Jump to content

ఫర్జీ

వికీపీడియా నుండి
ఫర్జీ
సృష్టికర్త రాజ్ - డీకే
రచయిత
దర్శకత్వం రాజ్ & డీకే
తారాగణం
సంగీతంకేతన్ సోదా
సచిన్ - జిగర్
తనిష్క్ బగ్చి
దేశంభారతదేశం
అసలు భాషహిందీ
సిరీస్‌ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య8
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్రాహుల్ గాంధీ
ప్రొడ్యూసర్ రాజ్ & డీకే
ఛాయాగ్రహణంపంకజ్ కుమార్
ఎడిటర్సుమీత్ కోటియాన్
నిడివి42–66 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీడి2ఆర్ ఫిలిమ్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్అమెజాన్ ప్రైమ్ వీడియో
చిత్రం ఫార్మాట్4కె యూహెచ్ డి
ఆడియో ఫార్మాట్డాల్బీ డిజిటల్ 5.1
వాస్తవ విడుదల10 ఫిబ్రవరి 2023 (2023-02-10)

ఫర్జీ 2023లో హిందీలో విడుదలైన వెబ్‌సిరీస్. డి2ఆర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో రాజ్ - డీకే ఈ వెబ్‌సిరీస్ ను నిర్మించారు. షాహిద్ కపూర్, విజయ్​ సేతుపతి, కె.కె. మీనన్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో మొత్తం 8 ఎపిసోడ్స్ తో ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది.[1]

సన్నీ (షాహిద్ కపూర్) ఒక ఆర్టిస్ట్, తన తాతయ్య (అమోల్ పారేకర్) తో కలిసి ఉంటాడు. ఆయన ఏదైనా ఒక పెయింటింగ్ చూపిస్తే అది ఎలా ఉందో అలానే గీయడం అతడి ప్రత్యేకత, కానీ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటాడు.ఈ క్రమంలో సన్నీకి ఒక ఆలోచన వస్తుంది. సన్నీ మిత్రుడు ఫిరోజ్ తో కలిసి దొంగ నోట్లు తయారు చేయాలి అని అనుకుంటాడు. సన్నీ ఈ పని చేస్తున్న విషయం ఒక అండర్ వరల్డ్ కింగ్ అయిన మన్సూర్ దలాల్ (కే కే మీనన్) కి తెలియడంతో సన్నీని తన దగ్గర పని చేయమని అడుగుతాడు. దొంగనోట్ల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా పనిచేసే పోలీస్ అధికారి మైఖేల్ (విజయ్ సేతుపతి) వస్తాడు. సన్నీ చేస్తున్న పనిని మైఖేల్ అడ్డుకోగలిగాడా? మైకేల్ కి ఫేక్ కరెన్సీ ఎక్స్పర్ట్ మేఘ (రాశీ ఖన్నా) ఎలా సహాయపడింది? సన్నీ ఏం చేశాడు? తన కల నెరవేర్చుకున్నాడా? లేదా అనేదే మిగతా కథ.[2][3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: డి2ఆర్ ఫిలిమ్స్
  • నిర్మాత: రాజ్ - డీకే
  • కథ: సీతా మీనన్, సుమన్ కుమార్, రాజ్ - డీకే
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్ - డీకే
  • సంగీతం: కేతన్ సోదా, సచిన్ - జిగర్, తనిష్క్ బగ్చి
  • సినిమాటోగ్రఫీ: పంకజ్ కుమార్

మూలాలు

[మార్చు]
  1. Eenadu (25 December 2023). "మెప్పించిన వెబ్‌సిరీస్‌లు.. మీరేమైనా మిస్‌ అయ్యారా..?". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
  2. A. B. P. Desam (10 February 2023). "'ఫర్జీ' రివ్యూ : 'ఫ్యామిలీ మ్యాన్' రేంజ్ ఉందా? విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్‌ల వెబ్ సిరీస్ ఎలా ఉం". Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
  3. Eenadu (10 February 2023). "రివ్యూ: ఫర్జీ (వెబ్‌సిరీస్‌)". Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఫర్జీ&oldid=4067265" నుండి వెలికితీశారు