బబితా కపూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బబిత
2001లో బబిత
జననం
బబితా హరి శివదాసాని

(1947-04-20) 1947 ఏప్రిల్ 20 (వయసు 77)[1]
కరాచీ, సింద్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు సింధ్, పాకిస్థాన్)[2]
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1966–1973
జీవిత భాగస్వామి
పిల్లలు2; (కరిష్మా కపూర్, కరీనా కపూర్)
తల్లిదండ్రులు
  • హరి శివదాసాని (తండ్రి)

బబితా శివదాసాని కపూర్ (జననం 1947 ఏప్రిల్ 20), హిందీ భాషా చిత్రాలలో నటించిన భారతీయ రిటైర్డ్ నటి. ఆమెను బబిత అని కూడా పిలుస్తారు, నటుడు హరి శివదాసాని కుమార్తె. ఆమె తన సమకాలీన నటి సాధన శివదాసానికి కజిన్. ఆమె తొలి చిత్రం విజయవంతమైన డ్రామా దస్ లఖ్ (1966), కానీ అది రాజేష్ ఖన్నా సరసన నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ రాజ్ (1967) ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.

1966 నుండి 1973 వరకు, ఆమె బాక్సాఫీస్ విజయాలు దస్ లఖ్ (1966), ఫర్జ్ (1967), హసీనా మాన్ జాయేగీ, కిస్మత్ (రెండూ 1968లో), ఏక్ శ్రీమాన్ ఏక్ శ్రీమతి (1969), డోలీ (1969), కబ్? క్యూన్? ఔర్ కహాన్? (1970), కల్ ఆజ్ ఔర్ కల్ (1971), బాన్‌ఫూల్ (1971) వంటి పంతొమ్మిది చిత్రాలలో ప్రధాన కథానాయికగా నటించింది.

1971లో నటుడు రణధీర్ కపూర్‌తో వివాహం తర్వాత, ఆమె జీత్ (1972), ఏక్ హసీనా దో దివానే (1972) చిత్రాల్లో నటించింది. ఆమె తదుపరి విడుదలైన సోనే కే హాత్ (1973) సగటు విజయాన్ని సాధించింది, అయినప్పటికీ ఆమె తన సినీ కెరీర్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది.[3] ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు హిందీ సినిమా నటీమణులైన కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఉన్నారు.

ప్రారంభ జీవితం

[మార్చు]

ముంబైలో స్థిరపడ్డ సింధీ హిందూ కుటుంబానికి చెందిన నటుడు హరి శివదాసాని, బ్రిటిష్ క్రైస్తవ తల్లి బార్బరా శివదాసాని దంపతులకు కరాచీలో బబిత జన్మించింది.[4] దిగ్గజ నటి సాధనా శివదాసాని ఆమె తండ్రి తరపు బంధువు, సమకాలీనురాలు కూడా.[5]

కెరీర్

[మార్చు]

ఆమె సినీ జీవితంలో పంతొమ్మిది చిత్రాలలో నటించింది. ఆమె మొదటి చిత్రం 1966లో విజయవంతమైన చిత్రం దస్ లఖ్, ఇందులో సంజయ్ ఖాన్, ఓం ప్రకాష్, ఆమె కోడలు నీతూ సింగ్ నటించారు. అయితే, వాస్తవానికి ఆమె సంతకం చేసిన మొదటి చిత్రం రాజేష్ ఖన్నాతో కలిసి నటించిన రాజ్ (1967), ఇది 1967లో విడుదలైంది. ఆమె అతిపెద్ద బాక్సాఫీస్ విజయాలలో ఏక్ శ్రీమాన్ ఏక్ శ్రీమతి, హసీనా మాన్ జాయేగీ (1968), ఫర్జ్, బాన్‌ఫూల్, జీతేంద్రతో ఏక్ హసీనా దో దివానే, రాజేష్ ఖన్నాతో డోలీ, షమ్మీ కపూర్‌తో తుమ్సే అచ్ఛా కౌన్ హై (1969), బిస్వజీత్‌తో కిస్మత్, ధర్మేంద్రతో కబ్ ? క్యూన్? ఔర్ కహాన్? (1970), మనోజ్ కుమార్‌తో పెహచాన్ చిత్రాలు ఉన్నాయి.

