Jump to content

ఫకీరు వేషాలు

వికీపీడియా నుండి
నిప్పు లాంటి మనిషి చిత్రంలోని స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. పాటలో నందమూరి తారక రామారావు, ఫకీరు వేషంలో కైకాల సత్యనారాయణ

ఫకీర్లు ముస్లిం కులంలో ఒక తెగ. వీరు ముఖ్యంగా ముస్లిములనే యాచిస్తారు. ప్రత్యేకంగా వీరు ముస్లిములనే యాచిస్తారు. గనుక, ముస్లిములు వీరిని ఆదరిస్తారు. అల్లాను సంస్మరిస్తూ, అల్లాకెనాం జపిస్తూ ఇంటింటికీ తిరుగుతూ, ముస్లిములను ఆశీర్వదిస్తారు. కళారూపాలన్నీ ప్రథమంలో ఒకందుకు ఏర్పడినా తరువాత అవి వివిధ రీతులుగా ఎలా పరిణామం చెందాయో ఈ ఫకీరు వేషాలు కూడా అంతే.

వీరు ఒక పెద్ద కంజిరాను చేతిలో ధరించి తలకు పెద్ద తలపాగా చుట్టి, మెడలో ఫకీరు పూసలను ధరించి మొకకు లుంగీలను ధరిస్తారు. ఈ వేషాల్లో అయిదారుగురు వస్తారు. ఉరుదూ యాసలో తెలుగు మాట్లాడుతారు. జీవాత్మ, పరమాత్మల గురించి చెపుతూ తన్వుకీ ప్రాణాన్కీ వున్న స్నేహం గొప్పది. ఒకదాన్కీ బాధా వస్తే, మరొకదాన్కీ బాధా కల్గుతుంది. అదీ దోస్తీ .... అలాగే దేహాన్ని గురుంచి చెపుతూ, ఒక అడవికి బోయి చిల్కా తెస్తాం, పందరంలో పెట్టి పళ్ళు పప్పులూ పెడ్తాం, అది మనల్నినమ్మిందీ కదా, అని దాన్ని నమ్మి సంతోష పడ్డాం. కాని పంజరం తెరిచీ వున్న వేళా అది ఎవరికీ చెప్పకుండా జంగిలీకి ఎగిరిపోద్ది. ఈ దేహమనే పంజరం నుంచీ జీవమనే సిల్క హట్టాగే ఎగిరిపోద్ది. ఇలాగ లోకంలోని సామాన్య వుపమాలాలతో ఎన్నో విషయాలు చక్కగా చెపుతారు.

ప్రతి జట్టుకూ ఇద్దరు ముగ్గురు పాట పాడుతూ వుంటే, మిగిలిన ఇద్దరూ అల్లాకేనాం అని వంత పలుగుతారు.

ఉదాహరణకు

పాడి పంటల్ సల్ల గుండాలి.........................అల్లాకేనాం||
తల్లి పిల్లల్ సల్ గుండాలి ...........................అల్లాకేనాం||
తల్లి కొడుకుల్ సల్ గుండాలి .................... అల్లాకేనాం||
హిందూ ముస్లిం లంతా ............................అల్లాకేనాం||
వారు హేకం కావలండి..............................అల్లాకేనాం||

అంటూ పాడుతూ, మధ్య మధ్య రక్తి కొరకు కర్రతో చేయబడ్డ, ఒక రకమైన కిర్రు శబ్దం వచ్చే, దానిని చేతిలో ధరిస్తారు. ఉన్నత పాఠశాల కాలేజీ విద్యార్థులు వారి వారి వార్షికోత్సవాలలో ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తూ వుంటారు. ఈ కళా రూపాన్ని ఆంధ్ర ప్రజా నాట్య మండలి, హిందూ మత సామరస్యం కొరకు ఉపయోగించి ఆంధ్ర ప్రజలలో విశేషంగా ప్రచారం చేశారు.

సూచికలు

[మార్చు]

మూలాలజాబితా

[మార్చు]

యితర లింకులు

[మార్చు]