బండి లింగారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బండి లింగారెడ్డి

పదవీ కాలం
19 మే 2021 – 11 డిసెంబర్ 2023

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతదేశం
సంతానం 1
నివాసం హైదరాబాద్
వృత్తి విద్యావేత్త

బండి లింగారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌. ఆయన 2021, మే 19న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. ఈ పదవిలో ఆయన ఆరేళ్లపాటు కొనసాగనున్నాడు.[1][2]

తెలంగాణ రాష్ట్రంలో 2023లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వంలో నియమితులైన టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, మిగతా ముగ్గురు సభ్యులు తమ పదువులకు రాజీనామా చేశారు.[3]

జననం, విద్యాభాస్యం[మార్చు]

బండి లింగారెడ్డి, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, వేంసూరు మండలం, కందుకూరు గ్రామంలో బండి కృష్ణారెడ్డి, మంగతాయారు దంపతులకు జన్మించాడు. లింగారెడ్డి కందుకూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు, సత్తుపల్లి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. ఆయన ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పూర్తి చేశాడు.[4]

వృత్తి జీవితం[మార్చు]

లింగారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి అయిన తర్వాత 1996 నుంచి హైదరాబాద్‌లోని చైతన్య భారతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అధ్యాపకుడిగా చేరాడు. ఆయన ప్రస్తుతం సీబీఐటి కళాశాలలో ప్రొఫెసర్‌గా, హెచ్‌వోడీగా పనిచేస్తున్నాడు.[5][6]

మూలాలు[మార్చు]

  1. Sakshi (20 May 2021). "టీఎస్‌పీఎస్సీకి కొత్త కళ". Sakshi. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
  2. The Indian Express (19 May 2021). "Dr. B Janardhan Reddy appointed TSPSC Chairman". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
  3. Eenadu (11 January 2024). "టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం". Archived from the original on 11 January 2024. Retrieved 11 January 2024.
  4. Namasthe Telangana (19 May 2021). "టీఎస్‌పీఎస్‌సీ సభ్యుడిగా లింగారెడ్డి". Namasthe Telangana. Archived from the original on 20 మే 2021. Retrieved 21 May 2021.
  5. Andhrajyothy (20 May 2021). "టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా బండి లింగారెడ్డి". www.andhrajyothy.com. Retrieved 21 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  6. Namasthe Telangana ePaper, Namasthe (20 May 2021). "Namasthe Telangana ePaper". Namasthe Telangana ePaper. Archived from the original on 21 May 2021. Retrieved 21 May 2021.