ప్లాటినస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాశ్చాత్య తత్వశాస్త్రం
ప్రాచీన తత్వశాస్త్రం
Plotinos.jpg
ప్లాటినస్
పేరు: ప్లాటినస్
జననం: సిర్కా 204 - 204 క్రీ.పూ., ఏథెన్స్
మరణం: సిర్కా 270 - 270 క్రీ.పూ., ఏథెన్స్
సిద్ధాంతం / సంప్రదాయం: అనుభూతివాదం
ముఖ్య వ్యాపకాలు: రెటరిక్, కళలు, సాహిత్యం, ఎపిస్టెమాలజీ, న్యాయం, వర్చూ, రాజకీయాలు, విద్య, కుటుంబం, మిలిటరిజం
ప్రముఖ తత్వం: ద ఎన్నిడ్స్
ప్రభావితం చేసినవారు: ప్లేటో సోక్రటీసు, హోమర్, హెసియాడ్, అరిస్టోఫేన్స్, అయిసోప్, ప్రొటాగొరాస్, పర్మనైడులు, పైథాగొరాస్, హెరాక్లిటస్, ఆర్ఫానిజం
ప్రభావితమైనవారు: అరిస్టాటిల్, నియోప్లాటోనిజం, సిసిరో, ప్లూటార్చ్, స్టాయిసిజం, అన్‌సెల్మ్, డెస్‌క్రేట్స్, హొబ్బెస్, లీబ్‌నిజ్, మిల్, స్కోపెన్‌హార్, నీట్జ్‌షే, హీడెగ్గర్, అరెండ్‌ట్, గడామర్, అనేక ఇతర పాశ్చాత్య తత్వవేత్తలు, మత శాస్త్రవేత్తలు

పాశ్చాత్య కళాతత్త్వ వ్యాఖ్యాతలలో సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్ లు సూత్రకర్తలు కాగా ధియోప్రాస్టస్, క్వింటీలియన్, డయనోసియస్ లు ఆసూత్ర వృత్తికారులు.ఆవర్గంలో వాడే ప్లాటినస్. అంతకు ముందువాళ్ళు సాహిత్యంలో వాగ్వాపార నిర్వహణను గురుంచి ఆలోచిస్తే ఇతను అనుభవ వాదాన్ని తాత్త్విక, తార్కిక, మనః పరుధుల్లో వ్యాఖ్యానించడంలో ప్లాటినస్ అసమాన ప్రతిభను కనబరిచాడు.

అరిస్టాటిల్ ప్రకారం రసానుభవం (ఈస్తటిక్ ఎక్స్పీరియంస్) నిజ జీవితానుభవం కన్నా స్వభావతః భిన్నమైందికాదు.కాకపోతే సాహిత్యంలో ఆ ఉద్విగ్నత అత్యున్నతదశలో ఉంటుందని అతని అభిప్రాయం. త్రాసద (ట్రాజడీ) సృజనం మాత్రమే, క్షాళన (కెధార్సిస్) సమర్ధం కావడంలో పర్య్వసిస్తుంది.కళాస్రష్ట ఇక్కడే వేదాంతితో సమానుడౌతాడు.ఇది ప్లాటో అరిస్టాటిల్ ఇద్దరూ అంగీకరించిన అభిప్రాయం. కాని ప్లాటినస్ ప్రకారం ఇది కేవలం అనుభవోద్విగ్నత-మగ్నతకాదు. అనుభవం ఉపరి మనోంతర భాగాల్ని తాకే లక్షణం కలిగి ఉంది. దీనికి భౌతిక మానసిక ఆధ్యాత్మిక దశాంతరాలున్నాయి.ఈ కక్ష్యాంతరాల్ని దాటి పోవడంలో కళ తన స్వతంత్ర ప్రతిపత్తిని సార్ధకం చేసుకోంటుంది.అందుచేత కేవలం నీతి ప్రభోధకం కావడమో కాకపోవడమో కళాప్రయోజనంకాదు.అది అందించే అనుభవం యోగానుభవసదృసం అంటాడు ప్లాటినస్.

అభాస-ధియరీ ఆఫ్ ఎమనేషన్[మార్చు]

ఈ పదార్ధ జగత్తు ప్లాటో భావించినట్లు భావప్రతిబింబం మాత్రమేకాదు. లేక అరిస్టాటిల్ చెప్పినట్లు రూప నిర్దిష్ట పదార్ధ పరిణామం కాదు.అది కేవలం ఏకైక సత్యవస్తువు పొందే అభాసం-సూర్యకాంతి ఒకేబింబం నుంచి ప్రపంచాన్నంతా ఆశ్రయించినట్లు.ఆవస్తువు (తత్ పదార్ధం-భారతీయ పరిభాషలో) ప్లాటో చెప్పినట్లు భావజగత్తు కాదు అంటాడు ఇందులో ప్లాటినస్. దైవ, చైతన్య, ఆత్మలనే తత్త్వత్రయం ఈ సత్యవసువు స్వభావ వ్యంజకాలు.ఇవి కేవలం ఆ వస్తువుకు సంకేతాలు మాత్రమే.ఆ వస్తువు పరిపూర్ణం, స్వతంత్రం, సంపూర్ణం.ప్లాటినస్ అభిప్రాయం-సమకాలీన విజ్ఞానుల నిరూపణను ఆధారంగా కల్గిందే.సూర్యుడు ప్రపంచానికి ఇంతకాంతిని ఇస్తున్నా తాను నష్టపోతున్నదేమీ లేదని-శాస్త్ర నిరూపణ. ద్వద్య జగత్తు సూర్యుణ్ణి ఏవిధంగా ప్రభావతం చేయడం లేదు.ప్రకాశించడం సూర్యుని సహజ స్వభావం.ఈ ద్రవ్యజగత్తంతా ఒక సృజనాత్మక విన్యాసం తప్పా ఇదే అదికాదు అంటాడు ప్లాటినస్.

ప్లాటినస్ దివ్యమానవ తత్త్వ పరిధుల్లో మూడు దశల్ని గుర్తించాడు. 1. దేహేంద్రియ అనుభవశక్తి-భౌతికానుభవం.2. చిత్తానుభవం. 3. చైతన్యానుభవం. ఇవి దేశకాల పరిధులకు లోబడి ఉంటాయి. అంటాడు ప్లాటినస్.

మూలాలు[మార్చు]

  • 1982 భారతి మాసపత్రిక- వ్యాసము:ప్లాటినస్, వ్యాసకర్త: డా. హెచ్.ఎస్.బ్రహ్మానంద.

వెలుపలి లంకెలు[మార్చు]