Jump to content

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రోడ్ రైల్వేస్టేషన్

వికీపీడియా నుండి

మహబూబ్ నగర్ జిల్లా లోని రైల్వే స్టేషను లలో ఇది ఒకటి. ఇటీవల గద్వాల రైల్వేస్టేషను జంక్షన్ గా ఏర్పడి, కర్ణాటక లోని రాయచూరుకు నూతన రైల్వే మార్గం ఏర్పడింది. గద్వాల నుండి రాయచూరుకు వెళ్ళు ఈ మార్గంలో గద్వాలకు పశ్చిమాన 10 కిలోమీటర్ల దూరంలో ఈ రైల్వేస్టేషను వస్తుంది. ఈ మార్గంలో మొదటి స్టేషను కూడా ఇదే. ఈ స్టేషను మండల కేంద్రమైన ధరూర్ గ్రామానికి అతి దగ్గరలోనే ఉన్నా, మండలంలో పేరుగాంచిన జురాల ప్రాజెక్ట్ ఉండడం, ప్రాజెక్ట్ కు వెళ్ళు మార్గంలో ఈ స్టేషను ఉండటం వలన 'ప్రియదర్శిని జురాల ప్రాజెక్ట్ రోడ్'అని ఈ స్టేషనుకు నామకరణం చేశారు. మన్నాపూర్, ధరూర్ గ్రామాల మధ్య ఆకర్షణియంగా ఈ రైల్వేస్టేషనును ఏర్పాటు చేశారు. చాలా ఎత్తులో ఉండి, విశాలమైన, అహ్లాదకరమైన వాతావరణంతో ప్రయాణికులను సేదతీరుస్తుంది. ఈ స్టేషనును దాటి పశ్చిమవైపు ముందుకు వెళ్తే, పాండురంగ స్వామి రోడ్ రైల్వేస్టేషను వస్తుంది.

చిత్రమాల

[మార్చు]