బజరంగ్ మనోహర్ సోన్వానే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బజరంగ్ మనోహర్ సోన్వానే
బజరంగ్ మనోహర్ సోన్వానే


పదవీ కాలం
2024–ప్రస్తుతం
ముందు ప్రీతం ముండే
నియోజకవర్గం బీడ్

వ్యక్తిగత వివరాలు

జననం 1971
ఆనంద్‌గావ్, కైజ్ జిల్లా, మహారాష్ట్ర
రాజకీయ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ఎన్‌సీపీ
జీవిత భాగస్వామి సారిక
నివాసం ఆనంద్‌గావ్, కైజ్ జిల్లా, మహారాష్ట్ర

బజరంగ్ మనోహర్ సోనావానే భారతదేశాన్ని చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బజరంగ్ మనోహర్ సోన్వానే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలోకి అవీచి పార్టీలో బీడ్ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేసి ఆ తరువాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రీతం ముండే చేతిలో 1,68,368 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈ ఎన్నికలో ప్రీతం ముండేకు 678,175 ఓట్లు, భజరంగ్ మనోహర్ సోనావానే 5,09,807 ఓట్లు వచ్చాయి. ఆయన ఎన్‌సీపీలో చీలిక తర్వాత అజిత్ పవార్ వర్గానికి మద్దతు పలికి 2024 లోక్‌సభ ఎన్నికలు ప్రకటించిన వెంటనే ఎన్‌సీపీ (ఎస్‌పీ)లో చేరాడు.

బజరంగ్ మనోహర్ సోన్వానే 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ (ఎస్‌పీ) నుండి పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి పంకజా ముండేపై 6,553 ఓట్ల స్వల్ప తేడాతో తొలిసారి గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఈ ఎన్నికలలో బజరంగ్ సోనావానేకు 683950 ఓట్లు, పంకజా ముండేకు 677397 ఓట్లు వచ్చాయి.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Newsx (6 June 2024). "Lok Sabha 2024: Winners with Highest & Lowest Victory Margins" (in ఇంగ్లీష్). Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.
  2. Firstpost (5 June 2024). "Lok Sabha election results 2024: From 48 to 684 votes, candidates who won with the smallest margins". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Beed". Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.