1971లో, ఆమె తన కాబోయే భర్త రణధీర్ కపూర్‌తో పాటు మామగారు రాజ్ కపూర్, తాతయ్య పృథ్వీరాజ్ కపూర్‌లతో కల ఆజ్ ఔర్ కల్ చిత్రంలో నటించింది. రణధీర్‌తో ఆమె వివాహం జరిగిన తర్వాత, వారు ఎం. జి. రామచంద్రన్, జయలలిత నటించిన ఎన్ అన్నన్‌కి రీమేక్ అయిన జీత్‌లో దర్శకుడు కె. శంకర్ చేత కలిసి నటించింది. ఆమె 1973లో తన భర్త కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి చిత్ర పరిశ్రమను విడిచిపెట్టింది.[6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కల్ ఆజ్ ఔర్ కల్ (1971) చిత్రంలో రణధీర్ కపూర్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు బబిత ప్రేమలో పడింది. వారు 1971 నవంబరు 6న అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.[7] వారికి ఇద్దరు పిల్లలు, నటీమణులు కరిష్మా కపూర్, కరీనా కపూర్.[8][9][10] 1980లలో, నటుడిగా రణధీర్ కెరీర్ క్షీణించడం ప్రారంభించింది. వారి మధ్య సఖ్యత దెబ్బతిన్నది. దీంతో, వారు చాలా సంవత్సరాలు వేర్వేరుగా ఉన్నా ఈ జంట 2007లో మళ్లీ కలిశారు.[11]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర నోట్స్
1966 దస్ లాక్ రీటా తొలిచిత్రం
1967 రాజ్ సప్నా
ఫర్జ్ సునీత
1968 కిస్మత్ రోమా
హసీనా మాన్ జాయేగీ అర్చన (ఆర్చీ)
ఔలాద్ భారతి
1969 తుమ్సే అచ్ఛా కౌన్ హై ఆశా
ఏక్ శ్రీమాన్ ఏక్ శ్రీమతి దీపాలి లఖన్‌పాల్
డోలి ఆశా
అన్మోల్ మోతీ మనీషా
అంజానా రచనా మల్హోత్రా
1970 కబ్? క్యూన్? ఔర్ కహాన్? ఆశా ప్రసాద్
పెహచాన్ బర్ఖా
1971 కల్ ఆజ్ ఔర్ కల్ మోనికా (మోనా) రణధీర్ కపూర్‌తో కలిసి[12]
బిఖ్రే మోతీ ఇంద్రాణి
బాన్‌ఫూల్ గులాబీ
1972 జీత్ కోయిలి / రాసిలి
ఏక్ హసీనా దో దివానే నీతా
1973 సోనే కే హాత్ ప్రేమ

మూలాలు

[మార్చు]
  1. "Kareena Kapoor Khan and Saif Ali Khan at Babita Kapoor's 70th birthday". Vogue India. 20 April 2017.
  2. "Babita". Cinemaazi (in ఇంగ్లీష్). She was born Babita Hari Shivdasani on 20 April, 1947, to a British-born mother Barbara and an Indian actor father, Hari Shivdasani, who belonged to a prominent Bombay-based Sindhi family.
  3. Sone Ke Haath (1973) - Trivia - IMDb (in అమెరికన్ ఇంగ్లీష్), retrieved 2024-02-25
  4. "Saif to join girlfriend Kareena and her family for midnight mass". Mid-Day. 23 December 2008. Archived from the original on 1 July 2015. Retrieved 1 July 2015.
  5. "I don't acknowledge Babita: Sadhana - Times of India". The Times of India. 2 December 2013.
  6. "An ode to Bollywood's yesteryear superstar Babita Kapoor". filmfare.com.
  7. Monika Rawal Kukreja (25 April 2017). "Why should I want to divorce Babita?' asks Randhir Kapoor about his estranged wife". Hindustan Times. Archived from the original on 11 August 2013. Retrieved 22 April 2017.
  8. Meena Iyer (24 February 2010). "Kareena: Yes, I eat!". The Times of India. Archived from the original on 11 August 2013. Retrieved 16 October 2012.
  9. "Kareena, Saif at St Andrew's Church in Mumbai". The Times of India. 26 December 2011. Archived from the original on 17 December 2013. Retrieved 17 October 2012.
  10. "Kareena, family and friends go to midnight mass at St Andrews". Mid-day.com. 26 December 2008.
  11. Monika Rawal Kukreja (25 April 2017). "Why should I want to divorce Babita?' asks Randhir Kapoor about his estranged wife". Hindustan Times. Archived from the original on 11 August 2013. Retrieved 22 April 2017.
  12. "Kal Aaj Aur Kal will always be my favourite: Randhir Kapoor". Hindustan Times. 16 April 2016. Retrieved 28 August 2018.