పాండురంగ స్వామి రోడ్ రైల్వేస్టేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్రం,జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల నుండి రాయచూరుకు వెళ్ళు మార్గంలో ఈ రైల్వేస్టేషను ఉంది. ధరూర్ మండలంలోని కొండాపూర్ గ్రామం దగ్గర, గ్రామానికి ఆగ్నేయాన కి. మీ. దూరంలో ఈ స్టేషనును ఏర్పాటుచేయబడింది. కొండాపూర్ సమీప గ్రామమైన వెంకటాపూర్లో ప్రసిద్ధి చెందిన శ్రీ పాగుంట వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ స్వామికి గల మరో పేరే పాండురంగ స్వామి. ఆ స్వామి పేరు మీదే ఈ స్టేషనుకు "పాండురంగ స్వామి రోడ్ రైల్వేస్టేషను" అని పేరు పెట్టారు. స్టేషను భవనాన్ని కూడా దేవాలయాన్ని గుర్తుచేసేలా రూపొందించారు. గద్వాల రాయచూర్ రైలు మార్గంలో గద్వాల నుండి ఇది రెండో స్టేషను. మొదటిది ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రోడ్. ఈ మార్గంలో ఆంధ్రప్రదేశ్లో చివరి స్టేషను కూడా ఇదే. కొండాపూర్, వెంకటాపూర్, పాగుంట, ఇర్కిచేడు తదితర గ్రామాల ప్రజలకు ఈ స్టేషను అందుబాటులో ఉంది. గద్వాల, అలంపూర్, కర్ణాటక లోని రాయచూరు ప్రాంతాల నుండి నిత్యం శ్రీపాగుంట వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు కూడా ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంది.

చిత్రమాలిక

[మార్చు]