యూదులుఈజిప్టుకువలస వచ్చి ఇటుకరాళ్ళు తయారుచెయ్యటం మొదలైన చాకిరీ చేసేవారు. మోషే తన జాతి ప్రజల్ని దేవుడువాగ్దానం చేసిన పాలస్తీనాకు తీసుకువెళతానంటాడు.ఎన్ని అద్భుతాలు చేసినా ఎంత ప్రజానష్టంజరిగినా ఈ యూదు కూలీ లను ఫరో వదలనంటాడు. చివరికి సరే వెళ్ళమంటాడు. మళ్లీ మనసు మార్చుకుంటాడు. యూదులు వెళ్ళిపోతే తన దేశంలో ఊడిగం ఎవరు చేస్తారని భయపడి, ఎర్రసముద్రంలో బడి వెళుతున్న యూదుల్ని తరుముతాడు. మూసా దేవుని ఆజ్ఞతో సముద్రాన్నిమూసివేస్తాడు. ఫరో తన ప్రాణం పోయేటప్పుడు "లాయిలాహ ఇల్లల్లాహు" (అల్లా ఒక్కడే దేవుడు) అని ఒప్పుకొని ముస్లిం అయ్యాడు.