద్యా సంవత్సరం నుండి అన్ని కోర్సులు ఆంగ్ల మీడియం లో ప్రారంభమయ్యాయి.

వసతులు[మార్చు]

కళాశాలలో డిజిటల్ తరగతి గదులు, ఇంటర్నెట్ తో కూడిన ఆంగ్ల భాషా ప్రయోగశాల సుమారు 5000 లకు పైగా పుస్తకాలతో కూడిన గ్రంధాలయం విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.

అనుబంధం

కళాశాల ప్రారంభం నుండి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగిన కళాశాల, 2010 నుండి శ్రీకాకుళం, ఎచ్చెర్ల లో డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతోంది.

గుర్తింపు[మార్చు]

2016 మార్చి లో ఈ కళాశాల ను సందర్శించిన బెంగళూరు లో నాక్ బృందం ఈ కళాశాలకు B గ్రేడ్ ప్రకటించింది.

పూర్వ విద్యార్థులు[మార్చు]

ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్నారు. పత్రికా రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ కొందరు స్థిరపడ్డారు. వీరి సంఘ సమావేశం ప్రతీ ఏటా జనవరి లో జరుగుతూ ఉంటుంది.

మూలాలు[మార్చు]

  1. "Government Degree College, Amadalavalasa". www.gdcamadalavalasa.ac.in. Archived from the original on 2021-12-05. Retrieved 2022-03-14.

వెలుపలి లంకెలు[మార్చు]

1. www.apcce.gov.in

2. www.gdcamdalavalasa.ac.in

3. www.brau.edu.in

4. www.oamdc.ap.gov.in