బడ్డుకొండ అప్పల నాయుడు
Appearance
బడ్డుకొండ అప్పల నాయుడు/బడ్డుకొండ అప్పలనాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు, వైఎస్సార్సీపీ నేత.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]నాయుడు 1975లో విజయనగరం జిల్లా డెంకాడ మండలం లో మోపాడ గ్రామంలో జన్మించారు. బడ్డుకొండ అప్పలనాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ కు బంధువు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]నాయుడు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా 2000-2009 లలో బాధ్యతలు నిర్వహించారు. 2009 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు. 2014 లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పతివాడ నారాయణస్వామి నాయుడు చేతిలో ఓడిపోయారు. 2019లో వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థిగా నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం నుండి రెండవసారి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు.,.[3] [4]